Telangana Dwcra Groups: డ్వాక్రా సంఘాలకు చీరలు, రూ. 15 వేలు- దసరా కానుక ప్రకటించిన ప్రభుత్వం
Telangana Dwcra Groups: డ్వాక్రా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ కింద ఒక్కో సంఘానికి 15వేలు, దసరా కానుకగా మహిళలకు చీరలు పంపిణీ చేస్తుంది.

Telangana Dwcra Groups: తెలంగాణలో డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్కో సంఘానికి నగదుతోపాటు చీరలు పంపిణీ చేయనుంది. ఇప్పటికే నగదు విడుదల కాగా, ఇప్పుడు చీరల పంపిణీ త్వరలోనే స్టార్ట్ కానుంది.
తెలంగాణలో డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ నిధులును ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4,079 సంఘాలకు ఈ నిధులు అందబోతున్నాయి. ఆరు కోట్ల పది లక్షల రూపాయలను ప్రభుత్వం ఇస్తోంది. అంటే ఒక్కో సంఘానికి పదిహేను వేల రూపాయలు అందబోతున్నాయి. ఈ నిధులు ఎక్కువగా మహబూబాబాద్‌జిల్లాకు వస్తుంటే అతి తక్కువ మంచిర్యాల జిల్లా అందుకోనుంది. అక్కడ కేవలం మూడు సంఘాలకు మాత్రమే ఈ నిధులు వస్తున్నాయి.
మరోవైపు దసరా వస్తున్నందున మహిళా సంఘాలకు ఇందిరమ్మ పేరుతో చీరల పంపిణీ చేయనున్నారు. ఈ నెల 23 నుంచి ఈ చీరల పంపిణీ కార్యక్రమం మొదలు కానుంది. ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి ఏటా రెండు చీరలు ఇస్తారు. ఒకటి దసరాకు ఇస్తారు. రెండోది సంక్రాతికి ఇవ్వబోతున్నారు.
ఇందిరమ్మ చీరలను సిరిసిల్ల నేత కార్మికులు తయారు చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్డర్ మేరకు ఇప్పటికే యాభై లక్షలకుపైగా చీరలు నేశారు. మరో పది లక్షలు నేస్తున్నారు. ఒక్కో చీర ధర 800 రూపాయలు ఉంటుందని చెబుతున్నారు.





















