ENG vs SA | ఇండియా రికార్డ్ బద్దలు కొట్టిన ఇంగ్లండ్ | ABP Desam
క్రికెట్లో సంచలనాలు సృష్టించడంలో ఇంగ్లండ్ టీమ్‌కి పెట్టింది పేరు. శుక్రవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్ అలాంటి ఓ సంచలన రికార్డ్ సాధించింది. సౌతాఫ్రికా లాంటి టఫ్ టీమ్‌పై ఏకంగా 30 ఫోర్లు, 18 సిక్స్‌లతో 304 పరుగుల భారీ స్కోర్ సాధించడమే కాకుండా.. తర్వాత బౌలింగ్‌లోనూ అదరగొట్టి.. సఫారీ టీమ్‌ని 158 రన్స్‌కే ఆలౌట్ చేసింది. దీంతో 146 పరుగుల భారీ మార్జిన్‌తో విజయం దక్కించుకుంది. ఇంగ్లీష్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. 39 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లతో సెంచరీ పూర్తి చేసిన సాల్ట్.. చివరి వరకు నాటౌట్‌గా ఉండి.. 235 స్ట్రైక్ రేట్‌తో 60 బంతుల్లో 141 రన్స్ చేశాడు. ఇక సాల్ట్‌కి తోడు ఇంగ్లీష్ కీపర్ జాస్ బట్లర్ కూడా 30 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్స్‌లతో 83 రన్స్ చేశాడు. ఈ గెలుపుతో ఓ టెస్ట్ ప్లేయింగ్ నేషన్‌పై 300+ స్కోర్ చేసిన తొలి టెస్ట్ ప్లేయింగ్ నేషన్‌గా రికార్డ్ సృష్టించింది ఇంగ్లండ్ టీమ్. అయితే ఇప్పటివరకు ఈ రికార్డ్ ఇండియా పేరున ఉండేది. 2024లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 297 రన్స్ చేసి టాప్‌లో ఉంది. అయితే ఇప్పుడా రికార్డ్‌ని ఇంగ్లండ్ టీమ్ బద్దలు కొట్టింది.





















