News
News
X

Viveka Murder Case: వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్‌ను మూడోసారి విచారిస్తున్న సీబీఐ

Viveka Murder Case: వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్‌ను సీబీఐ విచారించడం ఇది మూడోసారి. ఇప్పటికే జనవరి 28న, ఫిబ్రవరి 24న రెండుసార్లు అవినాష్ రెడ్డిని విచారించారు.

FOLLOW US: 
Share:

 Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి హాజరయ్యారు. ఈ ఉదయం జూబ్లీహిల్‌లోని తన నివాసం నుంచి అనుచరులతో బయల్దేరి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. 

వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్‌ను సీబీఐ విచారించడం ఇది మూడోసారి. ఇప్పటికే జనవరి 28న, ఫిబ్రవరి 24న రెండుసార్లు అవినాష్ రెడ్డిని విచారించారు. విచారణలో భాగంగా ఈనెల ఆరో తేదీన హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈనెల 4వ తేదీన పులివెందులలోని వైయస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు కారణంగా ఆ తేదీన రాలేనని చెప్పారు. సిబిఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు. దీంతో సిబిఐ అధికారులు ఈనెల 10వ తేదీన విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన మూడోసారి సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఈనెల 12వ తేదీన వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. 

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పైనే ప్రధానంగా సీబీఐ అనుమానం 

వై.ఎస్. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో అవినాష్ రెడ్డిపై ప్రధానంగా అనుమానాలు వ్యక్తం చేసింది.  వైఎస్ అవినాష్‌రెడ్డి, శివశంకర్ రెడ్డితో వివేకాకు రాజకీయ వైరుధ్యం పెరిగిందని సీబీఐ పేర్కొంది. ఎంపీ టికెట్ అవినాష్‌రెడ్డికి బదులు తనకు ఇవ్వాలని వివేకా కోరుకున్నారని తెలిపింది. తనకు ఇవ్వకపోయినా షర్మిల, విజయమ్మకు ఇవ్వాలని వివేకా పట్టుబట్టారని పేర్కొంది. వివేకా రాజకీయ కదిలికలు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డికి నచ్చలేదని సీబీఐలో తెలిపింది. శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి వివేకా హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోందని పేర్కొంది. హత్య జరిగిన రోజు రాత్రి వై.ఎస్. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇంటికి సునీల్ యాదవ్ వెళ్లాడని ఐదుగురితో కలిసి అవినాష్‌రెడ్డి హత్య స్థలానికి వెళ్లాడని తెలిపింది. నిందితులు హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారని వివేకా శరీరంపై ఉన్న గాయాలు కనిపించకుండా బ్యాండేజీ కట్టారని కోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో సీబీఐ పేర్కొంది. ఈ కోణంలోనే సీబీఐ విచారణ సాగుతున్నట్టు తెలుస్తోంది. 
 
కోర్టులో కేసు విచారణ 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను అరెస్ట్  చేయకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలని కోరుతూ అవినాష్ రెడ్డి వేసిన రిట్‌ పిటిషన్ తెలంగాణ హైకోర్టు కాసేపట్లో విచారణకు రానుంది. సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని పిటిషన్‌లో కోరారు అవినాష్‌రెడ్డి. తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని ... పలుమార్లు కోరినా సిబిఐ తన అభ్యర్ధనను అంగీకరించలేదన్నారు. 160 CRPC నోటీస్‌ ఇచ్చారు కాబట్టి సీబీఐ ఎలాంటి బలవంతపు, చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.  వివేకా హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని.. ఇప్పటివరకు సీబీఐ అరెస్ట్ చేయలేదని.. దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదని  అవినాష్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.  దస్తగిరి అక్కడ ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే..సీబీఐ విచారణ కొనసాగుతోందన్నారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ..ఈ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. 

సునీల్ యాదవ్ గూగుల్ టేక్ఔట్ ఫోన్ సిగ్నల్ లొకేషన్ చూపి సిబిఐ తనను వేధిస్తోందని..  స్పాట్ లో దొరికిన లేఖపై సిబిఐ దర్యాప్తు చేయటం లేదన్నారు.  వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉందని..  వివేకా హత్య ఎలా జరిగిందో ముందుగానే నిర్ణయించుకొని..అదే కోణంలో విచారణ చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారని..  తాను విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారని  అవినాష్‌రెడ్డి ఆరోపించారు. నోటీస్ దశలో విచారణ సాగుతుండగా చార్జ్ షీట్‌లో నేరస్తునిగా సిబిఐ చిత్రీకరిస్తోందన్నారు. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది. ఈ విచారణ సందర్భంగా కోర్టు ఎలా స్పందిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.   

Published at : 10 Mar 2023 12:13 PM (IST) Tags: YS Viveka murder case Telangana High Court CBI Enquiry YS Avinash Reddy

సంబంధిత కథనాలు

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

MCH Hospital Erramanzil: ఎర్రమంజిల్ లో ఎంసీహెచ్ ఆస్పత్రికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన

MCH Hospital Erramanzil: ఎర్రమంజిల్ లో ఎంసీహెచ్ ఆస్పత్రికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన

YS Sharmila: కింద పడిపోయిన వైఎస్ షర్మిల - ఇంటిముందే తోపులాట, ఉద్రిక్తత

YS Sharmila: కింద పడిపోయిన వైఎస్ షర్మిల - ఇంటిముందే తోపులాట, ఉద్రిక్తత

హైదరాబాద్ మెట్రో విస్తరణ లాభసాటి కాదన్న కేంద్రం యూపీలోని 10 నగరాల్లో నిర్మిస్తోంది: కేటీఆర్

హైదరాబాద్ మెట్రో విస్తరణ లాభసాటి కాదన్న కేంద్రం యూపీలోని 10 నగరాల్లో నిర్మిస్తోంది: కేటీఆర్

Playground Under flyover: ఫ్లైఓవర్ల కింద ఆట స్థలాలు - ఆలోచన అదిరిపోయిందంటూ మంత్రి కేటీఆర్ ట్వట్

Playground Under flyover: ఫ్లైఓవర్ల కింద ఆట స్థలాలు - ఆలోచన అదిరిపోయిందంటూ మంత్రి కేటీఆర్ ట్వట్

టాప్ స్టోరీస్

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Group 1 Mains Postponed :  ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్‌! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్‌ 1 నుంచి ఫీజు!

UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్‌! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్‌ 1 నుంచి ఫీజు!