అన్వేషించండి

Raksha Bhandhan 2022 : అక్కకు అపురూపమైన గిఫ్ట్, రూ.ఐదు కాయిన్స్ తో తులాభారం

Raksha Bhandhan 2022 : రక్షా బంధన్ రోజు ఓ అక్కకు తమ్ముడు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. చిన్నప్పటి నుంచి తాను దాచుకున్న నాణాలతో అక్కకు తులాభారం నిర్వహించాడు.

Raksha Bhandhan 2022 : రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల మధ్య బంధానికి, ప్రేమకు నిదర్శనంగా ఉండే ఓ ఆత్మీయ పండుగ. ఈ రాఖీ పూర్ణిమ పండగ తన అక్కకు జీవితాంతం గుర్తు ఉండాలని భావించాడో తమ్ముడు. అనుకున్నదే తడువుగా తాను చిన్నప్పటి నుంచి దాచుకున్న డబ్బుతో రాఖీ పండుగ సందర్భంగా అక్కకు తులాభారం నిర్వహించాడు. 

అక్కకు తులభారం 

 ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్‌ వద్ద బోలగాని బసవ నారాయణ, అరుణ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు వారు రణశ్రీ, త్రివేది. రణశ్రీకి గత సంవత్సరం వివాహం చేశారు తల్లిదండ్రులు. వివాహమైన తర్వాత మొదటిసారిగా వస్తున్న రాఖీ పూర్ణిమ పండుగను తన అక్కకు  జీవితాంతం గుర్తుండిపోయే విధంగా చేయాలనుకున్నాడు  తమ్ముడు త్రివేది. అక్కపై ఉన్న ప్రేమతో తాను చిన్నతనం నుంచి దాచుకున్న డబ్బును అయిదు రూపాయల కాయిన్లుగా మార్చి అక్కకు తులాభారం నిర్వహించాడు. తులాభారంలో సుమారు 11,200 ఐదు రూపాయల కాయిన్స్ తూగాయి. వాటి విలువ సుమారు 56 వేల రూపాయలను కానుకగా ఇచ్చాడు. 

ఘనంగా వేడుక 

ఈ తులాభారం వేడుకకు బంధువులు, స్నేహితులను పిలిచి ఘనంగా నిర్వహించారు. తన అక్కకు ఇలా తులభారం నిర్వహించడం తనకెంతో సంతోషంగా ఉందన్నాడు త్రివేది. తన తమ్ముడు చేసిన ఈ తులాభారం పట్ల అక్క రణశ్రీ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజు అని సంతోషం వ్యక్తం చేసింది. తన కొడుకు అక్క పై ఇంత అభిమానాన్ని చూపడం పట్ల తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇలా ఎక్కడా చూడలేదు 

'నా తమ్ముడు చూపిన ప్రేమకు ఎంతో సంతోషిస్తున్నాను. నా కోసం తమ్ముడు ఇలా డబ్బులు దాస్తున్నాడని తెలియదు. ఇలా తులాభారం నిర్వహించడం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ రాఖీ పండుగ నాకు చాలా స్పెషల్. ఇలానే అందరూ ప్రేమాభిమానాలతో మెలగాలని కోరుకుంటున్నాను. ఇలా తులభారం ఇవ్వడం నేను ఎక్కడా చూడలేదు. తీసుకోవడం కూడా నేనే ఫస్ట్ అనుకుంటున్నాను. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది'. - రణ శ్రీ 

సీఎం కేసీఆర్ రాఖీలు కట్టిన సోదరీమణులు

ప్రగతి భవన్ లో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి ఆయన సోదరీమణులు వచ్చారు. ఇంటికి వచ్చిన తమ ఆడ బిడ్డలను సీఎం కేసిఆర్ సతీమణి శోభమ్మ సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టి రక్షా బంధన్ వేడుకలు జరుపుకున్నారు.  రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీలు కట్టిన అక్కలకు సీఎం కేసిఆర్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. తమ సోదరిని నిండు మనసుతో ఆశీర్వదించారు.

సీఎం కేసీఆర్ మనుమడు మనుమరాలు రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. తన అన్న హిమాన్షుకు చెల్లె అలేఖ్య రాఖీ కట్టింది. తమ మనుమడు మనుమరాలును నిండు నూరేళ్లు జీవించాలని సీఎం కేసీఆర్ శోభమ్మ దంపతులు నిండు మనసుతో దీవించారు.  వేడుకల్లో పాల్గొన్న పెద్దలు కూడా చిన్నారులను దీవించారు. మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Also Read : Rakhi Festival 2022: రాఖీ పౌర్ణమి రోజున బిడ్డ పుడితేనే రక్షాబంధన్ పండుగ- నేటికీ వేడుక చేసుకోని గ్రామం

Also Read : Tricolour In Eye : కంటిలో త్రివర్ణ పతాకం, కోయంబత్తూరు ఆర్టిస్ట్ సాహసం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
Coimbatore : రూ.1, రూ.2 నాణేలతో భార్యకు భరణం-షాకైన కోర్టు, ఆ తర్వాతేమైందంటే..
రూ.1, రూ.2 నాణేలతో భార్యకు భరణం-షాకైన కోర్టు, ఆ తర్వాతేమైందంటే..
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Embed widget