News
News
వీడియోలు ఆటలు
X

PM Modi Hyderabad Visit: ప్రధాని మోదీ టూర్‌పై వామపక్షాలు ఆగ్రహం- విభజన హామీల సంగతి ఏంటని ప్రశ్న

PM Modi Hyderabad Visit: రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రానికి వచ్చే అర్హత లేదంటూ సీపీఎం, సీపీఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. ప్లకార్డులు చేతపట్టుకొని నిరసన చేపట్టారు.

FOLLOW US: 
Share:

PM Modi Hyderabad Visit:   రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రానికి వచ్చే అర్హత లేదని సీపీఎం, సీపీఐ నాయకులు అన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్ రైతు బజారు దగ్గర.. మోడీ హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ సీపీఎం, సీపీఐ కుత్బుల్లాపూర్ మండల కమిటీల ఆధ్వర్యంలో " మోడీ గో బ్యాక్" అని నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి బొగ్గు గనులకు టెండర్లు పిలిచిన నరేంద్ర మోడీకి తెలంగాణలో అడుగు పెట్టే నైతిక హక్కు లేదని విమర్శించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, వందే భారత్ రైలు ప్రారంభానికి వచ్చిన మోదీ పర్యటనను వ్యతిరేకిస్తున్నామన్నారు. విభజన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, గిరిజన విశ్వవిద్యాలయం లాంటి రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణకు ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. త్వరగా మీరు హైదరాబాద్ నుంచి వెళ్లిపోండంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

ప్రధాని మోడీ హిట్లర్ పాలన కొనసాగిస్తున్నారు..!

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో వివిధ రంగాల్లో అనేక అన్యాయాలు జరుగుతున్నాయన్నారు. అలాగే దేశ సమైక్యత, సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదాలను ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రమాదకర ఫాసిస్టు నిరంకుశ హిట్లర్ పాలన  కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం వల్ల తెలంగాణకు ఎలాంటి మేలూ జరగలేదని చెప్పారు. లాభం ఏమో కాని నష్టాలు వాటిల్లుతున్నాయని అన్నారు. రాజ్యాంగానికి దేశ సమైక్య, సమగ్రతలకు, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థల విధ్వంసానికి బీజేపీ ప్రభుత్వం తలపెడుతుందన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమత్వం విధ్వంసానికి మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని దుయ్యబట్టారు. దేశంలో లాభాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఉక్కు, బొగ్గు, రైల్వే, విమానయానం, ఆయిల్ కంపెనీలు, నౌకాశ్రయాలు ఆఖరికి రక్షణ రంగంతో సహా అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేసేలా చట్టాలు అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర ప్రజలంతా మోడీ హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకించాలి..!

మోసపూరిత కార్పొరేట్ సంస్థలకు దేశాన్ని అమ్మివేస్తూ.. తిరిగి కార్పొరేట్లపై ఆధారపడి సార్వ భౌమత్వాన్ని కోల్పోయే విధంగా మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి, బొగ్గు బావుల ప్రైవేటీకరణ చేయడం మూలంగా కార్మికులు కొట్లాడి తెచ్చుకున్న హక్కులను నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కాల రాస్తుందని అన్నారు. ఈ తరుణంలోనే  మోడీ గో బ్యాక్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ నాయకులు సత్యం, అంజయ్య దేవదానం, మల్లారెడ్డి, సునీల్ సీపీఐ మండల నాయకులు రాములు, హరినాథ్, స్వామి శ్రీనివాస్, అశోక్ రెడ్డి, రాము పాల్గొన్నారు.

ఈ నిరసన సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులను ముందస్తు అరెస్టు చేశారు.    

Published at : 08 Apr 2023 02:29 PM (IST) Tags: Hyderabad CPI Telangana News CPM Modi Hyd Visit

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం, ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని ఇండియా, ఆసీస్‌ మధ్య ఫైట్

Top 10 Headlines Today: నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం, ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని ఇండియా, ఆసీస్‌ మధ్య ఫైట్

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గధాయుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గధాయుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!

Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

Hyderabad Lady Death: బెంగళూరులో హైదరాబాద్ యువతి మృతి, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్న పోలీసులు!

Hyderabad Lady Death: బెంగళూరులో హైదరాబాద్ యువతి మృతి, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్న పోలీసులు!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- హడలిపోయిన అధికారయంత్రాంగం!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- హడలిపోయిన అధికారయంత్రాంగం!

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?