Bandi Sanjay: సకినాల పిండి కన్నీళ్లతో కలుపుతున్నారు, సిగ్గులేకుండా మోదీకి లేఖ రాస్తావా? సీఎంకు బండి సంజయ్ లేఖ
బండి సంజయ్ గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా అందులో ప్రభుత్వ విధానాలను, వైఫల్యాలను ఎండగట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల కన్నీళ్లతో సకినాల పిండి తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. రైతుల విషయంలోనూ గతంలో ఎరువులను ఉచితంగా ఇస్తామంటూ 2017లో హామీ ఇచ్చిన కేసీఆర్.. ఐదేళ్లు దాటినా దాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. మాట తప్పినందుకు తెలంగాణ ప్రజలను క్షమాపణలు అడిగి తలదించుకోవాలని డిమాండ్ చేశారు. అలాంటి సీఎం సిగ్గు లేకుండా ఎరువుల ధరలపై ప్రధానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకముందు ఎరువుల కోసం రైతులు క్యూల్లో నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. బండి సంజయ్ గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా అందులో ప్రభుత్వ విధానాలను, వైఫల్యాలను ఎండగట్టారు.
సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాల్సిన రైతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలు రోదిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. రైతులకు ఉచితంగా ఎరువులు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రూ.లక్ష రుణమాఫీని ఉగాదిలోగా అమలు చేయాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. లేకుంటే మహా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కమ్) అప్పుల్లో ముంచిన కేసీఆర్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాజీనామాకు సిద్ధమా?
‘‘తెలంగాణలో గత మూడేళ్లలో ఒక్క రైతు పొలంలోని మోటారుకు మీటరు బిగించినట్లు నిరూపించగలరా? లేదంటే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా? ఎరువుల సబ్సిడీ పేరిట తెలంగాణ రాష్ట్రానికి ఏడేళ్లలో కేంద్రం వేల కోట్లు ఖర్చు చేసింది నిజం కాదా? మీరు చేసిందేంటి? అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరకుల కొరత వల్ల ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగినా వీటిని కేంద్రం పాత ధరలకే సరఫరా చేస్తోంది. 2014తో పోలిస్తే ప్రస్తుతం వరి, గోధుమలు సహా 23 రకాల పంటలకు ఇస్తున్న కనీస మద్దతు ధర 50-100 శాతం పెరిగింది. పొరుగు రాష్ట్రాలు రైతులకు బోనస్ పేరిట క్వింటాకు రూ.200-600 వరకు చెల్లిస్తుండగా.. తెలంగాణలో నయాపైసా ఇవ్వట్లేదు.’’
‘‘ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానించేందుకు కేంద్రం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క సిఫార్సూ ఎందుకు చేయలేదు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదు. కేంద్రం పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. 19 రాష్ట్రాలూ పన్నులు తగ్గించాయి. తెలంగాణలో మాత్రం పైసా కూడా తగ్గించలేదు. పంటలకు మద్దతు ధర ఎలా నిర్ణయిస్తారో తెలియని అజ్ఞాని సీఎం. రైతుబంధు ఒక్కటిచ్చి మిగతా సబ్సిడీలను ఎత్తేసింది నిజం కాదా? ఏడేళ్లుగా పంట బీమాను అమలు చేయలేదన్నారు. రైతుల పాలిట రాబందుగా మారిన కేసీఆర్ రైతు బంధునంటూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. నిజంగా రైతుబంధే అయితే అన్నదాతల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే 4వ స్థానంలో ఎందుకుంది?’’ అని బండి సంజయ్ లేఖ రాశారు.
Also Read: టీచర్లకు బదిలీలు తెచ్చిన కొత్త చిక్కు... వేర్వేరు జిల్లాలకు భార్యభర్తల బదిలీలు...
Also Read: రైతుల కోసం జైలుకెళ్లడానికైనా కేసీఆర్ సిద్ధమే .. కేంద్రానికి భయపడేది లేదన్న టీఆర్ఎస్
Also Read: సంక్రాంతికి ఊరెళ్లిపోతా మామ... ప్రయాణికులతో బస్టాండ్ లు, టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్