Hyderabad: సంక్రాంతికి ఊరెళ్లిపోతా మామ... ప్రయాణికులతో బస్టాండ్ లు, రైల్వేస్టేషన్లు కిటకిట... టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లే వారితో హైదరాబాద్ లోని ఆర్టీసీ బస్టాండ్ లు, రైల్వేస్టేషన్ కళకళలాడుతోంది. నగరవాసులు పల్లెలకు తరలిపోవడంతో హైదరాబాద్ బోసిపోతుంది.
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేవారితో హైదరాబాద్ లో ఆర్టీసీ బస్టాండ్ లు, రైల్వేస్టేషన్ కిక్కిరిసిపోయాయి. జేబీఎస్, ఎంజీబీఎస్, ఎల్బీనగర్ బస్టాండ్ లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.
సంక్రాంతికి పల్లెలకు పెద్దఎత్తున నగరవాసులు తరలిపోవడంతో హైదరాబాద్ బోసిపోయింది. సాధారణ రోజుల్లో జనాల రద్దీతో కళకళలాడే హైదరాబాద్ సంక్రాంతి సమయంలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తాయి. హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్లే వారితో హైదరాబాద్ - విజయవాడ హైవే కార్లతో కిక్కిరిసిపోయింది.
Also Read: తిరుమలలో వైభవంగా స్వర్ణరథోత్సవం... ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు... రేపు పుష్కరిణలో చక్రస్నానం
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కళకళలాడుతోంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎవ్వరికీ ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు ఆర్టీసీ అధికారులు. ప్రయాణికులు ఎక్కువగా ఏ ప్రాంతాలకు వెళ్తున్నారో తెలుసుకుని బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. బస్సు ఛార్జీలు పెంచకపోవడంతో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ, ట్రాఫిక్, పోలీస్ సిబ్బంది దగ్గరుండి ప్రయాణికులకు సూచనలు చేస్తున్నారు.
Also Read: వెల్కం ఆచార్య.. చిరుకు జగన్ సాదర స్వాగతం !
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీగా మారింది. సొంత ఊళ్లకి వెళ్లే వారితో పాటు, అయ్యప్ప స్వాములు కూడా శబరిమలకు వెళ్తుండడంతో రైల్వే స్టేషన్ కిటకిటలాడుతుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్పీఎఫ్, రైల్వే పోలీస్, స్పెషల్ టీంలు భద్రత పర్యవేక్షిస్తున్నాయి. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా, ప్రయాణికులను ఎప్పటికప్పుడు మైక్ ల ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. ప్రయాణికుల కోసం ప్రత్యేక కౌంటర్ ద్వారా వారు ఎక్కడికి వెళ్లాలో చెప్పడంతో పాటు తగు సూచనలు చేస్తున్నారు.
పండగకు ప్రత్యేక బస్సులు, రైళ్లు
పండగ రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీస్ లపై అదనంగా 50 ఛార్జీలు వసూలుచేస్తుంది. దీంతో టీఎస్ఆర్టీసీ బస్సులకు గిరాకీ పెరిగింది. టీఎస్ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెంచలేదు. అలాగే దక్షిణ మధ్య రైల్వే కూడా పండగ స్పెషల్ రైళ్లు నడుపుతోంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని జనవరి 5 నుంచి 25 వరకు మొత్తం 220 రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
కీసర టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. వాహనాలతో కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులుదీరాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చేవాళ్లతో రద్దీ బాగా పెరిగింది. దీంతో టోల్ ప్లాజా వద్ద ఆరు లైన్లు ఏర్పాటు ఏర్పాటుచేశారు. రాత్రికి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున పోలీసు బందోబస్తుపెంచారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు పట్టణ వాసులు రాకతో వాహనాల రద్దీ భారీగా పెరిగింది.
Also Read: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందడి.. శ్రీవారి సేవలో పెద్దఎత్తున ప్రముఖులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి