అన్వేషించండి

GHMC News: కాలనీలో చెత్త వేస్తే సైరన్ మోగుతుంది! హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కొత్త టెక్నాలజీ అమలు!

Hyderabad: చెత్త సమస్యకు హైదరాబాద్‌ కొత్త పరిష్కారం చూసింది. ఇకపై కాలనీల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే మాత్రం సైరన్ మోగేలా టెక్నాలజీని అప్‌డేట్ చేసింది.

GHMC News: హైదరాబాద్‌లో ఎక్కడి పడితే అక్కడ చెత్త వేసే సంస్కృతిని శాశ్వతంగా పరిష్కారించే దిశగా జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పడికే ప్రతి ఇంటికి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ప్రకారం చెత్త సేకరణ జరుగుతోందో లేదో అన్న ట్రాకింగ్ చేయనుంది. దీంతోపాటు కాలనీల్లో ఎక్కడైనా అనవసరంగా చెత్త వేస్తే మాత్రం సైరన్ మోగేలా కొత్త విధానం తీసుకురానున్నారు. 

ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆయా వెల్ఫేర్ కమిటీలతో మాట్లాడుతున్నారు. అన్ని కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు అయిన తర్వాత దాన్ని కొత్త టెక్నాలజీకి అనుసంధానిస్తారు. లిట్టర్ కంట్రోల్ కాషన్ కెమెరాలు , ఆ పక్కనే మైక్ ఏర్పాటు చేయనున్నారు. దాని వల్ల ఎక్కడైనా అనుమతి లేని ప్రాంతాల్లో చెత్త వేస్తే సైరన్ మోగనుంది. ప్రస్తుతం ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఈ కొత్త టెక్నాలజీ అమలు చేస్తున్నారు. దశల వారీగా అన్ని ప్రాంతాల్లో అమలు పరిచేలా చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. 

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అధికారులు గుర్తు చేస్తున్నారు. దాన్ని మర్చిపోయి కొందరు ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారని ఇలాంటి వారికి చెక్ పెట్టి నగరాన్ని గార్బేజ్‌ నుంచి శాశ్వత పరిష్కారించేలా టెక్నాలజీ పని చేస్తుందంటున్నారు అధికారులు. ఈ వివరాలను జీహెచ్ఎంసీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పంచుకుంచింది. 

గతంలో హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో చెత్త డబ్బాలు ఉండేవి. అయితే ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నప్పుడు వాటితో పనేంటి అని వాటిని అధికారులు తొలగించారు. వాటినితొలగించినప్పటికీ చాలా మంది ఆ ప్రాంతంలో చెత్త పడేస్తుంటారు. ఎక్కడ వేయాలో తెలియదని గతంలో ఇక్కడ చెత్త డబ్బా ఉండేదని దాన్ని అధికారులు తీసేశారని చెబుతుంటారు. దీని వల్ల కొన్ని ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోంది. అందుకే దీని పరిష్కారానికి అధికారులు సాంకేతికతను నమ్ముకున్నారు. ప్రస్తుతానికి ఒకట్రెండు ప్రాంతాల్లో అమలు అవుతున్న ఈ వ్యవస్థ విజయవంతంగా అమలు అయితే నగరమంతా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget