TRS MLAs Buying: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: నేడు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నిందితులు, కీలకం కానున్న FSL రిపోర్టు
ఫాంహౌజ్‌లో రికార్డయిన వీడియో ఫుటేజీ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఆ వీడియో ఫుటేజీ ఒరిజినలా కాదా? తేల్చేందుకు నిందితుల వాయిస్ రికార్డు చేయనున్నారు.
తెలంగాణలో సంచలనం అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు టీమ్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే వీరిని కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు వారిని వరుసగా రెండో రోజు విచారణ చేస్తున్నారు. చంచల్‌గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను తొలిరోజైన నిన్న (నవంబరు 10) రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నించారు. నేడు (నవంబరు 11) నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ (ఎఫ్ఎస్‌ఎల్)కు తీసుకెళ్లారు.
ఈ కేసులో ఫాంహౌజ్‌లో రికార్డయిన వీడియో ఫుటేజీ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఆ వీడియో ఫుటేజీ ఒరిజినలా కాదా? ఆడియో, వీడియో రికార్డుల విశ్లేషణ కోసం ల్యాబ్‌లో నిందితుల వాయిస్ రికార్డు చేయనున్నారు. ఈ ఎఫ్ఎస్ఎల్ పరీక్షలో నిందితుల వారి వాయిస్ పరిశీలనే కీలకం కానుంది.
అంతేకాకుండా, ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు కోటానుకోట్ల డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారనే కోణంలోనూ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో రామచంద్రభారతి ఇచ్చే వాంగ్మూలం, ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కీలకం కానున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల వెనుక ఎవరున్నారనే అంశంపైనా సిట్ విచారణ చేపడుతోంది. నిందితుల కాల్ డేటా, సెల్‌ఫోన్‌లో వీడియోల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కస్టడీ ముగిశాక నిందితులను మళ్లీ కోర్టులో హాజరు పర్చనున్నారు.
ఫాం హౌస్ కేసు నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. నిన్న తొలి రోజు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారణ చేశారు. మరోవైపు నేడు నిందితుల బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది.
హైదరాబాద్ కమిషనర్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు
మొయినాబాధ్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలకు ఎరవేసేందుకు యత్నించిన కేసులో సిట్ విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వ ఆదేశాలు అనుసారం సిట్ విచారణకు సీవీ ఆనంద్ నేతృత్వంలో టీమ్ ఏర్పాటైంది. డీజీ ర్యాంకు అధికారి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేస్తు హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. డీజీ ర్యాంకు అధికారి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో 6 అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేస్తు హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఈ ప్రత్యేక దర్యాప్తు టీమ్ లో సభ్యులుగా నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కమలేశ్వర్ సింగేనవర్, శంషాబాద్ డీసీపీ ఆర్ జగదీశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ డివిజన్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డిని నియమించారు. దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ హోం శాఖ కార్యదర్శి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
మొయినాబాద్‌లోని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు ప్రయత్నించారని రామచంద్రభారతి, కోరె నందకుమార్, సింహయాజిలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసును సీబీఐ లేదా హైకోర్టు ఏర్పాటుచేసే సిట్‌కు బదిలీ చేయాలని బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి రిట్ దాఖలు చేశారు. ము గ్గురు నిందితులు కూడా సీబీఐ దర్యాప్తు కోరుతూ రిట్ వేశారు. ఫోన్ల ట్యాపింగ్‌పై మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులన్నింటిలోనూ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల సమయం కావాలని ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జే రామచంద్రరావు కోరారు. ఇందుకు ప్రతివాదుల తరఫు న్యాయవాది సీహెచ్ ప్రభాకర్ అభ్యంతరం చెప్తూ గడువు ఎకువ ఇవ్వవద్దని కోరారు. దీంతో విచారణను ధర్మాసనం ఈ నెల 18కి వాయిదా వేసింది. దర్యాప్తును మాత్రం సిట్ ద్వారా చేయించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.