Woman Maoist surrender: ఆమె తలపై రూ. కోటి రివార్డ్ - ఏకంగా 106 కేసులు - ప్రాణభయంతో పోలీసుల ఎదుట సరెండర్ అయిన సుజాతక్క !
Sujathakka surrender: మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న సుజాతక్క పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ఆమె తలపై ఏకంగా రూ.కోటి రివార్డు ఉంది.

Sujathakka Maoist most wanted list surrendered: మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యురాలు, మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ నాయకురాలు సుజాతక్క తెలంగాణ పోలీసుల పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ఆమెపై రూ.1 కోటి రివార్డు ఉంది. వివిధ రాష్ట్రాల్లో 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. సుజాతక్క లొంగుబాటు మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
సుజాతక్క అసలు పేరు పోతుల కల్పన, 1984లో ప్రముఖ మావోయిస్టు నాయకుడు కిషన్జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వర రావు ని వివాహం చేసుకున్నారు. కిషన్జీ 2011లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. అప్పటి నుంచి సుజాతక్క మావోయిస్టు సంస్థలో కీలక పాత్ర పోషిస్తూ, బస్తర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆమెపై హత్యలు, దాడులు, దోపిడీలు, పేలుడు పదార్థాల సేకరణ వంటి ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి.
"సుజాతక్క లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ. ఆమె సెంట్రల్ కమిటీలో కీలక సభ్యురాలిగా, ఆయుధాల సేకరణ, రిక్రూట్‌మెంట్, వ్యూహాత్మక నిర్ణయాల్లో పాల్గొనేవారు. ఆమె లొంగిపోవడం వల్ల మావోయిస్టు నెట్‌వర్క్‌పై మరింత సమాచారం లభించే అవకాశం ఉంది" అని పోలీసులు ప్రకటించారు. సుజాతక్క ఆరోగ్య సమస్యలు, సంస్థలో అంతర్గత విభేదాలు, పోలీసుల ఒత్తిడి కారణంగా లొంగిపోయినట్టు తెలుస్తోంది.
#BreakingNews | Sujata, a top Maoist commander with a ₹1 crore bounty, will surrender before the Telangana DGP today. She leads the Bastar Division Committee and is linked to major crimes in Sukma, Chhattisgarh.
— United News of India (@uniindianews) September 13, 2025
Known for training Naxal leader Hidma, Sujata’s surrender comes… pic.twitter.com/91YPLHMWOT
సుజాతక్క 1980లలో మావోయిస్టు ఉద్యమంలో చేరారు. గద్వాల ప్రాంతానికి చెందిన సుజాత అసలు పేరు పోతుల కల్పన. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె, విద్యార్థి ఉద్యమాల ద్వారా నక్సలైట్ భావజాలం వైపు ఆకర్షితురాలయ్యారు. ఆమె నాయకత్వంలో బస్తర్ ప్రాంతంలో అనేక దాడులు జరిగాయి, ఇందులో 2010లో దంతెవాడలో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల హత్యకు సంబంధించిన కేసు కూడా ఉంది. పోలీసులు సుజాతక్క విచారణ ద్వారా మావోయిస్టు సంస్థలోని ఇతర కీలక నాయకులు, ఆయుధ డిపోల గురించి సమాచారం సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఘటనతో బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు మరింత బలహీనపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
లొంగిపోవడమో.. చనిపోవడమో తేల్చుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులకు ఇటీవలే తేల్చి చెప్పారు. ఈ క్రమంలో కీలక నాయకత్వం లొంగుబాటులో ఉంది. ఆమెకు పాతిక లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలంగాణ డీజీపీ తెలిపారు.
CPI (Maoist) Central Committee member Potula Padmavati alias Kalpana Jyothi alias Sujatha, who served the party for 43 years, has surrendered before the Telangana Govt.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 13, 2025
As per Hon’ble HM Shri @AmitShah Ji’s call, I once again appeal to Maoists: Lay down arms. Armed revolutions… pic.twitter.com/NAt0CZuHyd
ఇతర నక్సలైట్లు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని తెలంగాణ డీజీపీ పిలుపునిచ్చారు.





















