Tricolour In Eye : కంటిలో త్రివర్ణ పతాకం, కోయంబత్తూరు ఆర్టిస్ట్ సాహసం!
Tricolour In Eye : 75 ఏళ్ల స్వాతంత్ర్యానికి గుర్తుగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. కోయంబత్తూరుకు చెందిన ఓ ఆర్టిస్ట్ కంటిలో త్రివర్ణ పతాకాన్ని పెట్టుకుని సాహసోపేతమైన చర్యకు పాల్పడ్డారు.
Tricolour In Eye : భారతదేశం స్వాతంత్ర్యాన్ని సాధించి 75 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు. స్వతంత్ర వజ్రోత్సవాలను ఇప్పటికే పలు రాష్ట్రాలు నిర్వహిస్తాయి. జాతీయ పతాకాలతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దేశభక్తిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకుంటున్నారు. తమిళనాడుకు చెందిన ఓ మినియేచర్ ఆరిస్ట్ దేశభక్తిని వినూత్నంగా ప్రదర్శించారు.
మినియేచర్ ఆర్టిస్ట్ సాహసం
కోయంబత్తూరుకు చెందిన మినియేచర్ ఆర్టిస్ట్, సోషల్ మీడియా కార్యకర్త UMT రాజా... 75 ఏళ్ల స్వాతంత్ర్యం గురించి అవగాహన కల్పించడంలో సాహసోపేతమైన ప్రయత్నం చేశారు. అతను త్రివర్ణ పతాకం మినియేచర్ రూపొంచారు. దానిని తన కుడి కంటిలో పెట్టుకున్నారు. తన దేశభక్తిని చాటుకోడానికి రాజా ఇలా చేశానని చెబుతున్నారు. ముందుగా స్లిమ్ ఫిల్మ్ రకానికి చెందిన గుడ్డలో చిన్న జాతీయ జెండాను రూపొంచారు రాజా. దానిని కంటిలో ఉంచారు. కంటి లోపల ఉంచే పనిని పూర్తి చేయడానికి అతనికి 3 గంటలకు పైగా పట్టింది.
కంటిలో త్రివర్ణ పతాకం
తన కంటిలో త్రివర్ణ పతాకాన్ని ఉంచే ఈ సాహసోపేతమైన చర్య చేయడానికి ముందు, అతను వైద్యుడిని సంప్రదించాడు. కంటిలో ఎలర్జీ, దురద లాంటివి వస్తాయని, అలా చేయొవద్దని వైద్యులు సలహా ఇచ్చారు. అయితే స్వాతంత్య్ర పోరాటంపై అవగాహన కల్పించాలనే సంకల్పంతో వైద్యుల సూచనలతో అతను ఈ పని చేశారు. మినియేచర్ ఆర్టిస్ట్ రాజా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని ప్రజలకు సూచించారు. ఎందుకంటే ఇది కళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇన్ఫెక్షన్, తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు భారత స్వాతంత్ర్య పోరాటంపై అవగాహన కల్పించడం కోసం తాను ఇలా చేశానని రాజా సోషల్ మీడియాలో తెలిపారు. జాతీయ జెండాపై అవగాహన కల్పించేందుకు ఆయన స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ప్రమాదకరమైన చర్యపై నెటిజన్లు ప్రశంసలతో పాటు విమర్శలను చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర చర్యలు చేయొద్దని అంటున్నారు.
హర్ ఘర్ తిరంగా
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘హర్ ఘర్ తిరం’గా పేరుతో ఆగస్టు 13, 14వ తేదీల్లో ప్రతి ఇంటిపై జెండాను ఎగుర వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేగాక పౌరులు తమ సోషల్ మీడియా అకౌంట్ల డీపీలు, స్టేటస్‌లలో త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని పేర్కొన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమంలో భాగంగా.. harghartiranga.com పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పోర్టల్‌లో పౌరులు తమ ఫోటోలతో పేరు నమోదు చేసుకోవచ్చని కేంద్రం సూచించింది. ఇలా నమోదు చేసుకున్న వారికి సర్టిఫికేట్ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
Also Read : Independence Day 2022: ఈసారి ఎర్రకోటలోని స్వాతంత్య్ర వేడుకలకు ఓ స్పెషాల్టీ ఉంది, అదేంటో తెలుసా?
Also Read : Independence Day Wishes : మీ ఫ్రెండ్స్‌కి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి