Uber shock : 7 కిలోమీటర్లకు రూ.3 వేలకుపైగా ఉబెర్ బిల్లు - హైదరాబాద్‌లో మోతెక్కుతున్న క్యాబ్ ధరలు!
Hyderabad Rains : ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల దూరానికి క్యాబ్ ఖర్చు ఎంతవుతుంది ? మామూలుగా అయితే వంద పీక్ అవర్స్‌లో అయితే రెండు వందలు అవ్వొచ్చు. కానీ మూడు వేలు అయితే ?
Hyderabad Cab fares : రాజ్ ఆకుల అనే వ్యక్తి పని మీద ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన కార్యాలయానికి వెళ్లాలనుకున్నాడు. వర్షం పడుతున్నందున క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఆయన క్యాబ్ ఎక్కినప్పుడు ఫేర్ రీజనబుల్ గానే ఉంది. కానీ గమ్యానికి చేరుకునేసరికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. బిల్లు రూ. 3100 చూపించింది. కట్టక తప్పదు కాబట్టి కట్టేశారు.
వర్షం పడితే ట్రాఫిక్ జామ్‌తో పెరిగిపోతున్న క్యాప్ ఫేర్స్
రాజ్ ఆకుల ప్రయాణిస్తున్నప్పుడు వర్షం పడింది. ట్రాఫిక్ జామ్ అయింంది. ఈ కారణంగా బాగా ఆలస్యం అయింది. అయితే అంత మాత్రాన... ఒక్క సారే .. వందల నుంచి వేలకు బిల్లు తీసుకెళ్తారా అని ఆశ్చర్యపోయారు. కస్టమర్ కేర్‌ను సంప్రదిస్తే.. బిల్లింగ్‌లో ఎలాంటి పొరపాటు లేదని.. అది సరైన చార్జీనేనని స్పష్టం చేశారు. దీంతో ఇది కార్పొరేట్ లూఠీ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఉబెర్‌కు.. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖకూ ట్యాగ్ చేశారు.
My Uber fare for below ride distance of 5-7 KM is Rs. 3,100. What is this @Uber @MORTHIndia Pls look into this corporate loot. #HyderabadRains @sayesekhar @CoreenaSuares2
— Raja akula (@akularaja16) August 19, 2024
Traffic management failure in #Hyderabad? @HYDTP are you hearing us? No traffic personnel are on the road pic.twitter.com/2pg7Qlln1C
తమకూ అదే అనుభవం ఎదురైందంటున్న నెటిజన్లు
రాజ్ ఆకుల ట్వీట్ కింద క్యాబులతో తాము పడిన బాధల్ని ఇతరులు పంచుకోవడం ప్రారంభించారు. క్యాబుల్ని తరచూ బుక్ చేసుకునేవారందరికీ ఇలాంటి అనుభవాలు ఉన్నాయని ఆ ట్వీట్ల రిప్లయ్‌లను చూస్తే అర్థమవుతుంది.
Yesterday even I faced the same situation the actual charge was 520 but at the end of trip it shows 1050. Reached out to the support and sorted out
— Dharmendra (@dharkusu) August 20, 2024
హైదరాబాద్‌లో వానలే వానలు
గత వారం రోజులుగా రోజూ ఉదయం పూట ఎం.. మధ్యాహ్నం నుంచి వర్షం దంచి కొడుతోంది. ఆ వర్షాలుమామూలువి కావు. రోడ్లు బ్లాక్ అయిపోతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ జామ్ అయిపోయి వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోతున్నాయి. గంటల తరబి ముందుకు కదలడం లేదు. ఈ ట్రాఫిక్‌లో క్యాబ్ ఇరుక్కుపోతే.. డ్రైవర్లు దిలాసాగానే ఉంటున్నారు. కానీ ప్యాసింజర్లకు మాత్రం గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కొన్ని ఏరియాల్లో క్యాబుల్లో వెళ్తున్న వారి జేబుకు చిల్లులు పడుతున్నాయి.