అన్వేషించండి

EV vs Diesel cars: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 900 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లతో కొత్త BMW i3 ఎలక్ట్రిక్ సెడాన్!

BMW Electric Sedan: కొత్త BMW i3 ఎలక్ట్రిక్ కారు 900 కి.మీ.ల రేంజ్‌తో వస్తోంది. దీని విడుదల తేదీ ఇంకా వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు డీజిల్ కార్లకు పోటీ ఇస్తున్ానయి.

నేటి కాలంలో పెట్రోల్, డీజిల్ కంటే ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. పలు విషయాల్లో డీజిల్ కార్లకు ఈవీలు గట్టి పోటీనిస్తున్నాయి. ఇటీవల కొత్త BMW i3 ఎలక్ట్రిక్ సెడాన్ మార్కెట్లోకి రానుందని ప్రచారం జరుగుతోంది. దీని రేంజ్ ఏకంగా 900 కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీనికి ముందు Mercedes-Benz CLA ఎలక్ట్రిక్ రేంజ్ 792 కిలోమీటర్లుగా నమోదైంది. దీన్ని బట్టి ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు లాంగ్ జర్నీలకు కూడా సమర్థవంతంగా వినియోగించవచ్చు అని స్పష్టమవుతోంది. అందుకే వాహనదారులు నెమ్మదిగా డీజిల్ నుండి ఎలక్ట్రిక్ వైపు మొగ్గు చూపుతున్నారు.

BMW i3 కొత్త టెక్నాలజీ, లాంగ్ రేంజ్

వాస్తవానికి కొత్త BMW i3 ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్. దీన్ని బీఎండబ్ల్యూ 3 సిరీస్ ఎలక్ట్రిక్ రూపంగా చెప్పవచ్చు. ఇది BMW కొత్త Neu Klasse డిజైన్ కాన్సెప్ట్‌పై రూపొందించారు. ఈ కారులో 108.7 kWh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 900 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని వాహనదారులకు ఇస్తుంది. ఇందులో 469 bhp పవర్, 645 Nm టార్క్ లభిస్తుంది. దీనివల్ల కారు పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో 800V ఛార్జింగ్ సిస్టమ్ ఉండటం వల్ల ఫాస్ట్ ఛార్జింగ్ సాధ్యం అవుతుంది. దాంతో ఇది గంటల తరబడి చేసే ఛార్జింగ్ కష్టాలకు చెక్ పెడుతుంది.

డిజైన్, ఇంటీరియర్ ప్రత్యేకతలు

BMW i3 డిజైన్ చాలా క్లీన్ అండ్ సింపుల్‌గా ఉండి, మోడ్రన్ లుక్ ఇస్తుంది. దీని రూఫ్ లైన్ సన్నగా, స్టైలిష్‌గా ఉంటుంది. కారు ముందు భాగంలోని కిడ్నీ గ్రిల్ కూడా చాలా తక్కువగా కనిపించేలా డిజైన్ చేశారు. లోపలి భాగం విషయానికి వస్తే, దీని ఇంటీరియర్ iX3 తరహాలో ఉంటుంది. ఇందులో డాష్‌బోర్డ్ మొత్తం విస్తరించే ఒక పెద్ద పనోరమిక్ iDrive స్క్రీన్‌ను అందించారు. దీనివల్ల విడిగా ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అవసరం ఉండదు. కింద భాగంలో ఒక టచ్‌స్క్రీన్ కూడా ఉంది. దీని ద్వారా అనేక ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు.

భారత్‌లో లాంచ్ ఎప్పుడు?

ఈ కొత్త BMW i3 జర్మనీలోని మ్యూనిచ్‌లో తయారు అవుతుంది. ఇది చూడటానికి ఫ్యూచరిస్టిక్ కారులా అనిపిస్తుంది. అయితే, భారత్‌లో దీని లాంచ్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వివరాలు రాలేదు. BMW ఇప్పటికే భారత్‌లో i7,  iX1 వంటి ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. కానీ కొత్త i3 లేదా iX3 ఇంకా భారత మార్కెట్లో విడుదల కాలేదు. i3 కంటే ముందే iX3ని భారత్‌కు తీసుకువచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Embed widget