News
News
X

TS New Mandals : తెలంగాణలో 13 కొత్త మండలాలు - ఎక్కడెక్కడంటే ?

తెలంగాణలో పదమూడు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏయే మండలాలంటే ?

FOLLOW US: 

TS New Mandals : తెలంగాణ ప్రభుత్వం పరిపాలానా సంస్కరణల్ని వేగంగా అమలు చేస్తోంది. అందులో భాగంగా కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. గతంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు అనేక మండలాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయి. వీటన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం తాజాగా  పదమూడు మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయంతీసుకుంది. 

ఇళ్ల నుంచి బయటకు రావొద్దు, ఆ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్ ఆదేశాలు

నారాయణ పేట జిల్లా, అదే రెవిన్యూ డివిజన్ పరిధిలో..గుండుమల్ , కొత్తపల్లెలను కొత్తగా మండలాలుగా ఏర్పాటు చేశారు. వీటిని మండల కేంద్రాలు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. అలాగే  వికారాబాద్ జిల్లాలోని, తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో.. దుడ్యాల్ ను మండలంగా ఏర్పాటు చేశారు.  మహబూబ్ నగర్ జిల్లాలో అదే రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్న కౌకుంట్ల కూడా  ఇక నుంచి మండల కేంద్రం.  నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిథిలో ఆలూర్  , డొంకేశ్వర్ లకను కూడా మండలాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Also Read: Heavy Rains In Telangana: ఎగువ రాష్ట్రంలో వర్షం వచ్చినా ఆ ఊరికి వణుకే, ఎందుకో తెలుసా ? 

నిజామాబాద్ జిల్లా, బోధన్ రెవిన్యూ డివిజన్ పరిథిలో సాలూర మండలం,   మహబూబాబాద్ జిల్లా  పరిథిలో సీరోల్ మండలం,  నల్లగొండ జిల్లా అదే రెవిన్యూ డివిజన్ పరిథిలో గట్టుప్పల్ ను కూడా మండల కేంద్రంగా ఏర్పాటు చేశారు.  ఈ మండలం... కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి ప్రాతినిధ్యం  వహిస్తున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఆ స్థానానికి ఆయన రాజీనామాచేసి  బీజేపీ నుంచి పోటీ చేయవచ్చన్న ప్రచారం  జరుగుతోంది.  అలాగే  సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ రెవిన్యూ డివిజన్ పరిధిలో నిజాం పేట్ కూడా ఇక నుంచి మండలంగా మారనుంది.  

Also Read: Heavy Floods: భారీ వరదలతో నిండుకుండల్లా మారిన జలాశయాలు, అప్రమత్తమైన అధికారులు!

కామారెడ్డి జిల్లాలోని, బాన్స్ వాడ రెవిన్యూ డివిజన్ పరిథిలో.. డోంగ్లి,  జగిత్యాల జిల్లా/జగిత్యాల రెవిన్యూ డివిజన్ పరిథిలో ఎండపల్లి ని కూడా మండలాలుగా మార్చారు.   జగిత్యాల జిల్లా, కోరుట్ల డివిజన్ పరిథిలో, భీమారం కూడాఇక మండల కేంద్రం.  నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్  ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ప్రకారం తక్షణం మండలాలు ఉనికిలోకి వస్తాయి. 
Published at : 23 Jul 2022 03:25 PM (IST) Tags: telangana Telangana Govt formation of mandals thirteen new mandals

సంబంధిత కథనాలు

Mancherial News :  ప్రేమించిన యువతి కోసం యువకుడి పోరాటం, లవర్ ఇంటి ముందు నిరసన

Mancherial News : ప్రేమించిన యువతి కోసం యువకుడి పోరాటం, లవర్ ఇంటి ముందు నిరసన

Batukamma Sarees : సెప్టెంబర్ 17 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ, ఈసారి కోటికి పైగా!

Batukamma Sarees : సెప్టెంబర్ 17 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ, ఈసారి కోటికి పైగా!

టీడీపీని వీడిన మరో సీనియర్ నేత - పార్టీలో అనుబంధం గుర్తు చేసుకుని కంటతడి !

టీడీపీని వీడిన మరో సీనియర్ నేత - పార్టీలో అనుబంధం గుర్తు చేసుకుని కంటతడి !

Telangana Power : తెలంగాణలో కరెంట్ కోతలు తప్పవా ? ప్రభుత్వం ఏం చేయబోతోంది ?

Telangana Power :  తెలంగాణలో కరెంట్ కోతలు తప్పవా ? ప్రభుత్వం ఏం చేయబోతోంది ?

రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్‌- కాలేజీలకు కీలక ఆదేశాలు

రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్‌- కాలేజీలకు కీలక ఆదేశాలు

టాప్ స్టోరీస్

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?