అన్వేషించండి

Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్, 600 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత!

Basara IIIT : నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో శుక్రవారం ఫుడ్ పాయిజన్ అయింది. 600 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

Basara IIIT : నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో శుక్రవారం ఫుడ్ పాయిజన్ జరిగింది. మెస్ లో శుక్రవారం మధ్యాహ్నం ఎగ్ కర్రీ రైస్ తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రెండు మెస్ లలో శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులకు ఆహారంగా ఎగ్ కర్రీ రైస్ ను అందించారు. అయితే ఎగ్ కర్రీ రైస్ తిన్న విద్యార్థులు గంటన్నర తర్వాత వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. 600 మందికి పైగా విద్యార్థులు స్వల్ప వ్యవధిలోనే వాంతులు, విరేచనాలు  చేసుకున్నారు.  వారంతా హాస్టల్ గదుల నుంచి చికిత్సల కోసం ట్రిపుల్ ఐటీలోని ఆస్పత్రికి వచ్చారు. 

 పలువురికి తీవ్ర అస్వస్థత 

ఫుడ్ పాయిజన్ తో అస్వస్థత చెందిన విద్యార్థులకు  ట్రిపుల్ ఐటీ ఆసుపత్రి నిర్వాహకులు ప్రథమ చికిత్సలు నిర్వహించారు. తీవ్ర అస్వస్థతో ఉన్న పలువురు విద్యార్థులను రెండు అంబులెన్సులలో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ట్రిపుల్ ఐటీలోని ఆసుపత్రిలో వైద్య సిబ్బంది తక్కువగా ఉండడం, అస్వస్థత చెందిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సత్వర వైద్య సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే భైంసా, ముధోల్ ఆసుపత్రుల నుంచి వైద్యాధికారులను, ఆరోగ్య సిబ్బందిని బాసర ట్రిపుల్ఐటీకి తరలిస్తున్నారు. 

Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్, 600 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత!

ఈ-1, ఈ-2 మెస్ ల్లో  

బాసర ట్రిపుల్ ఐటీలో ఈ -1, ఈ -2 మెస్ లో మధ్యాహ్నo భోజనం చేసిన సుమారు 600 మంది అస్వస్థతకు గురయ్యారు. వారికి ఆర్జీయూకేటీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.  బాసర ట్రిబుల్ ఐటీ అంబులెన్స్ లో కొందరిని ఆసుపత్రికి తరలించారు. ఏబీపీ దేశం రిపోర్టర్ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ను ఈ ఘటనపై వివరణ కోసం సంప్రదించగా ఆయన స్పందించలేదని తెలుస్తోంది. 

Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్, 600 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత!

మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా 

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఫుడ్ పాయిజన్ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. కలెక్టర్‌, బాసర ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితి గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులను జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ జరిపి తక్షణమే నివేదిక ఇవ్వాలన్నారు. ఫుడ్ పాయిజన్ కు  కారణాలు గుర్తించి రిపీట్ కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. 

Also Read : Bhadrachalam Danger Zone : భద్రాచలం వద్ద 75 అడుగులకు చేరనున్న గోదావరి - ఇదే జరిగితే ఏమవుతుందంటే ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Embed widget