Boycott Asia cup 2025 Ind vs Pak Match | సోషల్ మీడియాలో మళ్లీ బాయ్‌కాట్ ట్రెండ్ | ABP Desam
ఆసియా కప్ 2025 సీజన్లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య ఆదివారం జరగబోతున్న మ్యాచ్‌కి బాయ్‌కాట్ సెగ తగులుతోంది. ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ వేల మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇంకొంతమందైతే ఈ మ్యాచ్‌నే కాదు.. కంప్లీట్‌గా ఈ టోర్నీనే బాయ్‌కాట్ చేయాలని హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. వీళ్ల దెబ్బతో #BoycottAsiaCup, #BoycottINDvPAK హ్యాష్‌ట్యాగ్‌లు ఎక్స్‌లో ట్రెండింగ్‌లోకొచ్చాయి. ‘పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్‌లు పహల్గామ్‌లో సృష్టించిన నరమేధం మేమింకా మర్చిపోలేదు. అలాంటి దుర్మార్గపు దేశంతో క్రికెట్ ఆడడం మాకు ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే ఈ మ్యాచ్ మేం చూడం. ఈ టోర్నీ మొత్తాన్ని బాయ్ కాట్ చేస్తున్నాం. ఈ మ్యాచ్ బీసీసీఐ బ్యాన్ చేయకపోయినా దేశ ప్రజలే బ్యాన్ చేస్తారు. చేయాలి కూడా’ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే భారీ రేట్ల దెబ్బకి మ్యాచ్ టికెట్లు అమ్ముడుపోని విషయం తెలిసిందే. ఇక ఒకవేళ ఈ బాయ్‌కాట్ ట్రెండ్ కూడా సక్సెస్ అయితే ఈ మ్యాచ్ ఆన్‌లైన్ వ్యూవర్‌షిప్‌పై కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సుంది. మరి మీరు కూడా ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌ని సమర్థిస్తారా..? లేదంటే ఈ మ్యాచ్ చూస్తారా..? కామెంట్ చేసి చెప్పండి.





















