అన్వేషించండి

Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి

ప్రింటౌట్ తీసుకునేందుకు జిరాక్స్ షాపు వద్ద పెద్ద క్యూ కనిపిస్తే చిరాకు అనిపిస్తుంది. అయితే మీరు QwikPrint kiosk ద్వారా సైతం ఈజీగా ప్రింటౌట్ తీసుకోవచ్చు.

కొన్నిసార్లు మీకు అర్జంటుగా ప్రింటౌట్ అవసరం పడుతుంది. కానీ జిరాక్స్ షాప్ వద్ద క్యూ కనిపిస్తే చిరాకు వస్తుంది. అయితే అందుకు పరిష్కారం కోసం ఓ టెక్నాలజీని ఇటీవల అందుబాటులోకి తెచ్చారు. క్విక్‌ప్రింట్ (QwikPrint) కియోస్క్ అనేది  సులభంగా, వేగంగా ప్రింట్ తీసుకోవడానికి ఉపయోగపడే మెషీన్. ATM తరహాలో పనిచేసే సెల్ఫ్-సర్వీస్ ప్రింటింగ్ మెషిన్ ఇది. 24/7 అందుబాటులో ఉంటుంది. దీనిని ఉపయోగించి మీరు మీ ఫోన్, ఈమెయిల్ లేదా క్లౌడ్ స్టోరేజ్ నుండి నేరుగా ప్రింట్లు తీసుకోవచ్చు. జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ వద్ద సైతం ఇన్‌స్టాల్ చేసిన ఓ క్విక్ ప్రింట్ ప్రింటింగ్ మెషిన్ సేవలు అందిస్తోంది. 

క్విక్‌ప్రింట్ కియోస్క్ ద్వారా ప్రింట్ తీసుకునే విధానాన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..

మీ ఫైల్‌ను అప్‌లోడ్ చేయడం (Upload Your File)
మీరు ప్రింట్ తీసుకోవాలనుకుంటున్న ఫైల్‌ను కియోస్క్ సిస్టమ్‌లోకి పంపడానికి 3 ప్రధాన మార్గాలు ఉన్నాయి. అవి

వెబ్‌సైట్ ద్వారా: QwikPrint వెబ్‌సైట్‌కు వెళ్లి మీ ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి. అప్పుడు మీకు ఒక 6 అంకెల రిజిస్ట్రేషన్ కోడ్ వస్తుంది.

ఈమెయిల్ ద్వారా: మీరు ప్రింట్ చేయాల్సిన డాక్యుమెంట్‌ను QwikPrint వారు సూచించిన ఈమెయిల్ ఐడికి పంపాలి. వెంటనే మీకు Reply Emailకు రిజిస్ట్రేషన్ కోడ్ అందుతుంది.

మొబైల్ యాప్: QwikPrint యాప్ ద్వారా ఫైల్ అప్‌లోడ్ చేసి కోడ్ పొందవచ్చు.

స్టెప్ 2: కియోస్క్ వద్దకు వెళ్లాలి (Go to the Kiosk)
మీకు దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్లు లేదా లైబ్రరీలలో ఉన్న క్విక్‌ప్రింట్ కియోస్క్ వద్దకు వెళ్లాలి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mesmerizing Sai 💥👑 (@mesmerizing_sai)

స్టెప్ 3: కోడ్‌ను ఎంటర్ చేయాలి. 
కియోస్క్ స్క్రీన్ మీద ఉన్న Print ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీకు వచ్చిన 6 అంకెల రిజిస్ట్రేషన్ కోడ్‌ను అక్కడ ఎంటర్ చేయండి.

తరువా మీ డాక్యుమెంట్‌ను ఫోన్, ల్యాప్‌టాప్, గూగుల్ డ్రైవ్ నుంచి సెలక్ట్ చేయాలి. ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి

స్టెప్ 4: ప్రింట్ సెట్టింగ్‌లు మార్చుకోవాలి 
మీకు కావాల్సిన విధంగా సెట్టింగ్‌లను మార్చుకోవచ్చు:

Color/B&W: రంగుల ప్రింట్ కావాలా లేదా బ్లాక్ అండ్ వైట్ కావాలా అనేది ఎంచుకోండి.

Sides: పేజీకి ఒక వైపు కావాలా లేదా రెండు వైపులా  కావాలా అనేది సెట్ చేయండి.

Copies: ఎన్ని కాపీలు కావాలనేది ఎంచుకోండి.

స్టెప్ 5: పేమెంట్  చేయడం (Make Payment)
స్క్రీన్ మీద మీకు ఎంత ఖర్చు అవుతుందో కనిపిస్తుంది. మీరు ఈ క్రింది మార్గాల్లో డబ్బులు చెల్లించాలి:

UPI: గూగుల్ పే, PhonePe, పేటీఎం ద్వారా QR కోడ్ స్కాన్ చేసి చెల్లించవచ్చు.

Card/Wallet: డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా ఇతర వాలెట్ల ద్వారా కూడా పేమెంట్ చేయవచ్చు. 

స్టెప్ 6: ప్రింట్ తీసుకోవడం 
పేమెంట్ పూర్తయిన వెంటనే, కియోస్క్ నుండి మీ పేపర్లు ప్రింట్ అయ్యి బయటకు వస్తాయి. వాటిని కలెక్ట్ చేసుకోండి. 

ముఖ్య గమనిక:
మీరు అప్‌లోడ్ చేసిన ఫైల్‌లు ప్రింట్ తీసుకోగానే లేదా కొంత సమయం తర్వాత సర్వర్ నుండి ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి.

ఫైల్ ఫార్మాట్: సాధారణంగా PDF, Word (Docx), JPEG ఫార్మాట్‌లు బాగా పనిచేస్తాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Amaravati News: అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
Hyderabad ORR Accident: ఔటర్ పై రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. టైర్ పేలడంతో పల్టీలు కొట్టిన ఆటో
Hyderabad ORR Accident: ఔటర్ పై రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. టైర్ పేలడంతో పల్టీలు కొట్టిన ఆటో
Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహాగణపతి.. బైబై గణేశా అంటూ వీడ్కోలు పలికిన భక్తులు
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహాగణపతి.. బైబై గణేశా అంటూ వీడ్కోలు పలికిన భక్తులు

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
IBPS Exam Malpractice: కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
Amaravati News: అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
Embed widget