అన్వేషించండి

Indiramma Housing Scheme 2025 : ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకం - లబ్ధిదారుల జాబితాలో మీ పేరుందో, లేదో ఇలా చెక్ చేసుకోండి!

Indiramma Housing Scheme 2025 : ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. ఈ గ్యారంటీల్లో ఒకటైన పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎలా అప్లై చేయాలంటే..

Indiramma Housing Scheme 2025 : రాష్ట్రంలో నిరాశ్రయులైన పేదలందరి సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తీసుకొచ్చిన పథకమే ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకం (Indiramma Housing Scheme). ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒకటైన ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ప్రజలకు ఇల్లు, భూమి అందిస్తుంది. సొంత స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.22,000 కోట్ల బడ్జెట్‌తో మొత్తం 4.5 లక్షల ఇళ్లను నిర్మించేందుకు సిద్ధమైంది. దీని కోసం రాష్ట్ర అధికారులు 2025 జనవరి 16 - 25 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తూ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత మార్పులు జనవరి 26 నుంచి అమలు చేస్తున్నారు. ఇక ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే కొందరిని ఎంపిక చేసింది. ఈ జాబితాను సైతం ఆన్లైన్‌లో అందుబాటులో ఉంచింది. మరి ఈ జాబితాలో మీ పేరు కూడా ఉందో, లేదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ https://indirammaindlu.telangana.gov.in/ లోకి వెళ్లాలి. 
  • అనంతరం హోమ్ పేజీలోని చెక్ లిస్ట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. 
  • ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే కొత్త పేజీలో అడిగిన వివరాలను ఎంటర్‌ చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయాలి. 
  • ఇప్పుడు మీరు పథకానికి ఎంపికయ్యారో లేదో స్క్రీన్‌పై కనిపిస్తుంది. 

ఈ లిస్టులో మీ పేరు కనిపించకపోతే మరోసారి అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది. అయితే ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే, 

ఎలా అప్లై చేసుకోవాలంటే..?

  • ముందుగా అధికారిక వెబ్ సైట్ https://indirammaindlu.telangana.gov.in/ ను సందర్శించి, apply onlineపై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు స్క్రీన్‌పై కనిపించే అప్లికేషన్ ఫారమ్‌లో అడిగిన వివరాలను అందించి, అవసరమైన పత్రాలను జత చేయాలి.
  • ఆ తర్వాత రివ్యూ చేసి, సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.

యాప్‌లో ఎలా అప్లై చేయాలంటే.?

  • ఇందిరమ్మ ఇల్లు హౌసింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మొబైల్ యాప్ INDIRAMMA INDLU ను డౌన్లోడ్ చేసుకోవాలి.
  • యాప్ ఓపెన్ చేసి, అడిగిన ఆధారాలు (రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్..)ను నమోదు చేయాలి.
  • ఇప్పుడు మీరు అందించిన ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి, లాగిన్ అవ్వాలి,
  • తర్వాత apply now అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

ఇక్కడ అడిగిన అన్ని వివరాలను నమోదు చేసి, అవసరమైన పత్రాలను జత చేసి, సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.

కావల్సిన పత్రాలు

  •     ఆధార్ కార్డ్
  •     మొబైల్ నంబర్
  •     విద్యుత్ బిల్లు
  •     అడ్రస్ ప్రూఫ్
  •     పాన్ కార్డు
  •     రేషన్ కార్డు

హెల్ప్‌లైన్ నంబర్

ఫోన్ నంబర్:- 040-29390057

Also Read : Sircilla News: సొంతిల్లు లేక రాత్రంతా మృతదేహంతో అంబులెన్స్‌లోనే కుటుంబం.. వారి కన్నీళ్లకు స్పందించిన కలెక్టర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Mowgli Review : నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Mowgli Review : నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Bigg Boss Telugu Latest Promo : బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
T20 World Cup 2026: కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
Daily Puja Tips: పూజలో ఏ వస్తువులను మళ్ళీ మళ్లీ ఉపయోగించవచ్చు? ఏవి ఉపయోగించకూడదు?
పూజలో ఏ వస్తువులను మళ్ళీ మళ్లీ ఉపయోగించవచ్చు? ఏవి ఉపయోగించకూడదు?
Embed widget