Diella World's First AI Minister | అవినీతిని నిర్మూలన కోసం ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ ను నమ్ముకున్న ఆల్బేనియా | ABP Desam
ఈ మంత్రిగారు అందరిలాంటి మంత్రి గారు కాదు. మీరు పార్టీ కోసం ఎలక్షన్స్ టైమ్ లో ఫండ్ ఇచ్చారు కదా అని ఇల్లీగల్ గా కాంట్రాక్టులు కావాలంటే గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీసు అంటుంది. ఏదో ఒక తాయిలం చేతిలో పెట్టేసి...మనం మనం కోఆపరేషన్ చేసుకోవాలి అంటూ.. ప్రాజెక్టు డీలింగ్ మాట్లాడుకోవాలనకుంటే మీరిక కోర్టులతో డీలింగ్ చేసుకోవాల్సిందే. డబ్బుకు లొంగదు..అత్యాశకు పోదు. అసలు ఎమోషన్సే ఉండవు ఆ మంత్రి గారికి. భావోద్వేగాలకు లోనుకాని..అవినీతికి పాల్పడిని ఆ మంత్రి గారి గురించే ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. ఎందుకంటే ఆమె మనిషే కాదు. అలా అని రోబో కూడా కాదు. ప్రపంచంలోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పని చేసే మంత్రి. ఆమె పేరే డియెల్లా. ఎవరీ డియెల్లా..AI మంత్రి అవ్వటం ఏంటీ..ఈ క్రేజీ టాపిక్ గురించి ఈ వారం టెక్నాలజియాలో డిస్కస్ చేద్దాం.
అవినీతి నిర్మూలన ఇది ప్రభుత్వాలు దశాబ్దాలుగా చెబుతూ వస్తున్న మాట. నిజంగా ఇది సాధ్యమౌతోందా. కొంతమంది రాజకీయ పుట్టుకతోనే అవినీతి పరులైతే..మరికొంత ఆమ్యామ్యాల కోసమే పాలిటిక్స్ లోకి వస్తారు. మరికొంత మంది ఎన్నికలకు ముందు వరకూ మంచిగా ఉండొచ్చు. కానీ ఒక్కసారి అధికారం చేతికి రాగానే చాలా పనులు వాళ్ల చేతుల్లో లేకుండానే జరిగిపోతాయి. భావోద్వేగాలతో ఆడుకునో..డబ్బు ఆశ చూపించో ఆ నేతల్ని కూడా అవినీతి పరులుగా మార్చేసే వ్యవస్థల్లోనే మనం బతుకుతున్నాం. ఇలాంటి టైం లో ఆల్బేనియా కొత్త ఆలోచన చేసింది. అసలు మనిషికి ఇన్ఫ్లుయెన్స్ కానీ టెక్నాలజీని మంత్రిగా చేసి అధికారాలు కట్టబెట్టింది. అలా మంత్రిగా బాధ్యతలు అందుకున్న AI అసిస్టెంటే డియెల్లా.
ఆల్బేనియాకు డియెల్లా ను మినిస్టర్ ఫర్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ గా నియమిస్తున్నట్లు ఆల్బేనియా ప్రధాని ఏడీ రెహ్మా ప్రకటించి సంచలనం రేకెత్తించారు. ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ ను మంత్రిగా నియమించటానికి ఏ రాజ్యాంగం ఒప్పుకోదు కాబట్టి ప్రెసిడెంట్ డిక్రీ ద్వారా ప్రత్యేక అధికారాలతో రెహ్మా డియెల్లా క్యాబినెట్ సెక్రటరీ గా నియమించి మంత్రి బాధ్యతలను అప్పగించారు. దేశంలో ఎవరికి కాంట్రాక్టులు కావాలన్నా..ఎలాంటి అనుమతులు ఇవ్వాలన్నా డియెల్లానే చూసుకుంటుంది. వాళ్ల ఫైల్స్ ను ప్రాసెస్ చేసి..అందులో నిజాయతీ పరులైన..పనిని సమర్థంగా నిర్వహించే వాళ్లకు మాత్రమే డియెల్లా అనుమతులు ఇచ్చేలా ప్రీ ప్రోగ్రామింగ్ AI ను డిజైన్ చేయించారు. ఆల్బేనియా నేషనల్ ఏజెన్సీ ఫర్ ఇన్ఫర్మేషన్ సొసైటీ AKSHI ఇంకా మైక్రోసాఫ్ట్ కలిసి డియెల్లా AI ను రూపొందించాయి. ఆల్బేనియా సంస్కృతిని ప్రతిబింబించేలా ఆమె రూపం కూడా ఉంటుంది. ఈ ఏడాది జనవరిలోనే డియెల్లా తన సేవలను ప్రారంభించారు. అల్బేనియాకు చెందిన ఈ గవర్నెన్స్ ప్లాట్ ఫామ్ లో ఓ వర్చువల్ అసిస్టెంట్ గా డియెల్లా పని ప్రారంభించి ఈ తొమ్మిది నెలల కాలంలో ఏకంగా వెయ్యికి పైగా సేవలను అందిస్తూ ఏకంగా 36వేల ఫైళ్లను క్లియర్ చేసింది.
ఈ సేవలు, ఫైళ్ల క్లియరెన్స్ ను స్టడీ చేసి AKSHI విభాగం డియెల్లా పని తీరుకు వందకు వంద శాతం మార్కులు ఇవ్వగా..ఆ దేశ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా మంత్రి బాధ్యతలను అప్పగించింది. దీనికి రీజన్ ఆల్బేనియాలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోతోంది. పది మందిలో 8మంది ఆల్బేనియన్లు అవినీతి తమకు సమస్యగా మారిందని ఫిర్యాదులు చేస్తున్నారు. గడచిన ఏడాది కాలంలో 41వేల 541 అవినీతి ఆరోపణల ఫిర్యాదులు అందగా..వాటిలో 125 ఫిర్యాదులపై మాత్రమే కేసులు నమోదు అయ్యాయి. అంటే యాక్షన్ రేట్ అక్కడ 0.3 పర్సెంట్ మాత్రమే. అందుకే ప్రధాని రెహ్మా డబ్బుకు లొంగని, అవినీతికి పాల్పడని AI డియెల్లాను పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ విభాగానికి మంత్రిని చేశారు. ఇప్పటి వరకూ ఏ దేశం కూడా AI కి క్యాబినెట్ మంత్రి స్థాయి పదవిని కట్టబెట్టలేదు. ఇది AI విస్తరిస్తున్న తీరులో ఓ రెవల్యూషనరీ స్టెప్ అనే చెప్పాలి.
అయితే ఇందులో నెగటివ్స్ కూడా ఉన్నాయి. పార్లమెంటులో AI నియామకాన్ని ఆమోదించలేదు. కేవలం ప్రెసిడెంట్ తన అపరిమిత అధికారాలతో మాత్రమే ఈ నియామకాన్ని చేపట్టారు. AI కి అవినీతికి పాల్పడదు సరే ఎలాంటి మానిప్యులేషన్స్ కి ఈ AI గురి కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకున్నారనే విషయాలను ఆల్బేనియా ప్రభుత్వం బయటపెట్టలేదు. ఎవరైనా ఈ AI ను గ్రిప్ లోకి తీసుకుని మిస్ యూజ్ చేస్తే ఎవరిది రెస్పాన్బులిటీ. అసలు ఈ AI స్వతంత్రంగా వ్యవహరిస్తుందా..లేదా ఎవరైనా ఈ AI ను రన్ చేస్తున్నారా..ఒకవేళ వేరే వాళ్లు రన్ చేసే లెక్కనైతే కరప్షన్ కి ఆస్కారం లేదని ఎలా చెప్పగలమనే ప్రశ్నలను ఆల్బేనియాలోని ప్రతిపక్ష పార్టీలు, టెక్నాలజీ క్రిటిక్స్ రైజ్ చేస్తున్నారు. చూడాలి ఆల్బేనియా తీసుకున్న ఈ బోల్డ్ స్టెప్స్ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో..AI కేవలం మనుషులను అసిస్ట్ చేసే టెక్నాలజీ గా నే ఉంటుందా...లేదా మనుషుల్ని రూల్ చేసే స్టేజ్ కి చేరుకుంటుందా..టైమ్ విల్ డిసైడ్.



















