Khammam News: అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి - ఫ్రెండ్స్‌పై అనుమానం!
Khammam News: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణ విద్యార్థి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
![Khammam News: అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి - ఫ్రెండ్స్‌పై అనుమానం! Khammam Student Akhil Sai Died in America Gun Fire Missing in His Hands Khammam News: అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి - ఫ్రెండ్స్‌పై అనుమానం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/2e4bc613402c6b05dab1f8b3fd6144b01675826550836519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Khammam News: ఉన్నత చదువులు చదివి.. పెద్ద కొలువు చేసి తమను బాగా చూసుకుంటాడని అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ వార కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయాయి. ఎంఎస్ చేసేందుకు వెళ్లిన కుమారుడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లాకు చెందిన మహాంకాళి అఖిల్ సాయి సోమవారం రాత్రి బుల్లెట్ తగిలి ప్రాణాలు విడిచాడు. చేతిలో గన్ మిస్ ఫైర్ అయిందని మొదట చాలా మంది భావించారు. కానీ తర్వాత ఫ్రెండ్స్ హస్తం ఇందులో ఉందన్ని అనుమానం మొదలైంది. విషయం తెలుసుకున్న అఖిల్ సాయి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్నతంగా బతకాల్సిన కుమారుడు ఉలుకూ పలుకూ లేకుండా పోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అఖిల్ సాయి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
అసలేం జరిగిందంటే..?
అమెరికాలోని అలబామా రాష్ట్రం ఆబర్న్ సిటీలో ఉంటున్న 25 ఏళ్ల మహాంకాళి అఖిల్ సాయి అనే యువకుడు బుల్లెట్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అఖిల్ సాయి తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన వాడు. అయితే ఏడాది క్రితమే అతడు ఎంఎస్ చేసేందుకు యూఎస్ వెళ్లాడు. అబర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. అలబామాలోని మోంట్ గోమెరీలో గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి డ్యూటీ చేస్తున్న టైంలో ఈ దుర్ఘటన జరిగింది. సెక్యూరిటీ గార్డు చేతిలో ఉన్న తుపాకీ తీసుకొని పరిశీలించబోయాడని... ఆ గన్ మిస్ ఫైర్ అయిందని ప్రచారం జరిగింది. అయితే అఖిల్‌సాయి స్నేహితుడిని ఒకరిని అరెస్టు చేశారని ప్రచారం జరుగుతోంది. రవితేజ అనే స్నేహితుడే కాల్పులు జరిపాడని ప్రచారం నడుస్తోంది. అందుకే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని సమాచారం. కాల్పుల్లో బుల్లెట్ అఖిల్ సాయి శరీరంలోకి దూసుకెళ్లింది. వెంటనే గ్యాస్ స్టేషన్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అఖిల్ సాయి చనిపోయాడు.
We will do our best to help the bereaved family @KTRoffice please contact and assist https://t.co/Zaz3CCxjZ7
— KTR (@KTRBRS) February 7, 2023
స్పందించిన మంత్రి కేటీఆర్..
అమెరికాలో ప్రాణాలు విడిచిన అఖిల్ సాయిపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అలాగే అఖిల్ సాయి మృతదేహాన్ని తెలంగాణకు తెప్పించేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)