అన్వేషించండి

TGSRTC Tour Packages: హైదరాబాద్ నుంచి అయోధ్య, వారాణాసిలకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్

TGSRTC MD Sajjanar | తెలంగాణ ఆర్టీసీ త్వరలోనే రాష్ట్రం నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలైన ఆయోధ్య, వారణాసిలకు టూర్ ప్యాకేజీలను తీసుకురావాలని చర్యలు చేపట్టింది.

Tour packages from Hyderabad to Ayodhya and Varanasi | హైదరాబాద్: టీజీఎస్ఆర్టీసీ సేవ‌ల‌ను మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని విలేజ్, కాలనీ బ‌స్ ఆఫీస‌ర్‌ల‌కు సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్, ఐపీఎస్ సూచించారు. సామాజిక బాధ్య‌త‌గా వినూత్న ఆలోచ‌న‌తో ఇటీవ‌ల ప్రారంభించిన యాత్రాదానం ప్రాధాన్య‌త‌ను వివ‌రించడంతో పాటు పెళ్లిళ్లు, శుభ‌కార్యాల‌కు అద్దె బ‌స్సుల బుకింగ్, కార్గో సేవ‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆయ‌న చెప్పారు. టీజీఎస్ఆర్టీసీ ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన టూర్ ప్యాకేజీల‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంద‌ని, త్వ‌ర‌లోనే ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాలైన అయోధ్య, వారాణాసి, త‌దిత‌ర టూర్ ప్యాకేజీల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని అధికారుల‌కు సజ్జనార్ సూచించారు. త్వరలోనే ఈ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్యాకేజీలు ప్రకటించనుంది.

యాత్రాదానం కార్య‌క్ర‌మానికి విశేష స్పందన

వ్య‌క్తుల ప్రత్యేకమైన, ఆనందదాయకమైన రోజుల్లో అనాథ‌లు, నిరాశ్ర‌యులైన వృద్దులు, దివ్యాంగులు, విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల‌కు, పర్యాటక ప్రాంతాలకు, విహార‌యాత్ర‌ల‌కు యాత్ర‌దానంలో భాగంగా తీసుకెళ్లేందుకు డిపోల‌ వారిగా కార్యాచ‌ర‌ణ రూపొందించుకోవాల‌ని సూచించారు.  టీజీఎస్ఆర్టీసీ యాత్రాదానం కార్య‌క్ర‌మానికి దాత‌లు ముందుకు వ‌స్తుండ‌టం అభినంద‌నీయ‌మ‌న్నారు. 

హైద‌రాబాద్ బాగ్ లింగంప‌ల్లిలోని ఆర్టీసీ క‌ళాభ‌వ‌న్‌లో శ‌నివారం  (సెప్టెంబర్ 13న) రాష్ట్ర‌స్థాయి విలేజ్, కాల‌నీ బ‌స్ ఆఫీస‌ర్ల స‌మావేశం జ‌రిగింది.  డిపోన‌కు ముగ్గురు చొప్పున  విలేజ్, కాల‌నీ బ‌స్ ఆఫీస‌ర్లు హాజ‌రైన ఈ స‌మావేశంలో.. టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి రీజియ‌న్ల వారీగా వారి నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లను ఆయ‌న స్వీక‌రించారు. క్షేత్ర‌స్థాయిలో ఉన్న స‌మ‌స్య‌లను  అడిగి తెలుసుకున్నారు. 

దసరా, దీపావళి, సంక్రాంతి ఉన్నాయని సిబ్బందికి సూచనలు

టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ మాట్లాడుతూ.. విలేజ్, కాల‌నీ బ‌స్ ఆఫీస‌ర్ల ప‌నితీరును మొచ్చుకున్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో 21 వేల‌కు పైగా అద్దెకు బ‌స్సుల‌ను బుకింగ్ చేశార‌ని, ఇందులో ప్ర‌తి ఒక్కరి కృషి ఉంద‌ని అభినందించారు. రాబోయే రోజులు సంస్థ‌కు ఎంతో కీల‌క‌మ‌ని, బ‌తుక‌మ్మ‌, ద‌సరా, దీపావ‌ళి, క్రిస్మ‌స్ తో పాటు సంక్రాంతి పండుగ‌కు ఇదే స్పూర్తితో విధులు నిర్వ‌ర్తించాల‌ని సూచించారు. ఉద్యోగుల కృషి, ప‌ట్టుద‌ల వ‌ల్ల సంస్థ ఉన్న‌త‌స్థాయిలో ఉంద‌ని, నిబ‌ద్ద‌త‌, అంకిత‌భావం, క్ర‌మశిక్ష‌ణ‌తో ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వ‌ర్తించ‌డం వ‌ల్లే ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాలు సంస్థ‌పై ఉంటున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు.  ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి యాజ‌మాన్యం క‌ట్టుబ‌డి ఉంద‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో ద‌శ‌ల వారిగా పెండింగ్ అంశాల‌ను  ప‌రిష్క‌రిస్తున్న‌ట్లు వివ‌రించారు. 

ఈ కార్య‌క్ర‌మంలో సిబ్బంది ఇచ్చిన స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ప్రజ‌ల‌తో మ‌మేక‌మవుతూ..  క్షేత్ర‌స్థాయిలో ఉన్న ప్ర‌తి స‌మ‌స్య‌ను పై అధికారుల దృష్టికి స్వేచ్ఛ‌గా తీసుకురావాల‌ని వీబీవోల‌కు సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈడీలు మునిశేఖ‌ర్, వెంక‌న్న, సోలోమాన్, ఖుష్రోషాఖాన్, రాజ‌శేఖ‌ర్, సీటీఎంలు శ్రీదేవి, శ్రీధ‌ర్, సీపీఎం ఉషాదేవి, సీఈఐటీ శ్రీదేవి, త‌దితరులు పాల్గొన్నారు.

విలేజ్, కాల‌నీ బస్ ఆఫీసర్ కార్యక్రమం

కాగా, రాష్ట్రంలోని ప్రతి గడపకు టీజీఎస్ఆర్టీసీ సేవ‌ల‌ను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో విలేజ్, కాల‌నీ బస్ ఆఫీసర్ అనే  కార్యక్రమానికి మే 2023లో సంస్థ శ్రీకారం చుట్టింది. వీరు ఆర్టీసీ కల్పిస్తోన్న వివిధ ర‌కాల సేవ‌ల‌ను  ప్ర‌జ‌ల‌కు వివరిస్తున్నారు. గ్రామస్థులు, కాల‌నీవాసుల‌తో నిత్యం టచ్‌లో ఉంటూ.. 15 రోజులకోసారి వారితో సమావేశమవుతున్నారు. బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్‌లు, కొత్త సర్వీస్‌లు, సమస్యలు, తదితర అంశాల గురించి సమాచారాన్ని సేక‌రిస్తూ.. ఆ సమాచారాన్ని పై అధికారులకు చేరవేస్తున్నారు. గ్రామాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు, జాతరల వివరాలను సేక‌రించి.. రద్దీ ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్టుగా బస్‌ ట్రిప్పులను పెంచాల‌ని అధికారులకు చెప్తున్నారు.  అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాలకు తమ అద్దె బస్సులను ఉపయోగించుకోవాలని ప్ర‌జ‌ల‌కు వివరిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget