Asia Cup 2025 | ఒమన్ పై పాకిస్తాన్ బంపర్ విక్టరీ | ABP Desam
పసి కూన ఒమన్ పై పాకిస్తాన్ తన ప్రతాపం చూపించి బంపర్ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో పాక్ జట్టు పెద్ద గండం నుంచి గట్టెక్కినట్లైంది. ఆసియా కప్ 2025 సీజన్లో భాగంగా శుక్రవారం ఒమన్ తో తలపడిన పాకిస్తాన్ ఒమన్ బౌలర్ల దెబ్బకి తడబడింది. 66 runs తో హాఫ్ centuryy చేసిన Harris తప్ప ఇంకొక్క బ్యాటర్ కూడా రానించలేదు. ఓపెనర్ అయుబ్, పాక్ కెప్టెన్ అలి అఘా ఫస్ట్ బాల్ కే గోల్డెన్ డక్ గా వెను తిరిగితే.. మిగిలిన వాళ్ళల్లో ఒక్కరూ కూడా పట్టుమని 30 పరుగులు కూడా చేయలేదు. ఎలాగైతేనే చివరికి 20 ఓవర్లలో 7 వికెట్లకి 160 రన్స్ బోర్డ్ మీద పెట్టారు. అయితే టార్గెట్ చేజింగ్ లో ఒమన్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. వాళ్ళ ఇనెక్స్ పీరియన్స్ తో పాక్ స్పిన్నర్లకు ఒకరి తర్వాత ఒకరుగా వరుస వికెట్లు సమర్పించుకుని 16.4 ఓవర్లలో 67 రన్స్ కే ఆలౌట్ అయిపోయారు. దీంతో టోర్నీ లో పాకిస్థాన్ బోని కొట్టింది. ఇక ఈ గెలుపుతో పాకిస్థాన్ టోర్నీ నుంచి ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. అదెలాగంటే.. పాకిస్థాన్ వచ్చే మ్యాచ్ ఇండియాతో ఆడబోతోంది. టోర్నీలో రెండు మ్యాచ్ లు ఓడిపోతే ఆ టీం ఔట్ అయిపోయినట్లే. ఎటు మన టీమిండియా చేతిలో పాక్ చిత్తుగా ఓడిపోతుందని కాబట్టి.. ఒకవేళ ఈ మ్యాచ్ లో కూడా ఒడి పోయి ఉంటే మొత్తం టోర్నీ నుంచే ఇంటికి పోవాల్సి వచ్చేది. ఆ గండం నుంచి పాక్ తప్పించుకున్నట్లే కదా? ఏమంటారు?





















