అన్వేషించండి

తెలంగాణ ప్రజలను గెలిపించినట్టే దేశ ప్రజలను గెలిపిస్తాం: సీఎం కేసీఆర్

తెలంగాణలో ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేసి సాధించినామన్నారు కేసీఆర్. పల్లెలు పట్టణాలను అభివృద్ధి పరుచుకున్నామని వివరించారు.

ఏ పని చేసినా అర్థవంతంగా ప్రకాశవంతంగా చేయాలన్నారు సీఎం కేసీఆర్. సరిగ్గా 21 సంవత్సరాల క్రితం కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో ప్రారంభమైన తాము సమైక్య పాలనలో కుంగిపోయిన తెలంగాణ ప్రజానీకాన్ని కడుపుల పెట్టుకోని ముందుకు సాగినం అన్నారు. రాష్ట్రాన్ని సాధించుకుని అనతికాలంలోనే వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు, తాగునీరు అన్ని రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసుకున్నట్టు వివరించారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమైతున్నవి అని పక్కరాష్ట్రాల వాళ్లు ఆశ్చర్య పడుతున్నరని తెలిపారు. ఎంచుకున్న కార్యాన్ని ఒక యజ్జంలాగా దీక్షలాగా చేసుకుంటూ వచ్చినందునే ఇదంతా సాధ్యమైతుందన్నారు.  

75 ఏళ్ల స్వతంత్ర భారతంలో దేశాన్నేలిన పార్టీలు గద్దెనెక్కడం గద్దెను దిగడం తప్ప దేశానికి చేసిందేమిలేదని విమర్శించారు కేసీఆర్. జై తెలంగాణ నినాదంతో ఉద్యమించి మొత్తం భారాన్ని నెత్తిన పెట్టుకున్నామన్నారు. అనుకున్నది సాధించినామని గుర్తు చేశారు. ఇతర పార్టీలకు రాజకీయాలు ఒక క్రీడలాంటివని టిఆర్ఎస్ పార్టీకి అదో టాస్క్‌గా అభివర్ణించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కార్యకర్తల్లా కమిట్మెంట్‌తో పనిచేశామన్నారు. అంతగా కష్టపడ్డం కాబట్టే గొప్ప విజయాలు సాధించామన్నారు. రాష్ట్రం వచ్చేనాటికి తెలంగాణ తలసరి ఆదాయం లక్ష రూపాయలు ఉంటే ఇప్పుడు అది 2 లక్షల 78 వేల రూపాయలకు పెరిగిందని తెలిపారు. తెలంగాణ జిఎస్డీపీ 2014లో 5 లక్షల 6 వేలుంటే నేడు 11 లక్షల 50 వేలకు చేరుకుందన్నారు. 

ఇంతటి అభివృద్ధిని సాధించడానికి తెలంగాణలో కష్టపడి పని చేసినట్టే దేశం కోసం కష్టపడి పనిచేసి సాధించి చూపెడుదామన్నారు సీఎం కేసీఆర్. జాతీయ పార్టీ పెట్టాలని ఆషామాషీగా తీసుకుంటున్న నిర్ణయం కాదన్న ఆయన... అన్నీ చేసి చూయించి బలమైన పునాదుల మీదినించే నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రాలు దేశం  రెండు కలిసి అభివృద్ధి చెందితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమన్న కేసీఆర్... తెలంగాణ జీఎస్డీపీ వాస్తవానికి 14.5 లక్షల కోట్ల రూపాయలుండాల్సిందన్నారు. కానీ కుంచిత స్వభావంతో ఉన్న కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల చాలా విజయాలను తెలంగాణ అందుకోలేక పోతోందన్నారు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం సాగిన నాటి  త్యాగాలు చాలా వరకు నెరవేరకుండానే పోయాయని అభిప్రాయపడ్డారు. 

రెండు ముఖ్యమైన వివక్షలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని వివరించారు కేసీఆర్. ఒకటి లింగ వివక్ష రెండోది కుల వివక్ష. లింగ వివక్ష వల్ల దేశ జనాభాలోని సగం జనాభా అయిన మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు కాలేకపోతున్నారని దీని వల్ల చాలా నష్టం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. దేశ జనాభాలో 20శాతం దళితులు కూడా కుల వివక్ష వల్ల దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోలేకపోతున్నారన్నారు. మహిళా శక్తి, దళిత శక్తి నిర్వీర్యం కావడ్డ వల్ల అభివృద్ధి జరగట్లేదని వివరించారు. 

పేదరికం పేరుతో అగ్రవర్ణాలని చెప్పుకునే వారిలో కూడా ఎందరో అవకాశాలను కోల్పోతున్నారని పేర్కొన్నారు కేసీఆర్. ఇవన్నీ మారకుండా దేశంలో సమూల మార్పు జరగదన్నారు. స్థూలమైన విషయాల్లో మౌలికమైన మార్పు రాకుండా సమాజిక పరిస్థితుల్లో మార్పు రావడం సాధ్యం కాదని తెలిపారు. ఏ దేశాలైతే ఏ సమూహాలైతే.. తాము నిత్యం అనుసరిస్తున్న సాధారణ పని విధానం నుంచి బయటపడతాయో.., ఆ సమాజాన్ని వినూత్న పంథాలో నడిపిస్తాయో, అటువంటి దేశాలే గుణాత్మకంగా మారినాయన్నారు. మార్పు కోరుకోని సమాజాలు మారలేదు. ఆ దిశగా ప్రజలను చైతన్యపరిచిన సమాజాలే ఫలితాలు సాధించాయని తెలిపారు. 
 
1980 వరకు చైనా జిడిపి భారత్‌ కంటే తక్కువగా ఉండేదని... 16 ట్రిలియన్ డాలర్ల ఎకనామితో చైనా నేడు ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని గుర్తు చేశారు కేసీఆర్. సౌత్ కొరియా, జపాన్, మలేసియా వంటి దేశాల్లో అద్భుతాలు జరిగాయన్నారు. దళిత బంధు అనేది ప్రత్యేకంగా దళిత జనోద్దరణ కోసం అమలు చేస్తున్న కార్యక్రమమని వివరించారు. సమాజంలోని ఇతరులకు అందే అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలు దళితులకు కూడా అందుతున్నాయన్నారు. వాటితో పాటు దళిత బంధు పథకం వారికి అధికమన్నారు. ఇది వారి అభివృద్ధి కోసమే అమలు చేస్తున్న ప్రత్యేక పథకమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 8 లక్షల 40 వేల కుటుంబాలకు దళిత బంధు, రైతుబంధు , రెండు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని వివరించారు. ఇదే విషయాన్ని, ఇక్కడకు వచ్చిన ప్రముఖ దళిత నాయకులు ఎంపీ తిరువలన్‌కు చెప్తే ఆయన ఆశ్చర్యానికి గురయ్యారన్నారు. రాష్ట్రంలో  17 లక్షల 50 వేల దళిత కుటుంబాలున్నాయని వారందరికీ దశల వారీగా దళిత బంధును అందిస్తూ బాగుచేసుకుంటూ ముందుకు సాగుతామని ప్రకటించారు. 

తెలంగాణలో అమలవుతున్న ఇటువంటి ఆవిష్కరణలు దేశ స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే అమలు చేసి వుంటే బాగుండేదన్నారు కేసీఆర్. అవుటాఫ్ బాక్స్ నుంచి ఆలోచన చేసి వినూత్న కార్యక్రమాలను ఆవిష్కరించాం కాబట్టే తెలంగాణలో ఇంతటి అభివృద్ధి సాధ్యమైందన్నారు. దేశంలో నిర్లక్ష్యానికి గురైన మరో రంగం వ్యవసాయ రంగమని.... దేశంలోని రైతులు తమ హక్కుల సాధన కోసం 13 నెల్ల కాలం పాటు రోడ్ల మీద ధర్నాలు చేసే పరిస్థితి తలెత్తడం దారుణమన్నారు. అందుకే భారత దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే  జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నామని ప్రకటించారు. దేశ ప్రజల సమస్యలనే ఎజెండాగా చేసుకుని జాతీయ పార్టీ జండా పట్టుకొని పోతున్నామన్నారు. 

మనం తలపెట్టిన చారిత్రక కార్యక్రమానికి యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ వస్తామన్నారన్నారు. కానీ వారి వారి పరిస్థితులను అర్థం చేసుకుని నీనే వద్దన్నట్టు వివరించారు కేసీఆర్. ఇది కేవలం పార్టీ పేరు మార్పిడి కోసం జరిగే అంతర్గత సమావేశం మాత్రమేనన్నారు. తర్వాత జరిగే లాంచింగ్ కార్య్రమానికి పిలుచుకుంటానని చెప్పినట్టు తెలిపారు. మనతో కలిసి ముందుకు సాగడానికి దేశవ్యాప్తంగా అనేక పార్టీల నేతలు ముందుకు వస్తున్నారని వివరించారు. 

తెలంగాణ ఉద్యమానికి మాజీ భారత ప్రధాని దేవగౌడ గట్టి మద్దతుఇచ్చారని గుర్తు చేశారు కేసీఆర్. ఇటీవల తాను కలిసి చర్చించినప్పుడు తమ జెడిఎస్ సంపూర్ణ మద్దతుంటుందని స్పష్టం చేసినట్టు వివరించారు. ఇప్పటికే పలువురు ఆర్థిక శాస్త్రవేత్తలు, పలు రంగాల నిపుణలతో అనేక చర్చలు చేసినామన్నారు. జాతీయ పార్టీ ఏర్పాటులో వారి సలహాలు తీసుకున్నట్టు తెలిపారు. వనరులు ఉండి కూడా సద్వినియోగం చేసుకోలేక దేశ ప్రజలు వంచనకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్‌. ఇది శోచనీయమన్నారు. ఈ పద్దతి మారాలని ఆకాంక్షించారు. మనమే మార్చాలే అన్నారు. తెలంగాణను ఎట్లయితే బాగు చేసుకున్నామో... దేశాన్ని కూడా బాగుచేసుకోవాలె అని ప్రతిన తీసుకున్నారు. 

ఈ దేశంలో సారవంతమైన వ్యవసాయ యోగ్యమైన సాగు భూమి ఉందని... పుష్కలంగా నీరు కూడా ఉందన్నారు కేసీఆర్. కష్టపడి పనిచేసే ప్రజలున్నారని తెలిపారు. ఇన్నీ ఉన్న తర్వాత దేశం ప్రపంచానికే అన్నం పెట్టాలే అని ఆకాంక్షించారు. పలు రకాలనై పంటలను పండించి ప్రపంచానికి అవసరమైన ఆహార ఉత్పత్తులు అందించాలన్నారు. అది వదిలి మనమే పిజ్జాలు బర్గర్లు తినడం అంటే అవమానకరమని అభిప్రాయపడ్డారు.  

ఛాలెంజ్‌గా తీసుకుని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇచ్చినట్టు భారత దేశమంతా ఇవ్వలేమా? అని ప్రశ్నించారు కేసీఆర్. అదే కమిట్మెంట్‌తో దేశవ్యాప్తంగా ఇంటింటికి నల్లా నీళ్లు అందివ్వగలమని అభిప్రాయపడ్డారు. ఇందుకు చైనాతో పాకిస్తాన్‌తోనో అమెరికాతోనో యుద్దం చేయాల్సిన అవసరం లేదన్నారు. కేవలం చిత్తశుద్ది ఉంటే చాలన్నారు. 

ఈ సమావేశంలో కూర్చున్న వాళ్లంతా తెలంగాణ సాధించిన యోధులని... అదే స్పూర్తితో దేశ సేవ చేయడానికి సిద్దంగా ఉన్నారన్నారు. తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశమంతా పర్యటిస్తానన్నారు. కార్యక్షేత్రం వదలబోమన్నారు. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కరలేదని తెలిపారు. ఉజ్వల భారతం తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్. మొట్టమొదటి కార్యక్షేత్రంగా మహారాష్ట్ర ఎంచుకుంటామన్నారు కేసీఆర్. జాతీయ పార్టీకి అనుబంధ రైతు సంఘాన్ని మహారాష్ట్ర నుంచే ప్రారంభిస్తామన్నారు. 

