అన్వేషించండి

Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ

Harish Rao criticizes Revanth: బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన వాటికి రేవంత్ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు బహిరంగలేఖ విడుదల చేశారు.

Harish Rao criticizes CM Revanth:   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన   గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన భవనాలకు రిబ్బన్ కటింగ్లు చేయడానికేనని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, సిద్దిపేట అభివృద్ధిపై ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.  శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది అంటూ ఎద్దేవా చేసిన హరీశ్ రావు, శిలాఫలకాలపై రేవంత్ పేరు ఉండొచ్చు కానీ, సిద్దిపేట ప్రజల మనోఫలకాలపై కేసీఆర్ పేరే ఉంటుందని స్పష్టం చేశారు. నర్మెట్టలో ప్రారంభించబోయే రూ. 300 కోట్ల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నుండి ఆయుష్ ఆస్పత్రి, జిల్లా జైలు వరకు అన్నీ గత ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి పూర్తి చేసినవేనని ఆయన గుర్తు చేశారు.

నాడు కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని ఎగతాళి చేసిన రేవంత్ రెడ్డి, ఇవాళ అదే కాళేశ్వరం జలాలతో నడిచే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఏ ముఖం పెట్టుకుని ప్రారంభిస్తున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. ఫ్యాక్టరీ కోసం భూసేకరణ చేసి, కాళేశ్వరం కాలువను పొడిగించి నీరందించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి   ప్రారంభించబోతున్న సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఆయుష్ ఆస్పత్రి, పీహెచ్‌సీ భవనాలు అన్నీ తాను ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు నిర్మించినవేనని, సిబ్బందిని నియమించకుండానే కేవలం ప్రచారం కోసం శిలాఫలకాలు వేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.             

రైతు రుణమాఫీ అంశంపై ముఖ్యమంత్రిని హరీశ్ రావు నిలదీశారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, రుణమాఫీ పేరుతో రైతులను వంచించారని ఆరోపించారు. సిద్దిపేట నియోజకవర్గంలో 52 శాతం మందికి   ఇంకా రుణమాఫీ కాలేదని, సీఎం పర్యటిస్తున్న నర్మెట్ట గ్రామంలోనే 350 మంది రైతులు దీని కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. వరుసగా మూడు సీజన్ల  రైతుబంధు  బకాయిలను వెంటనే విడుదల చేయాలని, వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజకీయ కక్షతో సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 1070 కోట్ల విలువైన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా సిద్దిపేటలో పనులు మొదలైన వెటర్నరీ కాలేజీని ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు తరలించుకుపోవడం ఆయన స్థాయికి తగదని విమర్శించారు. రంగనాయక సాగర్ టూరిజం, శిల్పారామం, ఫోర్ లేన్ రోడ్లు వంటి ఆగిపోయిన పనులను వెంటనే పునరుద్ధరించాలని హరీశ్ రావు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.                                                       

  
 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget