Honda Activa to Shine Become Cheaper: యాక్టివా నుంచి షైన్ వరకు చౌకగా మారిన టూ వీలర్స్.. కొత్త GST స్లాబ్‌తో ఎంత ఆదా అవుతుందంటే
Honda Activa to Shine two wheelers become cheaper | కొత్త GST 2.0 స్లాబ్ వల్ల టూ వీలర్స్ ధరలు తగ్గాయి. Activa, Shine వంటి టూ వీలర్లతో పాటు 350cc వరకు బైకులపై జీఎస్టీ 18 శాతానికి తగ్గించారు.

Honda Motorcycle Activa In India | టూ వీలర్ కోసం చూస్తున్న వారికి హోండా కంపెనీ శుభవార్త అందించింది. కేంద్రం ఇటీవల ప్రకటించిన కొత్త GST స్లాబ్‌లను అమలు చేస్తే.. అత్యధికంగా అమ్మడవుతున్న టూ వీలర్ వాహనాలు చాలా చౌకగా మారుతున్నాయి. గతంలో ద్విచక్ర వాహనాలపై 28% GST, 1% సెస్‌ను వసూలు చేసేవారు. కానీ సెప్టెంబర్ 22, 2025 నుండి 350cc వరకు ఇంజిన్ కలిగిన ద్విచక్ర వాహనాలు (Two Wheeler)పై GST 18 శాతానికి తగ్గించారు. ఈ పరిమితిలోపు ఉన్న వాహనాలకు సెస్‌ను పూర్తిగా రద్దు చేశారు. దీంతో వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. హోండా టూ వీలర్స్ ఇప్పుడు రూ. 18,887 వరకు చౌకగా లభిస్తాయి. ఈ జాబితాలో అత్యధికంగా అమ్ముడవుతున్న యాక్టివా స్కూటీ, షైన్ మోటార్‌సైకిల్ కూడా ఉన్నాయి. కొన్ని కార్లపై సెస్ తొలగించారు. దాంతో లగ్జరీ మినహా కార్ల ధరలు దిగిరానున్నాయి.
చిన్న, హైబ్రిడ్ కార్లపై పన్ను తగ్గింపు
కొత్త GST 2.0 స్లాబ్ ప్రభావం ద్విచక్ర వాహనాలతో పాటు చిన్న, హైబ్రిడ్ కార్లపై ఉంది. ఇప్పుడు పెట్రోల్, పెట్రోల్-హైబ్రిడ్ కార్లపై 18% GST మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇదే పన్ను రేటు CNG కార్లు, LPG కార్లకు కూడా వర్తిస్తుంది. దీనికి ఒక షరతు ఉంది, కారు ఇంజిన్ 1200cc లేదా అంతకంటే తక్కువగా ఉండటంతో పాటు పొడవు 4 మీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. డీజిల్, డీజిల్-హైబ్రిడ్ కార్లకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. అంటే 1500cc వరకు డీజిల్ కార్లు, 4 మీటర్ల వరకే పొడవున్న వాహనాలు కేవలం 18% GST పరిధిలోకి వస్తాయి. దాంతో చిన్న కార్లు, హైబ్రిడ్ కార్ల విభాగంలో కూడా వినియోగదారులకు ఉపశమనం లభిస్తుంది.
లగ్జరీ కార్లపై 40% GST
చిన్న, హైబ్రిడ్ మోడల్ కార్లకు ఊరట ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం లగ్జరీ కార్లు, మిడ్-సైజ్ టాప్ ఎండ్ కార్లను లగ్జరీ కేటగిరీలోకి చేర్చింది. ఈ కార్లపై 40% GST విధిస్తున్నట్లు ప్రకటించింది. 1200cc కంటే ఎక్కువ పెట్రోల్ కార్లు, 1500cc కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన డీజిల్ కార్లు ఈ కేటగిరిలోకి వస్తాయి. SUVలు, MUVలు, MPVలతో పాటు 170mm కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న వాహనాలు ఇదే పన్ను పరిధిలోకి వస్తాయి. అయితే వినియోగదారులకు మరో మార్పు చేశారు. ఇంతకు ముందు లగ్జరీ కార్లపై 28% GST, 22% సెస్‌తో కలిపి మొత్తం 50% టాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్త స్లాబ్‌లో సెస్‌ను తొలగించారు. చెల్లించాల్సిన మొత్తం పన్నును 40%కి తగ్గించారు. దాంతో లగ్జరీ కార్లపై సైతం 10% వరకు పన్ను తగ్గించారు.
వినియోగదారులకు డబుల్ ప్రయోజనం
కొత్త GST స్లాబ్‌తో వినియోగదారులకు రెట్టింపు ప్రయోజనం చేకూరిందని చెప్పవచ్చు. ఒకవైపు హోండా వంటి ద్విచక్ర వాహనాల బ్రాండ్‌ల బైక్‌లు మరియు స్కూటర్లు వేల రూపాయల వరకు చౌకగా మారగా, చిన్న కార్లు మరియు హైబ్రిడ్ వాహనాలపై కూడా పన్ను తగ్గింది. మరోవైపు, లగ్జరీ కార్లపై 40% GST విధించినప్పటికీ, పాత సిస్టమ్‌తో పోలిస్తే అక్కడ కూడా 10% పన్ను ప్రయోజనం ఉంది.






















