By: ABP Desam | Published : 24 Mar 2022 10:24 AM (IST)|Updated : 24 Mar 2022 10:24 AM (IST)
సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మహారాష్ట్ర వెళ్లనున్నారు. ఫ్యామిలీతో కలిసి కొల్హాపూర్‌లోని దేవాలయాన్ని సందర్శించనున్నారు. దేశంలోని శక్తిపీఠాల్లో ఒకటైన మహాలక్ష్మి అమ్మవారిని కేసీఆర్ ఫ్యామిలీ దర్శించుకోనుంది.
సీఎం కేసీఆర్ కాసేపట్లో ప్రత్యేక విమానం బయల్దేరి మహారాష్ట్ర చేరుకుంటారు. కొల్హాపూర్ చేరుకొని అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. దేశంలోని అష్టాదశ పీఠాల్లో కొల్హాపూర్ ఆలయం ఏడోది. ఇక్కడ కొలువై ఉన్న లక్ష్మీ దేవి ఆలయం చాలా ప్రత్యేకత కలిగిందని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా లక్షలమంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు సమర్పించుకుంటారు.
ఫిబ్రవరిలో కూడా కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించారు. అప్పుడు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే పిలుపు మేరకు ముంబయి వెళ్లి ఆయన్ని కలిశారు. ఆయనతోపాటు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కూడా కలిసి జాతీయ రాజకీయాలపై మాట్లాడారు. దేశంలో ప్రత్యామ్నాయన రాజకీయాలు రావాల్సిన అవసరం ఉందని ఆ సందర్భంగా సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే గట్టిగానే చెప్పారు. ఆ సమావేశంలో మంత్రి సంతోష్‌కుమార్‌తోపాటు ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. ఈసారి పర్యటన పూర్తిగా ఆధ్యాత్మికమైందని... రాజకీయాలతో సంబంధం లేదని టీఆర్‌ఎస్ వర్గాలు చెప్పాయి.
KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ
Gold-Silver Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు - మీ నగరంలో రేట్లు ఇవీ
Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్
Inter Academic Calendar : ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 221 రోజులతో షెడ్యూల్ ఖరారు
Governor Tamili Sai : బద్ధ శత్రువునైనా గౌరవిస్తా, నాపై రాళ్లు రువ్వితే ఆ రక్తంతో చరిత్ర రాస్తా : గవర్నర్ తమిళి సై
Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'
Breaking News Live Updates: నేడు సీఎం జగన్ కర్నూల్ పర్యటన, భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన
Unnatural Rape in Jail: జైలులోనే అసహజ శృంగారం, తోటి ఖైదీపై యువకుడు బలవంతంగా అత్యాచారం
PreDiabetes: ప్రీడయాబెటిస్ స్టేజ్‌లో ఉన్న యువతలో గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, తేల్చిన అంతర్జాతీయ అధ్యయనం