Minister KTR: మైక్రోచిప్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ
Minister KTR: మైక్రోచిప్ టెక్నాలజీ సెంటర్ ను మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో ప్రారంభించారు. ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Minister KTR: మైక్రోచిప్ టెక్నాలజీ సెంటర్ ను మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లోని కోకాపేట్ లో ప్రారంభించారు. నాస్కామ్ ప్రకారం గత రెండేళ్లలో టెక్నాలజీ రంగంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్ లోనే సృష్టించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించామని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. దేశానికి లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఉందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపల్ హైదరాబాద్‌లో ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ తన వర్క్ ఫోర్స్ ను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సెమీ కండక్ర్ రంగంలో భారత్ ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతోందన్న మంత్రి కేటీఆర్.. వచ్చే దశాబ్దంలో ఆ రంగంలో భారత్ దూసుకెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
IT and Industries Minister @KTRBRS inaugurated @MicrochipTech India design and development centre at Kokapet, Hyderabad.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 3, 2023
Microchip Technology Incorporated, Headquartered in Chandler, Arizona, is a leading provider of smart, connected and secure embedded control solutions. The… pic.twitter.com/J0JkYzP2JX
IT and Industries Minister @KTRBRS speaking after inaugurating @MicrochipTech design and development center in Hyderabad. https://t.co/jbYkcyWBW6
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 3, 2023
ఆ ప్రక్రియలో హైదరాబాద్ నగరం కీలక పాత్ర పోషించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం వెయ్యి మందికి సొంత ఖర్చులతో శిక్షణ ఇస్తుందన్నారు. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ స్కిలింగ్ రంగంలో కూడా తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతుందన్నారు. అమెరికాలోని ఆరిజనోనా రాష్ట్రంలో చాండ్లర్ లో మైక్రోచిప్ టెక్నాలజీ కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంది. స్మార్ట్, కనెక్టెడ్, సెక్యూర్ ఎంబెడ్ కంట్రోల్ సొల్యూషన్స్ కంపెనీ కల్పిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటోమేటివ్, ఏరోస్పేస్, డిఫెన్స్, కంప్యూటింగ్ మార్కెట్లకు చెందిన లక్షా 25వేల మంది కస్టమర్లకు ఆ కంపెనీ సేవల్ని అందిస్తోంది. ఈ క్రంలోనే మైక్రోచిప్ సంస్థ అధినేతలకు మంత్రి కేటీఆర్ శుక్షాకాంక్షలు చెప్పారు. మైక్రోచిప్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
Speaking after the inauguration, the Industries Minister emphasized the need for a strong workforce to establish India's presence in the semiconductor industry, acknowledging that the country is currently in its early stages compared to leading semiconductor ecosystems. The… pic.twitter.com/5ww4o4Lgp0
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 3, 2023