By: ABP Desam | Updated at : 09 Jan 2023 06:54 PM (IST)
తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమిషనర్
‘ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారితనమే ఆర్.టి.ఐ ముఖ్య ఉద్దేశ్యం’ అని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్ అన్నారు. విశ్వవిద్యాలయ సెనెట్ హాల్ లో సోమవారం ఉదయం వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ అద్యక్షతన నిర్వహించిన అవేర్నెస్ ప్రోగ్రం ఆన్ ఆర్ టి ఐ (రైట్ టూ ఇన్ఫర్మేషన్ పర్స్పెక్టివ్ అండ్ ప్రాక్టీసు) అనే అంశం పై ఉద్యోగులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
భారత దేశం అతి పెద్ద గొప్ప ప్రజాస్వామ్య దేశం, సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని, జటిలమైన సమస్యను కుడా ఆర్ టి ఐ చట్టం వినియోగం ద్వార పరిష్కరించుకోవచ్చు అని, చట్టం పై అందరికి అవగాహనా అవసరం అని అన్నారు. 39 వేల కేసు లలో 33 వేల కేసు లు పరిష్కరించు కోవటం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనా లో పారదర్శకత పెరిగింది అని, ప్రజలకు ఆర్ టి ఐ ఒక భరోసా అని, కోవిడ్ లో కుడా ఆర్ టి ఐ కేసు లు పరిష్కరించామని చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ లబ్ది పొందిన ప్రతి సంస్థ ఆర్ టి ఐ పరిధి లోనికి వస్తున్నది అని, ప్రజా ప్రయోజనం ముఖ్యం అని, ప్రశ్నలు సూటిగా, స్పష్టంగా ఉండాలని, పబ్లిక్ లైఫ్ ప్రైవేటు లైఫ్ వేరు వేరు అని వ్యక్తిగత జీవితం మినహింపు ఉంటుంది అని అన్నారు.
పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లకు ఆర్ టి ఐ చట్ట వివిధ సెక్షన్ లపై అవగహన అవసరం అన్నారు. ఆన్లైన్ దిశగా అడుగులు పడుతునట్టు, పరిధిలోకి లోబడి వ్యవహరించాలని, వాస్తవాలు బయటకు రావటానికి చీకటిలో దాగిన అంశాలు బయటకు రావటానికి ఆర్ టి ఐ చట్టం తీసుకోని వచ్చింది అని, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రశ్నించటం అంటే తెలుసుకోవటం అని, సానుకూల దృక్పదం తో ఇరువర్గాలు వ్యవహరించాలని అన్నారు. సిస్టంను గౌరవించాలని, రాజ్యాంగ పరిధికి లోబడి చట్టం లో పొందుపరచిన విధంగా ఉండాలని, అధికారుల నిర్లక్ష్య ధోరణి, మూడవ వ్యక్తి జోక్యం వద్దు అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థిని అయినందుకు గర్వ పడుతున్నానని, ఆర్ టి ఐ కమీషనర్ హోదా ను పొందిన వ్యక్తులలో దేశం లో అతి పిన్న వయస్కుల జాబితాలో ఉన్నందుకు సంతోషిస్తున్నాను అన్నారు.
వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ మాట్లాడుతూ.. ప్రజా జీవితం లో ఒక గొప్ప విప్లవాత్మక మార్పు ఆర్ టి ఐ చట్టం తీసుకుని వచ్చింది అని, ఉద్యోగులలో జవాబుదారి తనం, బాధ్యత, పారదర్శకత పెంచటం లో చట్టం చాలా ఉపయోగ పడింది అని, చట్ట పరిధికి లోబడి ప్రతి అధికారి పని చేయాలని, సమాచార హక్కు ఒక మానవ హక్కు అని, విశ్వవిద్యాలయంలో చట్టం అమలు బాగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య టి శ్రీనివాసరావు, ఆర్ టి ఐ సెల్ సంచాలకులు డాక్టర్ ఎం శ్రీనివాస్ తో పాటు బోధనా, బోధనేతర ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు, సభికులు అడిగిన వివిధ సందేహాలను కమిషనర్ నివృత్తి చేశారు. అనంతరం శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి జ్ఞాపిక తో సన్మానించారు.
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
TSPSC Group1 Mains Exam Dates: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ
Hyderabad Crime: అద్దె ఇంటి కోసం వచ్చి చైన్ స్నాచింగ్, గుడి నుంచి ఫాలో అయ్యి చివరి నిమిషంలో ట్విస్ట్
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్గా భారతి హోళికేరి
తెలంగాణ నుంచి తరిమేయండి- ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం