అన్వేషించండి

Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

హై టెన్షన్ వైర్లు తగిలి టపాసుల లారీ దగ్ధమైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పెంజర్ల నుంచి మాణిక్యంగూడ రోడ్ శివారులో ఈ ప్రమాదం జరిగింది.

కొత్తూరు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని శివకాశి నుంచి బాణసంచా లోడుతో హైదరాబాద్ వెళ్తున్న ఒక లారీ, పెంజర్ల గ్రామ శివారులో ప్రమాదానికి గురైంది. త్వరగా చేరుకోవాలనే ఉద్దేశంతో డ్రైవర్ మెయిన్ రోడ్ కాకుండా ఎలాంటి ట్రాఫిక్ లేని రూరల్ ఏరియా నుంచి లారీని నడిపాడు. ఈ క్రమంలో శంషాబాద్ - కొత్తూరు మధ్య ఉన్న 132 కేవీ హైటెన్షన్ విద్యుత్తు తీగలు లారీకి తగలడంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి.


Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

ప్రమాదాన్ని గమనించని డ్రైవర్ లారీని మరికొంత దూరం ముందుకు తీసుకెళ్లగా, లోపల ఉన్న టపాసులు పేలడం ప్రారంభమైంది. పెద్ద ఎత్తున శబ్దాలు వస్తుండటంతో అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ వెంటనే లారీని నిలిపివేసి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ కొన్ని క్షణాల్లోనే మంటలు లారీ మొత్తానికి వ్యాపించాయి. టపాసులు పేలుతున్న ధాటికి సమీప గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో టపాసులు కొంత సమయం పేలుతూనే ఉండటంతో మంటలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైంది.


Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

సామర్లకోట (కాకినాడ జిల్లా) భారీ పేలుడు విషాదం

ఫిబ్రవరి 28, 2026న కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వెట్లపాలెం గ్రామ శివారులో ఉన్న 'సూర్యశ్రీ ఫైర్ వర్క్స్' బాణసంచా తయారీ కేంద్రంలో అత్యంత భీకరమైన పేలుడు సంభవించింది. మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో కార్మికులు బాణసంచా తయారీలో నిమగ్నమై ఉండగా, ఒక కెమికల్ డ్రమ్ములో రేగిన నిప్పురవ్వల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ పేలుడు ధాటికి 21 మంది కార్మికులు (ఎక్కువగా మహిళలు) అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే, మృతదేహాల భాగాలు దాదాపు కొన్ని మీటర్ల దూరంలోని పొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ శబ్దం 5 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని, సమీపంలోని ఒక ప్రైవేట్ స్కూల్ భవనం స్లాబ్‌కు కూడా పగుళ్లు వచ్చాయని స్థానికులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కందుల దుర్గేష్ ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం ప్రకటించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
CM Revanth Reddy: హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఆర్‌ అండ్ డీ కేంద్రం.. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు భేటీ!
హైదరాబాద్‌లో హ్యుందాయ్ ఆర్‌ అండ్ డీ కేంద్రం.. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు భేటీ!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌కు నీళ్లు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌కు నీళ్లు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget