By: ABP Desam | Updated at : 19 Jan 2023 06:08 PM (IST)
సికింద్రాబాద్లో ఘోర అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట డెక్కన్ స్టోర్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి రావడానికి మరికొన్ని గంటలు పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 20కిపైగా ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటికైతే వెనుక భాగంలో మంటలు దాదాపు అదుపులోకి వచ్చాయి. ముందు భాగంలో మాత్రం అగ్ని కీలలు ఎగసి పడుతున్నారు.
ఎగసి పడుతున్న అగ్ని కీలలు చూసిన జనం భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దాదాపు కిలోమీటర్ పరిధిలోని షాపులన్నింటినీ క్లోజ్ చేశారు. ప్రమాదం జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల్లో జనాలను ఖాళీ చేయించారు. ఎలాంటి ప్రమాదం జరిగినా ఎదుర్కొవడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో వ్యాపించిన పొగ కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కి కూడా ఇబ్బందిగా మారింది.
ఉదయం పది గంటల ప్రాంతంలో మొదలైన మంటలు కాసేపటి వరకు పెరుగుతూనే ఉన్నాయి. పక్కన ఉన్న రెసిడెన్సియల్ భవనాలకు కూడా మంటలు వ్యాపించాయి. ఇది మరింత ప్రమాదకరంగా మారుతుందన్న టైంలో అధికారులు తీవ్రంగా శ్రమించి ప్రమాద తీవ్రతను చాలా వరకు తగ్గించారు.
భవనానికి మూడు వైపుల మంటలు వ్యాపించాయి. పొగ విపరీతంగా వస్తోంది. దీని వల్ల అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. అసలు రెస్క్యూ ఆపరేషన్ ఎంత వరకు వచ్చిందో అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ పొగ, మంటలు కారణంగా చుట్టుపక్కల ఉండే ప్రజల్లో చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. వాళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ముందు జాగ్రత్తగా స్థానికంగా ఉండే ప్రజలను ఖాళీ చేయించారు. విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపేశారు. నెట్ సేవలను బంద్ చేశారు. ఆ ప్రాంతమొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరూ రాకుండా చర్యలు తీసుకున్నారు. సంఘటనా స్థలంలోనే అంబులెన్స్ సర్వీసులు ఉంచారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
మంటల ధాటికి భవనం చాలా వరకు దెబ్బతిన్నట్టు అధికారులు భావిస్తున్నారు. గోడలకు పగుళ్లు ఉన్నట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ భవనం ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని అంచా వేస్తున్నారు. అందుకే అటువైపు ఎవరూ వెళ్లకుండా గట్టి చర్యలు చేపట్టారు.
CM KCR Nanded Tour: నాందేడ్ లో ఆదివారం బీఆర్ఎస్ సభ, సీఎం కేసీఆర్ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇలా
TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
Hyderabad News : కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్, అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారని రమ్య రావు ఆరోపణ!
Panjagutta Police Video : గస్తీ గాలికి వదిలేసి మందు కొడుతున్న పంజాగుట్ట పోలీసులు, వీడియో వైరల్
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?
Mekapati Ananya Reddy : నాన్న ఆశయాలు నెరవేరుస్తా, పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ రెడ్డి కుమార్తె క్లారిటీ