PPP Medical Colleges: దేశవ్యాప్తంగా PPP మోడల్‌లోనే కొత్త మెడికల్ కాలేజీలు - అసలు ఈ విధానమేంటి ?
Medical Colleges: పీపీపీ మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా ఏర్పాటవుతున్నాయి. చదువులో నాణ్యత పెంచడంతో పాటు ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వాలు ఈ మోడల్ కు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

PPP medical colleges are being set up across the country: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల అంశం వివాదాస్పదమయింది. పది మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ లో నిర్మించడానికి టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జగన్ మోహన్ రెడ్డి తాము వచ్చాక టెండర్లు రద్దు చేస్తామన్నారు. పీపీపీ అంటే జగన్ కు తెలియదని ప్రైవేటీకరణ చేయడం కాదని ప్రభుత్వం అంటోంది.
పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో మెడికల్ కాలేజీలు
భారతదేశంలో మెడికల్ విద్యను విస్తరించడానికి , ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్‌ను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ మోడల్‌లో ప్రభుత్వం భూమి, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) వంటి హామీలు ఇస్తుంది. ప్రైవేటు భాగస్వాములు నిర్మాణం, నిర్వహణ, విద్యా సేవలు చేపడతారు. యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ప్రకారం, 2014లో 387 మెడికల్ కాలేజీలు ఉండగా, 2025 నాటికి 780కి పెరిగాయి. పీపీపీ మోడల్ ద్వారా మరిన్ని కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ పలు రాష్ట్రాల్లో పీపపీ మోడల్‌లో మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నారు.
ఇదే మోడల్ ను అనుసరిస్తున్న పలు రాష్ట్రాలు
2025లో 7 రాష్ట్రాలు పీపీపీ మోడల్‌లో మెడికల్ కాలేజీల కోసం కొత్త టెండర్లు, రిక్వెస్ట్ ఫర్ ప్రొపోజల్ లేదా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ పిలిచాయి. మొత్తం 40 కన్నా ఎక్కువ మెడికల్ కాలేజీలు ఈ పద్దతిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 75,000 కొత్త MBBS సీట్లు జోడించాలని బడ్జెట్ 2025లో లక్ష్యంగా ప్రకటించారు. మధ్యప్రదేశ్ 4 కాలేజీలకు పీపీపీ మోడల్ అగ్రిమెంట్లు కుదిరాయి. ఆంధ్రప్రదేశ్ 10 కొత్త కాలేజీలకు టెండర్లు పిలిచింది. గుజరాత్‌లో ఇప్పటికే ఉన్న 9 మెడికల్ కాలేజీలను పీపీపీకి ఇస్తున్నారు. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, బిహార్ , కర్ణాటక లో పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు.
ప్రైవేటు చేతులు కలిపితేనే వేగంగా నిర్మాణాలు
ప్రభుత్వమే నిర్మాణాలు చేపట్టి కాలేజీలను నిర్వహించడం ఓ సవాల్ వంటిది. వైసీపీ ప్రభుత్వంలో పదిహేడు కాలేజీలకు శంకుస్థాపనలు చేస్తే.. అత్యధిక..పునాదులు దాటలేదు. ఐదేళ్లలో కష్టమని స్వయంగా జగన్ కూడా వ్యాఖ్యానించారు. అందుకే ప్రైవేటు రంగాన్ని ఇన్వాల్వ్ చేయాలని నిర్ణియంచుకున్నారు. ఐదేళ్లలో 75,000 ఎంబీబీఎస్ సీట్లు పెంచాలని గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్‌కేర్ మెరుగు. ఆయుష్మాన్ భారత్‌తో లింక్, ఉచిత OP సేవలు అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2027-28 నాటికి 50+ కొత్త పీపీపీ కాలేజీలు ఆపరేషనల్ కావాల్సి ఉంది. అందులో ఏపీలో కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి.
టెండర్లలో పాల్గొనవద్దని .. తాము వచ్చాక రద్దు చేస్తామని జగన్ హెచ్చరిస్తున్నారు. మరి టెండర్లలో పాల్గొంటారా ..పాల్గొనేందుకు ప్రైవేటు వ్యక్తులు ఆసక్తి చూపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.





















