Sai Durgha Tej: ఫ్రీడమ్‌తో పాటు గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన ఉండాలి - పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్ ఆధార్‌తో లింక్ చేయాలన్న హీరో సాయి దుర్గా తేజ్
Sai Dharam Tej: సోషల్ మీడియా విషయంలో పిల్లల పట్ల పేరెంట్స్ ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలని సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ అన్నారు. వారి ఫేస్ బుక్, ఇన్ స్టా అకౌంట్స్ ఆధార్‌తో లింక్ చేయాలన్నారు.

Sai Durgha Tej About Social Media And Parenting In Abhayam Masoom Summit 2025: పిల్లలు తమతో అన్నీ విషయాలు షేర్ చేసుకునేలా వారికి పేరెంట్స్ ఫ్రీడమ్ ఇవ్వాలని సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ అన్నారు. చిన్నారులపై లైంగిక దాడికి వ్యతిరేక నినాదంతో యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'అభయమ్ మసూమ్ సమ్మిట్ - 2025'లో ఆయన పాల్గొన్నారు.
భారత్ రైజింగ్, యంగ్ ఇండియన్స్, కాన్పిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి శ్రీ సీతక్క, యంగ్ ఇండియన్స్ కో చైర్మన్ శ్రీ భవిన్ పాండ్య, యంగ్ ఇండియన్స్ నేషనల్ చైర్మన్ శ్రీ తరంగ్ ఖురానా, సీఐఐ తెలంగాణ ఛైర్మన్ శ్రీ శివ ప్రసాద్ రెడ్డి, శ్రీమతి జోత్స్న సింగ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 70 నగరాలు, వేల మంది యంగ్ ప్రొఫెషనల్స్ కలిసి ఈవెంట్ నిర్వహించారు.
'ఆధార్ లింక్ చేయాలి'
పిల్లలపై పేరెంట్స్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని... వారి సోషల్ మీడియా అకౌంట్స్ ఆధార్‌తో లింక్ చేయాలని అభిప్రాయపడ్డారు సాయి దుర్గా తేజ్. 'సోషల్ మీడియాలో పిల్లల పట్ల అశ్లీలత, అసభ్యత తగ్గించాలంటే పిల్లల అకౌంట్స్ ఆధార్ కార్డుకు జత చేయాలి. వారి ఐడీలు పేరెంట్స్ నెంబర్‌కు కనెక్ట్ చేయడమో లేదా ఆధార్ కార్డుకు కనెక్ట్ చేయడమో ఏదో ఒకటి చేయాలి. ఇలా చేస్తే పిల్లల్లో భయం పెరుగుతుంది. ప్రస్తుతం అందరూ బిజీగా ఎప్పుడూ సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. కనీసం వారంలో ఓ పూట అయినా మన ఫ్యామిలీతో కలిసి గడపాలి. అందరికీ బాధ్యతల్ని నేర్పించాలి.' అని అన్నారు.
Also Read: తండ్రి కూతురు మధ్యలో ఓ లవర్ - ప్రతీ మిడిల్ క్లాస్ ఫాదర్‌ను టచ్ చేసే 'బ్యూటీ' ట్రైలర్
ఫ్రీడమ్‌తో పాటు
పిల్లలకు పేరెంట్స్ ఫ్రీడమ్ ఇవ్వడంతో పాటు గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలని సాయి తేజ్ అన్నారు. 'మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. సోషల్ మీడియాలో చిన్నారులపై అబ్యూజ్ చేస్తున్నారు. అలాంటి కామెంట్స్ చేస్తే కూడా లైక్స్ చేస్తున్నారు. నవ్వుతున్నారు. ఇవన్నీ చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మనం ఇలాంటి సమాజాన్ని కోరుకుంటున్నామా? దీనిపై ఎవరైనా మాట్లాడతారా? అని ఎదురుచూసిన ఎవరూ రియాక్ట్ కాలేదు. ఆ బాధ్యత నేను తీసుకున్నా. సోషల్ మీడియాలో అశ్లీలత గురించి మాట్లాడినప్పుడు పేరెంట్స్‌ను హెచ్చరించాను.
డార్క్ కామెడీ అంటూ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. వాక్ స్వాతంత్ర్యం ఉన్నా ఎదుటి వాళ్లని బాధ పెట్టే వరకూ ఉండకూడదు. 2015 లో థింక్ పీస్ అనే సంస్థతో పని చేశాను. అరకులో చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి పోరాడా. అక్కడ స్కూల్ నిర్మించాను. తెలంగాణలో కొంతమంది పిల్లల్ని కూడా దత్తత తీసుకుని వారి చదువు, పోషణ ఇలా అన్నింటినీ చూసుకుంటాను. పేరెంట్స్‌తో అన్ని విషయాల్ని పంచుకునేలా పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలి. పిల్లలకు ప్రతీ విషయాన్ని ప్రేమతో చెప్పే ప్రయత్నం చేయాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయాల్ని స్కూల్లో టీచర్స్, ఇంట్లో పేరెంట్స్ చెప్పే ప్రయత్నం చేయాలి.' అంటూ సూచించారు.
నా మూవీస్‌లో అవి ఉండవు
తన మూవీస్‌లో టీజింగ్ సాంగ్స్ ఆపేసినట్లు సాయి దుర్గా తేజ్ చెప్పారు. ''విన్నర్' మూవీ తర్వాత అలాంటి పాటలు చేయలేదు. ప్రేమిస్తే పొగడాలి కానీ టీజింగ్ చేయకూడదనే స్వతహాగా ఈ నిర్ణయం తీసుకున్నా. సోషల్ మీడియాలో కాకుండా రియల్ వరల్డ్‌లో బతకాలని చెప్పాలి. ఫ్యాన్స్ మా మీద ఇష్టంతోనో, ద్వేషంతోనో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. మేము నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోం. కానీ పిల్లలు అలాంటి కామెంట్లను చూస్తే ప్రభావితం చెందుతుంటారు. అందుకే పిల్లల్ని అలాంటి వాటికి దూరంగా ఉంచాలి.' అని చెప్పారు.
తన పెళ్లి గురించి సోషల్ మీడియా, మీడియాలో వస్తోన్న కథనాలపై సాయి దుర్గా తేజ్ స్పందించారు. తన పెళ్లి గురించి మీడియాలో ఊహాగానాల్ని ప్రచారం చెయ్యొద్దని... తన పెళ్లి గురించి తానే అనౌన్స్ చేస్తానని నవ్వుతూ చెప్పారు.





















