CM KCR on Rains: ఇళ్ల నుంచి బయటకు రావొద్దు, ఆ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్ ఆదేశాలు
Heavy rains in Telangana: పలు జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున అత్యవసరమైతే తప్ప, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, పొంగిపొర్లే వాగులు, వంకలు దాటకూడదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
Heavy rains in Adilabad: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు ఉన్నందున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరద ముంపు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణలోని పలు జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున అత్యవసరమైతే తప్ప, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, పొంగిపొర్లే వాగులు, వంకలు దాటకూడదని హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర ప్రాంతాల్లో సేవలందించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆదేశించించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో సేవలందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సెలవులు తీసుకోకుండా ఉద్యోగులు విధులు నిర్వహించాలన్నారు సీఎం కేసీఆర్.
హెలిప్యాడ్లను సిద్ధం చేయండి.. సీఎం కేసీఆర్ ఆదేశాలు
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు వరద ముంపు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ అప్రమత్తంగా ఉండేలా సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కడెం, భైంసా ఉట్నూర్ ఆసిఫాబాద్ మంచిర్యాల తదితర ప్రాంతాల్లో హెలిప్యాడ్లను సిద్ధం చేయాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి సీఎం కేసీఆర్ సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యోగులంతా వీధుల్లోనే ఉండి సహాయక చర్యలు అందించేలా చర్యలు చేపట్టాలని ఎవరు కూడా అనవసరంగా బయటికి రాకుండా చూసుకోవాలని, భారీ వర్షాలతో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు సైతం అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం పర్యటించారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ చైర్మన్ మారుతి డోంగ్రే ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మారుతి డోంగ్రే కుటుంబ సభ్యులు మరియు ఇంద్రవెల్లి వ్యాపార వర్తక సంఘం నాయకులు మంత్రిని శాలువాలతో సత్కరించారు. అనంతరం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి ఇంటికి చేరుకుని, కుమ్ర ఈశ్వరిబాయిని పరామర్శించారు. ఈశ్వరీబాయి భర్త కుమ్ర రాజు ఇటీవల గుండెపోటుతో మరణించగా.. ఆమెని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుమ్ర రాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈశ్వరిబాయిని ధైర్యంగా ఉండాలని అందరం ఉన్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Also Read: Heavy Rains In Telangana: ఎగువ రాష్ట్రంలో వర్షం వచ్చినా ఆ ఊరికి వణుకే, ఎందుకో తెలుసా ?
Also Read: Heavy Floods: భారీ వరదలతో నిండుకుండల్లా మారిన జలాశయాలు, అప్రమత్తమైన అధికారులు!