Hayathnagar Murder Case: హయత్‌నగర్ రాజేశ్, సుజాత మృతి కేసులో వీడిన మిస్టరీ, ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు
Hayathnagar Murder Case: హయత్ నగర్ రాజేశ్, సుజాత మృతి కేసును పోలీసులు చేధించారు. ఇద్దరివి ఆత్మహత్యగా తేల్చారు.
Hayathnagar Murder Case: సంచలనం రేపిన హయత్ నగర్ రాజేశ్ మృతి కేసును పోలీసులు చేధించారు. రాజేశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు. రాజేశ్, ప్రభుత్వ టీచర్ సుజాత ఇద్దరివి ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు. ఈ మేరకు రాచకొండ సీపీ చౌహన్ గురువారం మీడియా ముందు వివరాలు వెల్లడించారు. తొలుత సుజాత టీచర్ ఆత్మహత్యాయత్నం చేసుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని, ఆ తర్వాత రాజేశ్ సూసైడ్ చేసుకున్నాడని సీపీ చౌహన్ తెలిపారు. రాజేశ్, సుజాతకు మధ్య ఉన్న వివాహేతర సంబంధం వల్లే ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడినట్లు తేల్చారు.
'రాజేశ్ కు ఆరు నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా గవర్నమెంట్ టీచర్ సుజాతతో పరిచయం ఏర్పడింది. సోషల్ మీడియాలో సుజాత ఫోటోలు చూసిన రాజేశ్ ఆమెకు పెళ్లి కాలేదని భావించాడు. తనతో చనువుగా మెలిగాడు. సుజాత కూడా తనతో అలాగే ఉంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. సుజాతకు ముందే పెళ్లైందన్న విషయం తెలియని రాజేశ్.. తనను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కొంతకాలంగా ఇద్దరూ తరచూ కలుసుకుంటుండే వారు. రాజేష్ ప్రతి రోజూ సుజాత ఇంటి చుట్టూ తిరిగేవాడు. సుజాత తన పర్సనల్ ఫోటోలను రాజేశ్ కు పంపించేది. అయితే సుజాత సంబంధం గురించి ఆమె కుమారుడు జయచంద్రకు తెలిసింది. జయచంద్ర రాజేష్ ను కొట్టాడు. కానీ అతనికి మృతికి ఈ గాయాలు కారణం కాదు. రాజేష్ పోస్టు మార్టం రిపోర్టులో ఎలాంటి గాయాలు లేవు. ఈ క్రమంలో సుజాత, రాజేష్ ఇద్దరూ ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నారు. మే 24న సుజాత మొదట పురుగుల మందు తాగింది. తన తల్లి చావు బతుకుల మధ్య ఉందని సుజాత కొడుకు జయచంద్ర రాజేష్ కు చెప్పాడు. అదే రోజు రాజేశ్ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఈ కేసును చేధించా'మని రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ తెలిపారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
Also Read: Hyderabad News: బొల్లారం అరబిందో కంపెనీలో లీకైన గ్యాస్ - ముగ్గురికి తీవ్ర అస్వస్థత
మూడ్రోజుల క్రితం కుళ్లిన స్థితిలో రాజేష్ మృతదేహం
హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేటలో రాజేష్ మృతదేహం అనుమానాస్పద రీతిలో కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. మే 29 స్థానికుల ద్వారా ఈ శవాన్ని గుర్తించారు. అప్పటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఓ వివాహేతర సంబంధమే కారణమని భావించారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం వల్ల, ఆ ఉపాధ్యాయురాలి భర్త నాగేశ్వరరావు రాజేశ్‌ను హత్య చేసినట్లుగా మొదట అనుమానించారు. ఈ టీచర్ కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. టీచర్ భర్తతో పాటు మరికొంతమంది బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే, రాజేశ్ హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని టీచర్ భర్త నాగేశ్వరరావు వివరణ ఇచ్చాడు. తనకు అతనితో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కానీ, తన భార్యను ఎవరో బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టిన విషయం తెలుసని అన్నారు. తన భార్యకు రాజేశ్‌తో సోషల్ మీడియాలో పరిచయం జరిగి ఉండొచ్చని చెప్పాడు. వాళ్లిద్దరికీ వయసులోనూ చాలా తేడా ఉందని అన్నారు. తన భార్య ఆత్మహత్య విషయంపై కూడా పోలీసులు విచారణ జరిపి నిజానిజాలు రాబట్టాలని నాగేశ్వరరావు కోరారు.