అన్వేషించండి

Creta లేదా కొత్త Duster? ధర, ఫీచర్లు, మైలేజ్ పరంగా ఏది బెస్ట్ ? తెలుసుకున్నాకే కొనండి

Renault Duster 2026 | ఇటీవల లాంచ్ అయిన రెనాల్డ్ డస్టర్ ఎస్‌యూవీ కొత్త ప్లాట్‌ఫామ్‌పై వచ్చింది. ఇది Hyundai Cretaకు నేరుగా పోటీ ఇస్తుంది. ఈ SUVల ధర, ఇంజిన్, ఫీచర్లు, సేఫ్టీ ఫీచర్లు ఇక్కడ తెలుసుకోండి.

భారత ఆటో మార్కెట్లో SUVలకు డిమాండ్ పెరుగుతోంది. భారత మార్కెట్‌లో Hyundai Creta చాలా కాలం నుంచి కస్టమర్ల బెస్ట్ ఛాయిస్‌గా ఉంది. అయితే Renault Duster 2026 న్యూ లుక్, ఫీచర్లతో మార్కెట్లోకి రీఎంట్రీ వచ్చింది. ఈసారి Duster కేవలం స్ట్రాంగ్ బాడీతో మాత్రమే కాకుండా, కొత్త టెక్నాలజీ, హైబ్రిడ్ ఇంజిన్ సహా ADAS వంటి ఫీచర్లతో వచ్చింది. ఈ రెండు SUVలు దాదాపు ఒకే రకమైన కస్టమర్ల కోసం రూపొందాయి. హ్యుందాయ్ Creta సిటీలో సౌకర్యవంతమైన డ్రైవ్, ఎక్కువ ఫీచర్లు, అనేక ఆప్షన్లను అందిస్తుంది. అదే సమయంలో కొత్త రెనాల్ట్ Duster స్ట్రాంగ్ బాడీ, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్,  గతుకుల రోడ్లపై మెరుగ్గా ప్రయాణం సాగిస్తుంది. అయితే ఈ రెండు SUVలలో మీకు ఏది బెస్ట్ ? ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

ధర, ఇంజిన్

Hyundai Creta: దీని ధర సుమారు ₹10.79 లక్షల నుండి ప్రారంభమై గరిష్టంగా ₹20.20 లక్షల వరకు ఉంటుంది. ఇందులో పెట్రోల్, డీజిల్, టర్బో ఇంజిన్‌లతో పాటు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Renault Duster 2026: రెనాల్ట్ డస్టర్ ధర ₹10.29 లక్షలకు మొదలై టాప్ మోడల్ ₹18.49 లక్షల వరకు ఉంటుంది. ఇది హ్యుందాయ్ Creta కంటే కొంచెం తక్కువ ధరకే లభిస్తుంది.

ఇంజిన్ సామర్థ్యం: ఇంజిన్ విషయానికి వస్తే హ్యుందాయ్ Cretaలో 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్, టర్బో పెట్రోల్ వంటి ఎక్కువ ఆప్షన్లు ఉన్నాయి. అయితే రెనల్ట్ Duster 2026 కేవలం పెట్రోల్ ఇంజిన్‌తోనే వచ్చింది.కానీ ఇందులో 1.0, 1.3, 1.8 లీటర్ టర్బో ఇంజిన్‌లతో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. 

ఫీచర్లు, సేఫ్టీలో ఏది బెస్ట్

ఫీచర్ల  విషయానికి వస్తే Hyundai Creta ఎప్పుడూ ముందుంటుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో పాటు వైర్‌లెస్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే  Renault Duster 2026 మార్కెట్లోకి రావడంతో పోటీ మొదలైంది. ఈ ఎస్‌యూవీ సైతం బెస్ట్ ఫీచర్లతో విడుదలైంది. 

కొత్త రెనాల్ట్ Dusterలో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. ఇందులో గూగుల్ ఆధారిత కనెక్టెడ్ సిస్టమ్ కూడా లభించవచ్చు. సేఫ్టీ విషయంలో రెండు SUVలు ఇప్పుడు దాదాపు సమానంగా ఉన్నాయి. హ్యుందాయ్ Cretaలో 70కి పైగా సేఫ్టీ ఫీచర్లు, లెవల్-2 ADAS ఉన్నాయి. మరోవైపు, రెనాల్ట్ Dusterలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ అసిస్ట్ వంటి అనేక ADAS ఫీచర్లు అందించారు.

ఏది కొంటే బెటర్?

మీరు సిటీలో సౌకర్యవంతంగా ఉంటూ, ఎక్కువ ఫీచర్లు, పలు రకాల ఇంజిన్ ఆప్షన్లు కావాలనుకుంటే Hyundai Creta మంచి ఛాయిస్ అవుతుంది. మీకు స్ట్రాంగ్ బాడీ, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, అన్ని రకాల రోడ్లపై (Off-road) ప్రయాణించే SUV కావాలనుకుంటే మాత్రం Renault Duster 2026 మీకు సరైన ఆప్షన్ కావచ్చు. కొనే ముందు వీటి వివరాలతో పాటు ధర, ఫైనాన్స్ అంశాలను పూర్తిగా తెలుసుకున్నాక కొనడం మంచిది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

BE 6 రేసింగ్‌ లుక్‌ను పక్కన పెట్టిన మహీంద్రా.. త్రివర్ణాలు, 540 డిగ్రీల కెమెరాతో కొత్త 'ఫ్రీడమ్‌ ఎడిషన్‌'
ఆగస్టు 15 సందర్భంగా మహీంద్రా BE 6కు కొత్త లుక్‌.. ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌లో ప్రత్యేక మార్పులు!
స్కార్పియో ఎన్‌ కంటే రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్స్‌.. మహీంద్రా కొత్త లైఫ్‌స్టైలర్‌ పికప్‌ ట్రక్‌ వచ్చేసింది!
మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ పికప్‌ ట్రక్‌.. టయోటా, ఇసుజుకి స్ట్రాంగ్‌ కాంపిటీషన్‌!
Clean Cloudy Car Headlights: వర్షంలో హెడ్‌లైట్లు మసకగా కనిపిస్తున్నాయా? ఈ చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి!
వర్షంలో హెడ్‌లైట్లు మసకగా కనిపిస్తున్నాయా? ఈ చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి!
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Embed widget