Rakhi Avenues Private Ltd: 'ఇచ్చిన మాట ప్రకారమే ప్రాజెక్టును పూర్తి చేస్తాం' - రాకీ అవెన్యూస్ వివాదంపై ఎండీ కీలక ప్రకటన
Andhra News: రాకీ ఎవెన్యూస్ వివాదంపై ఎండీ రామయ్య వేణు స్పందించారు. ఇచ్చిన మాట ప్రకారమే అందరికీ త్వరలో నిర్మాణాలు పూర్తి చేస్తామని ఎవరూ వదంతులు నమ్మొద్దని స్పష్టం చేశారు.
Rakhi Avenues Private Limited MD Explanation: రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ (Rakhi Avenues Private Limited) వివాదంపై ఎండీ రామయ్య వేణు (Ramayya Venu) వివరణ ఇచ్చారు. కస్టమర్లకు ఇచ్చిన మాట ప్రకారం ఇళ్లను పూర్తి చేసి ఇచ్చే బాధ్యత తమదేనని.. ఇందులో ఎవరికీ సంబంధం లేదని చెప్పారు. 'నేను ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశాను. కొద్ది రోజులు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాను. చంద్రిక, అవంతిక అనే ప్రాజెక్టు గురించి తప్పుడు ప్రచారం సాగుతోంది. అది నిజం కాదు. అది నా సొంత ప్రాపర్టీ. ఇప్పటికే రూ.15 కోట్ల పెట్టుబడి పెట్టాను. ఇచ్చిన హామీ మేరకు నిర్మాణాలు చేసి ఇచ్చే బాధ్యత పూర్తిగా సంస్థదే. 31 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. 10 - 15 రోజుల్లో మళ్లీ కన్‌స్ట్రక్షన్ మొదలుపెడతాం. 2016 - 17లో సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న యాంకర్ సుమకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరికీ ఇచ్చిన మాట ప్రకారం నిర్మాణాలు చేపడతాం. తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు.' అని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ జరిగింది
కాగా, రాజమండ్రిలోని రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మధ్య తరగతి కుటుంబాలకు రూ.26 లక్షలకే సొంతిల్లు కట్టిస్తామని చెప్పి అందరి దగ్గర కలిపి రూ.88 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ సంస్థ బోర్డు తిప్పేసిందంటూ ప్రచారం సాగింది. దీంతో డబ్బులు కట్టిన వారంతా రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని అప్పట్లో పోలీసులను ఆశ్రయించారు. ఈ సంస్థకు ప్రముఖ యాంకర్ సుమ ప్రచారం చేయడం వల్లే ఇది మంచి సంస్థ అని కొన్నామని చెప్పారు. ఈ క్రమంలో అప్పట్లో వివాదం నెలకొంది. దీనిపై తాజాగా స్పందించిన సంస్థ ఎండీ రామయ్య వేణు పూర్తిస్థాయి వివరణ ఇచ్చారు. కస్టమర్లందరికీ నిర్మాణాలు చేపడతామని.. వదంతులు నమ్మొద్దని తెలిపారు.
Also Read: Chittor News: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం - పెళ్లైన 5 రోజులకే నవ వరుడు మృతి