అన్వేషించండి

Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

Cyber Crime | మాజీ డీజీపీ మనవరాలి పేరుతో నమ్మించి వారి అకౌంటెంట్ నుంచి రూ.1.2 కోట్లు దోచేశారు సైబర్ నేరగాళ్లు. మరోసారి మనీ కోసం మెస్సేజ్ రాగా మోసపోయినట్లు గుర్తించారు.

హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. సామాన్యులే కాకుండా ఉన్నత అధికారుల కుటుంబ సభ్యులను సైతం వదలకుండా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మాజీ డీజీపీ మనవరాలి పేరుతో సైబర్ క్రిమినల్స్  భారీగా నగదు కాజేశారు. కోట్ల నగదు మోసపోయామని గుర్తించిన బాధితులు హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మాజీ డీజీపీ మనవరాలు, మహిళా వ్యాపారవేత్త దివ్యారెడ్డి 18 కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్చి 13న సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంటెంట్‌కు వాట్సాప్ మెస్సేజ్ చేశారు. తాను మీటింగ్ లో ఉన్నానని, తాను చెప్పిన బ్యాంకు అకౌంట్ కు రూ.1.2 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ వాట్సాప్ అకౌంట్ పేరు, ఫొటోలు దివ్యారెడ్డివే ఉండటంతో నమ్మిన అకౌంటెంట్ మనీ పంపారు.

 మనీ కోసం మరోసారి వాట్సాప్ మెస్సేజ్
మార్చి 17న మరోసారి అకౌంటెంట్‌కు నగదు పంపాలని మెస్సేజ్ వచ్చింది. మనీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి చెక్ అప్రూవల్ కోసం డైరెక్టర్‌ను సంప్రదించారు. ఇటీవల మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం చర్చకు వచ్చింది. వాట్సాప్ మెస్సేజ్ రావడంతో కోటి ఇరవై లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు చెప్పగా.. తాను ఎవరికీ మనీ పంపాలని చెప్పలేదని దివ్యారెడ్డి చెప్పడంతో అకౌంటెంట్ క్లారిటీ ఇచ్చారు. విషయం గ్రహించిన బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు నగదు మోసంపై ఫిర్యాదు చేశారు. 

డిజిటల్ అరెస్టుల పేరుతో పెరుగుతున్న మోసాలు
సైబర్ నేరగాళ్లు కొందర్ని టార్గెట్ చేసి.. వారికి ఫోన్ చేసి, మీ పేరుతో వచ్చిన కొరియర్ పార్శిల్‌లో నిషేధిత డ్రగ్స్, పాస్‌పోర్టులు ఉన్నాయని నమ్మిస్తారు. ఈ కేసులో వారిపై ముంబై, చెన్నై, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ జరుపుతున్నారని, వెంటనే స్పందించకపోతే అరెస్ట్ చేస్తామని భయపెడతారు. ఆపై డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆన్‌లైన్‌కు తీసుకుని యూనిఫాంలో ఉన్న వ్యక్తులు వారిని అరెస్ట్ చేస్తున్నామని చెబుతున్నారు. 

ఈ కేసు నుండి బయటపడాలంటే డబ్బులు పంపాలని వారు కోరతారు. భయాందోళనకు గురైన బాధితులు నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాలకు పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేస్తున్నారు.  ఆ తర్వాత వారు ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చేస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి
గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి కొరియర్లలో డ్రగ్స్ ఉన్నాయని లేదా పోలీసులమని బెదిరిస్తే భయపడకండి. ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ ఇలా ఫోన్లలో డబ్బులు అడగవని గ్రహించాలి. మీకు ఏదైనా అనుమానం వస్తే వెంటనే 1930 కి కాల్ చేయండి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget