(Source: ECI/ABP News/ABP Majha)
KCR Hijab Row : మత పిచ్చి కార్చిచ్చు దేశాన్ని నాశనం చేస్తుంది - హిజాబ్ వివాదంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు !
హిజాబ్ వివాదంపై అసెంబ్లీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మత పిచ్చి దేశానికి మంచిది కాదన్నారు.
హిజాబ్ ( Hijab ) వివాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ( KCR ) అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. మత పిచ్చి దేశానికి మంచిది కాదని స్పష్టం చేశారు. మత పిచ్చి అనే కార్చిచ్చు దేశాన్ని సర్వదేశనం చేస్తుందని గుర్తుచేశారు. కొందరు మత కల్లోలాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. హిజాబ్ వివాదం ఎందుకు తలెత్తిందని ప్రశ్నించారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా డ్రెస్సులు వేసుకుంటారని.. మతాన్ని బట్టి కూడా వస్త్రధారణ ఉంటుందని గుర్తుచేశారు. ఎవరు ఏ బట్టలు వేసుకుంటే మధ్యలో ప్రభుత్వాలకు అభ్యంతరం ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు. ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని విమర్శించారు.
ఉక్రెయిన్ విద్యార్థులకు కేసీఆర్ బంపర్ ఆఫర్ - వారిని డాక్టర్లను చేస్తామని భరోసా !
బెంగళూర్ ( Bengalore ) దేశంలోనే సిలికాన్ వ్యాలీగా ఉందని.. హైదరాబాద్ ( Hyderabad ) దాని తర్వాత స్థానంలో ఉందని ఆయన వెల్లడించారు. బెంగళూర్, హైదరాబాద్ లో అనేక దేశాల వాళ్లు పని చేస్తుంటారని సీఎం కేసీఆర్ అన్నారు. మతకలహాలు ( Communal Violence ) పెట్టి ప్రజల్ని విడదీసి ప్రజల్ని తన్నుకునే పరిస్థితి ఉంటే… బెంగళూర్ లో హిజాబ్ పంచాయతీ పెడుతున్నారని.. ప్రజలు తొడుక్కునే దుస్తులతో గవర్నమెంట్కు ఏం సంబంధం అని ప్రశ్నించారు.సంకుచిత వ్యవహారాలు చేస్తున్నారని.. ఈ దేశం ఎటుపొతుందని కేసీఆర్ అన్నారు. మతకలహాలు ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇది పూర్తిస్థాయిలో పెడధోరణి అని ఇది దేశానికి మంచిది కాదని ఆయన అన్నారు.
మెప్మా, సెర్ఫ్, ఫీల్డ్ అసిస్టెంట్‌లకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్
దేశ, రాష్ట్ర యువత ( Youth ) ఇలాటి వాటిపై ఆలోచించాలని కేసీఆర్ సూచిచారు. ఎన్నో దశాబ్ధాల తరబడి అనేక మంది శ్రమపై నిర్మితమైన ఈ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో యూపీఏ గవర్నమెంట్ లో నానా నిందు మోపి ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. యూపీఏ కన్నా దిగజారిందని అన్నారు. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో ( Karnataka High Court ) తీర్పు వచ్చిన సమయంలో కేసీఆర్ వ్యాఖ్యలు చేయడంతో హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ గతంలోనూ ఈ వివాదంపై స్పందించారు. బీజేపీ మత పిచ్చి పెడుతోందని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే తరహాలో అసెంబ్లీలోనూ మాట్లాడారు. కర్ణాటక లోని ఓ విద్యాసంస్థలో ప్రారంభమైన హిజాబ్ వివాదం... తర్వాత జాతీయ స్థాయికి విస్తరించింది.