తెలంగాణ వల్ల దేశానికి మంచి జరిగితే అది దేశ చరిత్రలో స్థిర స్థాయిలో నిలిచిపోతుందన్నారు కేసీఆర్. దళిత ఉద్యమం, రైతు ఉద్యమం, గిరిజన ఉద్యమం ద్వారా వీటిని ప్రధాన ఎజెండాగా తీసుకొని ముందుకు సాగుతామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక సామాజిక రాజకీయ రుగ్మతలు తొలగిస్తామని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ఆచరించి దేశానికి చూపించిందని... తలెత్తున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరాలకు తీసుకపోయినట్టుగానే, దేశాన్ని ముందుకు తీసుకపోవాలె అని అభిప్రాయపడ్డారు. 

తెలంగాణలో ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేసి సాధించినామన్నారు కేసీఆర్. పల్లెలు పట్టణాలను అభివృద్ధి పరుచుకున్నామని వివరించారు. కేంద్రం ప్రకటించిన అవార్డులే అందుకు సాక్ష్యమని పేర్కొన్నారు. ఒక అద్భుతమైన తాత్విక పునాదితో ముందుకు సాగుతామన్నారు. దేశవ్యాప్తంగా సాగే క్రమంలో అందరి సహకారం అవసరమన్నారు కేసీఆర్. తెలంగాణ ప్రజలను గెలిపించినమో..అదే పద్దతిలో దేశ ప్రజలను కూడా లక్ష్య సాధనలో గెలిపిస్తామన్నారు సిఎం కెసిఆర్. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
South Costal Politics: వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
Rajamouli On SSMB29: మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Shraddha Kapoor Pizza Paparazzi: పింక్ విల్లా స్క్రీన్ అండ్ స్టయిల్ అవార్డుల్లో ఆసక్తికర ఘటనAnupama Parameswaran Tillu Square Song Launch: అనుపమ మాట్లాడుతుంటే ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదు..!Keeravani Oscars RRR : అవార్డు అందుకోవడానికి కీరవాణి ఎలా ప్రిపేర్ అయ్యారో తెలుసా..?Nuvvalarevu Weird Marriage: నువ్వలరేవు... రెండేళ్లకోసారి మాత్రమే పెళ్లిళ్లు చేసే వింత గ్రామం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
South Costal Politics: వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
Rajamouli On SSMB29: మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
Family Star OTT: 'దిల్' రాజు సేఫ్ - ఫ్యామిలీ స్టార్ ఓటీటీ డీల్ క్లోజ్, థియేట్రికల్ బ్యాలన్స్ అంతే!
'దిల్' రాజు సేఫ్ - ఫ్యామిలీ స్టార్ ఓటీటీ డీల్ క్లోజ్, థియేట్రికల్ బ్యాలన్స్ అంతే!
RS Praveen Kumar: బీఆర్ఎస్‌లోకి RS ప్రవీణ్, కండువా కప్పిన కేసీఆర్, 80 మంది బీఎస్పీ నేతలు కూడా
బీఆర్ఎస్‌లోకి RS ప్రవీణ్, కండువా కప్పిన కేసీఆర్, 80 మంది బీఎస్పీ నేతలు కూడా
Rajamouli Emotional Post: RRR రీ రిలీజ్, జపాన్‌లో రాజమౌళికి ఘన స్వాగతం - ఈ 83 ఏళ్ల బామ్మ చేసిన పనికి జక్కన్న ఫిదా
RRR రీ రిలీజ్, జపాన్‌లో రాజమౌళికి ఘన స్వాగతం - ఈ 83 ఏళ్ల బామ్మ చేసిన పనికి జక్కన్న ఫిదా
Mohan Babu Birthday: 'కలెక్షన్‌ కింగ్‌' మోహన్‌ బాబు బర్త్‌డే - ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలెన్నో తెలుసా?
'కలెక్షన్‌ కింగ్‌' మోహన్‌ బాబు బర్త్‌డే - ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలెన్నో తెలుసా?
Embed widget