అన్వేషించండి

Priyanka Narula: చింతకాయతో వరల్డ్‌ ఫేమస్‌, హైదరాబాద్‌ మహిళ వండర్‌ఫుల్ విక్కర్ స్టోరీ

అందరి దారిలో వెళ్లి విసిగిపోయిన ఆమె.. సరికొత్త పంథాను ఎంచుకున్నారు. ఏడాది పాటు ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నా ఆ తర్వాత మంచి గుర్తింపు వచ్చింది. లాక్‌డౌన్ టైం కూడా బాగా గుర్తింపు వచ్చింది.


నేటికాలంలో ఇల్లు నిర్మాణంపై ఎంత శ్రద్ధ పెడుతున్నారో ఇంటీరియర్‌, ఫర్మిచర్‌పై కూడా అంతకు మించిన ఫోకస్ పెడుతున్నారు. అందుకే డిజైనర్స్‌కు గిరాకీ పెరిగింది. అందరిలా ఆలోచించి ఉంటే ప్రియాంక కోసం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేదేమో. కానీ ఆమె ఆలోచన విధానం సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. 

పుట్టింది కాన్సూర్- స్థిరపడింది హైదరాబాద్

ప్రియాంక నరుల(Priyanka Narula). పుట్టి పెరిగింది కాన్పూర్‌లో. స్థిరపడింది మాత్రం హైదరాబాద్‌లో. ఇంజినీరింగ్ చేసిన ఆమెకు ఇంటీరియర్ డిజైన్‌పై ఇంట్రెస్ట్‌. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న డిజైన్లును చెక్ చేసింది. వాటిలో క్రియేటివిటీ ఉంది గానీ ఎక్కడో సోల్ మిస్సవుతుందన్న భావన ఆమెలో ఏర్పడింది. 

పని పాతదే- ఆలోచనే కొత్తది

ఇలా ఆలోచిస్తున్న టైంలో ఆమె మెదడులో వచ్చిన ఆలోచనే కేన్‌ అల్లికలు. ఎలాంటి టెక్నాలజీ లేని టైంలోనే భిన్న డిజైన్లతో వెదురుబుట్టలు అల్లేవాళ్లు ఎన్నో అద్భుతాలు చేశారు. ఇప్పుడు వాళ్లకు కాస్త ప్రోత్సాహమిస్తే ప్రపంచమే ఇటువైపు చూస్తుందని భావించి స్టడీస్ మొదలు పెట్టారు. 

విక్కర్‌తో విక్టరీ

అలా స్టడీ చేయగా ప్రియాంక  మైండ్‌ నుంచి వచ్చిన ఆలోచనే ది విక్కర్ స్టోరీ. కేన్‌ సన్నగా ఉంటుంది. ఎలాంటి డిజైన్స్‌ చేయాలన్నా దానికి అనుగుణంగా మారే స్వభావం ఉంటుంది. అందుకే వెదురు నారతో కొత్త చరిత్ర సృష్టించారు ప్రియాంక. 

గ్లోబల్‌గా ఫేమస్

ఎలాంటి వ్యర్థాలు లేకుండా వందకు వందశాతం కేన్‌ మెటీరియల్‌ వాడుకోవచ్చని చెబుతున్నారు ప్రియాంక. ఎలాంటి కృత్రిమ మెటీరియల్ వాడకుండా సహజ సిద్ధమైన వాటితోనే ఈ ఫర్మిచర్ తయారు చేస్తున్నట్టు వెల్లడించారామె. రవాణాకు చాలా సౌకర్యవంతంగా ఉండే ఈ ఫర్మిచర్ ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు. అందుకే గ్లోబల్‌గా ఈమె డిజైన్లు చాలా ఫేమస్‌ అయిపోయాయి. 

అంతరించిపోతున్న వృత్తికి ఆయువు  

ఈ రంగంలో పని చేస్తున్న టైంలో చాలా చాలా అంశాలను గుర్తించారు ప్రియాంక. నైపుణ్యం కలిగిన వర్కర్స్ ఉన్నప్పటికీ వాళ్లను ఆధునీకరించేవాళ్లు లేకపోవడంతోనే ఈ వృత్తి అంతరించిపోయే స్థితికి వచ్చిందని తెలుసుకున్నారు. అందుకే సంప్రదాయబద్దమైన అల్లికలకు ఆధునికత జోడించారు. అలా తీసుకొచ్చిన డిజైన్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ వచ్చింది. 

చింతపండు ఇచ్చిన స్ఫూర్తి

ఇలా సంప్రదాయమైన అల్లికలకు త్రీడీ టెక్నాలజీ జోడి తీసుకొచ్చిన మొదటి ఉత్పత్తి పేరు ఇమ్లీ. అంటే చింతకాయ మాదిరిగా ఉండే ఓ విధమైన డిజైన్ తీసుకొచ్చారు. చూడటానికి చాలా అందగా కనిపించే ఈ డిజైన్‌ హాట్ కేక్స్‌లో అమ్ముడు పోయింది. 

ఇమ్మీ డిజైన్‌ ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని వైవిధ్యమైన డిజైన్లకు ఊతమిచ్చింది. మొదటి తయారు చేసిన డిజైన్ అమ్మ వంటకాన్ని గుర్తు చేస్తుంది. అంతేనా ఆ డిజైన్ కోసం వాడిన ముడి పదార్థం కూడా మన చుట్టూ పెరిగిందే అంటే ఆశ్చర్యంగానూ ఉంటుంది. 

ఇలా లోకల్‌గా మన చుట్టూ ఉన్న కొన్ని వస్తువుల నుంచి డిజైన్లు రూపొందించి అంతర్జాతీయ ఐకాన్ అయ్యారు ప్రియాంక. లిఫాఫా ఛైర్‌, బ్లూమ్ బెంచ్‌, కోరల్ ల్యాంప్‌ ఇలాంటివన్నీ ఇమ్లీ తయారీతో వచ్చిన ఐడియాలే. 

అంతర్జాతీయ గుర్తింపు

ఎన్నో అనుమానాలు, మరెన్నో ఆలోచనతో ఈ ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు ప్రియాంక. అసలు ఇలాంటి ఉత్పత్తులు దేశంలో ఎవరైనా కొంటారా, అమ్ముడు పోతాయా లేదో అని చాలా తర్జనభర్జన పడ్డారు. ఏడాదిన్నర అలానే సాగింది. దేశ వ్యాప్తంగా చాలా వేదికలపై తమ ప్రోడెక్ట్ స్పెషాలిటీ వివరించారు ప్రియాంక. 2019 వరకు ఇదే పని చేశారు. 2020 ఓ అంతర్జాతీయ కంపెనీ ఇచ్చిన అవార్డుతో విక్కర్‌ స్టోరీ కథ మారిపోయింది.  

అంతా హ్యపీ

ఈ హైదరాబాద్‌ కంపెనీలో ఇరవై ఐదు మంచి పని చేస్తున్నారు. వాళ్లు చేస్తున్న పనికి అంతర్జాతీయంగా గుర్తింపు వస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నారు. ప్రియాంక కూడా వాళ్ల పని తనంపై సంతృప్తిగానే ఉన్నారు. వాళ్ల వల్లే కంపెనీ పేరు ఈ స్థాయికి వచ్చిందని చెబుతున్నారు. అంతరించిపోతున్న దశలో ఉన్న వృత్తికి ఏదో ఈ స్థాయికి గుర్తింపు తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉంటున్నారు ప్రియాంక. 

కలిసి వచ్చిన లాక్‌డౌన్

లాక్‌డౌన్‌ తమకు చాలా ఉపయోగపడిందంటున్నారు ప్రియాంక. ఆ టైంలో చాలా రకాల డిజైన్లు చూశామని, వాటికి దీటుగా సరికొత్త డిజైన్లు ప్లాన్ చేసినట్టు చెప్పారు. ఆ టైంలోనే తమ ప్రోడెక్ట్స్‌కి కూడా గుర్తింపు వచ్చిందని చెబుతున్నారు.    ఇక్కడ పని చేస్తున్న వాళ్లంతా హైదరాబాద్‌లోని పాతబస్తీ నుంచి వచ్చిన వాళ్లే. పూర్వ కాలంలో మన పూర్వీకులు ఉపయోగించే వస్తువుల మాదిరిగా నేటి తరానికి ఉపయోగపడే డిజైన్లు తయారు చేయడం వీళ్ల విజయ రహస్యం.

డిమాండ్ పెరిగింది- ధర తగ్గింది

ఇంట్లో ప్రతి ఒక్కరు వాడే వస్తువులన్నింటినీ కేన్‌తో తయారు చేయడమే తమ ముందు ఉన్న లక్ష్యమంటున్నారు ప్రియాంక. డిమాండ్ పెరుగుతున్న కొద్దీ తమ వస్తువుల ధర కూడా తగ్గుతుందోన్నారు. మొదట తయారు చేసిన ఇమ్లీ డిజైన 42 వేలకు విక్రయిస్తే... తర్వాత తయారు చేసిన ప్రోడెక్ట్స్‌ ధర 18వేల రూపాయలకు మించలేదు.  ప్రస్తుతం వంద మంది క్లైంట్స్‌కు కేన్ ఉత్పత్తులు అమ్ముతున్నారు ప్రియాంక. యూకే నుంచి ఆర్డర్స్ వస్తున్నట్టు చెబుతున్నారు. మిగతా దేశాలకు ఉత్పత్తులు పంపి భారత్‌ దేశ ప్రైడ్‌ను చూపించాలని భావిస్తున్నట్టు చెప్పారు ప్రియాంక. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Embed widget