Force Motors Prices Reduced: జీఎస్టీ కొత్త స్లాబ్స్‌తో రూ.6 లక్షల వరకు తగ్గిన ఫోర్స్ మోటార్స్ ధరలు, మోడల్ వారీగా డిస్కౌంట్స్
జీఎస్టీ స్లాబ్స్ తగ్గింపుతో Force Motors కార్ల ధరలు గరిష్టంగా రూ. 6.81 లక్షల వరకు తగ్గాయి. ట్రావెలర్, ట్రాక్స్, గుర్ఖా వంటి మోడల్స్ తక్కువ ధరలో లభిస్తున్నాయి.

వినియోగదారులకు Force Motors శుభవార్త అందించింది. ఇటీవల GST రేట్లలో కోత విధించడంతో కొనుగోలుదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఫోర్స్ మోటార్స్ కంపెనీ వ్యాన్లు, బస్సులు, అంబులెన్స్‌లు, SUVల ధరలపై ప్రభావం చూపింది. వాటి ధరలు గతంలో కంటే గరిష్టంగా 6.81 లక్షల రూపాయల వరకు తగ్గాయి. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు మార్కెట్‌కు ఊతమివ్వనున్నాయి. ఈ చర్య రాబోయే నెలల్లో Force Motors వాహనాల డిమాండ్‌ను మరింత పెంచుతుందని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు.
Traveller పై 4.52 లక్షల వరకు డిస్కౌంట్
Force Motors కంపెనీ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన Traveller వాహనాలపై GST కోత ప్రభావం ఎక్కువగా ఉంది. ప్యాసింజర్ వ్యాన్లు, స్కూల్ బస్సులు, అంబులెన్స్‌లు, కార్గో వ్యాన్లు ఒకపై రూ. 1.18 లక్షల నుండి 4.52 లక్షల రూపాయల వరకు ధర దిగొస్తున్నాయి. భారతదేశంలో Traveller ఇప్పటికే 65% కంటే ఎక్కువ మార్కెట్ వాటాతో దూసుకెళ్తోంది. అందుకే Force Motors దేశంలోనే అతిపెద్ద వ్యాన్, అంబులెన్స్ తయారీదారుగా భావిస్తారు.
Trax సిరీస్‌లో రూ. 3.21 లక్షల వరకు ధరల తగ్గింపు
GST కోత ప్రయోజనం Trax శ్రేణిలో కూడా కనిపించింది. Trax Cruiser, Toofan వాహనాలతో పాటు Cityline వంటి కార్ల ధరలు ఏకంగా రూ.2.54 లక్షల నుండి 3.21 లక్షల రూపాయల వరకు తగ్గుతున్నాయి. ఆఫ్-రోడ్ పనితీరు కారణంగా ఈ కార్లు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, కఠినమైన మార్గాల్లో ఫేమస్ అయ్యాయి. దీంతో పాటు కంపెనీ Monobus మోడల్ సైతం రూ. 2.25 లక్షల నుంచి రూ. 2.66 లక్షల వరకు చౌకగా లభిస్తుంది.
Urbania, Gurkha వాహనాలపై కూడా భారీగా ఆదా
Force Motors కంపెనీ అత్యంత ప్రీమియం శ్రేణి Urbania ధరలలో భారీ కోత కనిపించింది. దీని ధర రూ. 2.47 లక్షల నుండి 6.81 లక్షల రూపాయల వరకు తగ్గిస్తున్నారు. అదే సమయంలో, ఆఫ్-రోడింగ్ వినియోగదారుల అభిమాన Force Gurkha SUV కూడా దాదాపు రూ.1 లక్ష చౌకగా లభిస్తుంది. Gurkha 3-డోర్ వేరియంట్ ప్రస్తుతం 16.87 లక్షల రూపాయలకు, 5-డోర్ వేరియంట్ రూ.18.50 లక్షలకు అందుబాటులో ఉంది. GST రేట్లు తగ్గించడంతో Force Motors కస్టమర్లకు చాలా ప్రయోజనం చేకూరనుంది. Traveller నుంచి Gurkha వరకు కంపెనీ దాదాపు ప్రతి సిరీస్ కార్లు గతంలో కంటే చాలా చౌక ధరకు విక్రయాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి కార్ల ధరలు దిగిరానుండటంతో కొనుగోలు చేయాలనుకున్న వాళ్లు అప్పటివరకూ వేచి చూస్తున్నారు.






















