అన్వేషించండి

No Cut In MRP: జీఎస్టీ తగ్గించినా, ధరలు తగ్గించేది లేద్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు - అందుకు కారణం ఇదేనా

GST New Slabs in India | స్థిర ధరలకే కొనడానికి వినియోగదారులు అలవాటు పడ్డారని, ధరల తగ్గించే ప్రసక్తే లేదని కొన్ని కంపెనీలు వాదిస్తున్నాయి. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయి.

GST Rate Cut: జీఎస్టీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు. పలు రకాల వస్తువులు, ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించారు. కానీ తక్కువ ధర కలిగిన ఉత్పత్తులపై ధరలను తగ్గించడం లేదని వినియోగ వస్తువులను తయారు చేసే కంపెనీలు (FMCG) పన్ను అధికారులకు స్పష్టం చేశాయి. వీటిలో రూ.5 బిస్కెట్లు, 10 రూపాయల సబ్బులు, రూ. 20 టూత్‌పేస్ట్ వంటి ప్రజలందరూ వినియోగించే ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై పన్ను రేటు తగ్గించినప్పటికీ, వాటి ధరలు తగ్గాలి. అయితే వాటి ధరలు తగ్గించడం వీలుకాదని కంపెనీలు స్పష్టం చేశాయి.

ధర తగ్గించడానికి రెడీగా లేని FMCG కంపెనీలు

వినియోగదారులు ఈ వస్తువులను స్థిర ధరలకు కొనుగోలు చేయడానికి అలవాటు పడ్డారని FMCG కంపెనీలు చెబుతున్నాయి. కనుక వాటి ధరలను తగ్గించి 9 రూపాయలు, 18 రూపాయలు చేస్తే, వినియోగదారులలో గందరగోళం నెలకొంటుంది. మరీ ముఖ్యంగా కొనుగోలు సమయంలో జరిగే లావాదేవీలలో అసౌకర్యం కలుగుతుందని కంపెనీలు పేర్కొన్నాయి.

అందుకు బదులుగా, కంపెనీలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC)కి ధరలను యథాతథంగా ఉంచుతామని స్పష్టం చేశాయి. కావాలంటే ప్యాకెట్‌లో కాస్త పరిమాణాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి. అంటే, ఇప్పుడు ఒక కస్టమర్ 20 రూపాయలకు బిస్కెట్ కొంటే, మునుపటి కంటే ఎక్కువ పరిమాణంలో బిస్కట్లు పొందుతాడు.

నివేదిక ప్రకారం, చాలా పెద్ద FMCG కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు అదే ధరకు ఎక్కువ పరిమాణాన్ని ఇవ్వడం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా GST తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు చేరుతుందని చెప్పారు.

కంపెనీలు తగ్గింపు ప్రయోజనాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయా?

12 శాతం ఉన్న జీఎస్టీని కొన్ని వస్తువులు, ఉత్పత్తులపై 5 శాతానికి తగ్గించారు. 5 శాతంగా ఉన్న జీఎస్టీని కొన్ని ఉత్పత్తులపై పూర్తిగా తొలగించారు. వినియోగదారులకు ఎక్కువ విలువను అందించడానికి కంపెనీ చిన్న ప్యాకెట్ల బరువును పెంచుతుందని బికాజీ ఫుడ్స్ CFO రిషబ్ జైన్ ధృవీకరించారు. అదే సమయంలో డాబర్ CEO మోహిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. తమ కంపెనీ ఖచ్చితంగా GST తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తుందని చెప్పారు. తక్కువ పన్నుల వల్ల ప్రతి ఉత్పత్తికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, కొంత మొత్తం వినియోగదారుడికి అదనంగా చేరుతుందని అన్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Embed widget