అన్వేషించండి

Liquor Price: మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ ! ధరల తగ్గింపుపై త్వరలో ప్రకటన

Liquor Price In Telangana: త్వరలోనే మద్యం ధరలను తెలంగాణ సర్కార్ తగ్గించనుంది. మద్యం విక్రయాలు తగ్గడానికి పెంచిన ధరలే కారణమని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.

Liquor Price In Telangana: మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుందా అంటే అవుననే పరిస్థితి కనిపిస్తోంది. త్వరలోనే మద్యం ధరలను తెలంగాణ సర్కార్ తగ్గించనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. కొవిడ్19 వ్యాప్తి సమయంలో రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ మద్యం రేట్లను 20 శాతం వరకు పెంచింది. పెరిగిన ధరలతో లిక్కర్‌ విక్రయాలు తగ్గినట్లు ప్రభుత్వం గుర్తించింది. మద్యం విక్రయాలు తగ్గడానికి పెంచిన ధరలే కారణమని భావిస్తున్న ఎక్సైజ్ శాఖ అందుకు తగిన చర్యలు చేపట్టింది. 

ధరల తగ్గింపు కోసం శాఖ ప్రతిపాదనలు 
కరోనా వ్యాప్తి (Corona Virus In Telangana) తగ్గినా మద్యం అమ్మకాలు తగ్గడంతో అబ్కారీ శాఖ దీనిపై ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే మద్యం రేట్లను తగ్గించడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. లిక్కర్ అమ్మకాలు మళ్లీ పెరిగేలా చేసేందుకు ఒక్కో బాటిల్‌పై రూ.10 తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధరల తగ్గింపుపై ఆ శాఖ నుంచి త్వరలోనే అధికార ప్రకటన రానుందని మందు బాబులు సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ బీర్లు మినహా ఇండియాలో తయారయ్యే మద్యంపై స్వల్పంగా ధరలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.గ

తెలంగాణ వ్యాప్తంగా 2620 వైన్స్ షాపులతో పాటు వెయ్యికి పైగా బార్లు, క్లబ్బులు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక రెస్టారెంట్స్ ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి మద్యం డిపోల నుంచి సరుకు తక్కువగా రవాణా అవుతోంది. అయితే న్యూ ఇయర్ తరువాత విక్రయాలు తగ్గడమే అందుకు కారణమని ఎక్సైజ్ శాఖ భావించి, ధరల తగ్గింపు కోసం ప్రతిపాదనలు చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 20 శాతం వరకు లిక్కర్ రేటు పెంచింది. 

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు మార్చి 7న ప్రారంభం కానున్నాయి. కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో ఈసారి ఈ విషయంపై అంతగా ఫోకస్ చేయడం లేదు. దాదాపు రెండు వారాల పాటు సమావేశాలు జ‌రిగే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది.  గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై అధికార టీఆర్ఎస్ కు, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలకు మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. మేడారం జాతర సమయంలోనూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ప్రొటోకాల్ పాటించకుండా తెలంగాణ ప్రభుత్వం అవమానించిందని విమర్శిస్తున్నాయి విపక్షాలు. తాజాగా గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో మరోసారి పాత వివాదాలు తెరపైకి వస్తున్నాయి.

Also Read: Governor Tamilisai: అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై తమిళి సై ఆగ్రహం

Also Read: Priyanka Narula: చింతకాయతో వరల్డ్‌ ఫేమస్‌, హైదరాబాద్‌ మహిళ వండర్‌ఫుల్ విక్కర్ స్టోరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
The Raja Saab: రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
Embed widget