Etala Rajendar: ఫైటింగ్ నేచర్ నాది, హూజూరాబాద్‌లో నేనే లీడర్ - మరోసారి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
Telangana BJP: ఈటల రాజేందర్ మరోసారి బీజేపీ నాయకత్వంపై అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో తానే లీడర్నని..తానే బీఫాంలు ఇస్తానని చెప్పుకొచ్చారు.

Etala Rajendar comments: హుజూరాబాద్ నియోజకవర్గానికి తానే లీడర్నని ఈటల రాజేందర్ ప్రకటించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బీ ఫారమ్‌లను తానే ఇస్తానని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటల రాజేందర్ అనుచరులకు కాకుండా ఇతరులకు పోటీ చేసే చాన్స్ వస్తోందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్‌లో 25 సంవత్సరాలుగా తాను లీడర్‌గా ఉన్నానని, బీజేపీ పార్టీకి సంబంధించిన బీ ఫారమ్‌లు తానే కేటాయిస్తానని ఈటల స్పష్టం చేశారు. "ఇక్కడి రాజకీయాల్లో నా పట్ల ప్రజలు, కార్యకర్తలు పూర్తి విశ్వాసం ఉంది. ఎవరైనా ఇబ్బంది పెడితే, నేనే ఫారమ్‌లు ఇస్తా" అని ప్రకటించారు.
హుజురాబాద్ పట్టణంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఈటల్ రాజేందర్, స్థానిక ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని.. బీసీలకు న్యాయం జరగాలని, కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. "కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ విషయంలో గందరగోళం సృష్టించింది. ముఖ్యమంత్రి ప్రజలను వంచించి, మోసం చేశారు" అని మండిపడ్డారు. బీజేపీ మొదటి నుంచి బీసీ రిజర్వేషన్‌లకు మద్దతు ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి "నిజాయితీ, చిత్తశుద్ధి లేవు" అని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను "అబద్ధాల పునాది, గోల్‌మాల్"గా అభివర్ణించిన ఈటల, హైదరాబాద్‌లో పేదల గుడిసెలు కూల్చివేసి, ప్రజల బతుకులు నాశనం చేసిందని ఆరోపించారు. "ప్రజలు కాంగ్రెస్‌ను 'థు' అని అంటున్నారు. గతంలో కేసీఆర్ వేధిస్తున్నాడని చతికిల పడిన పార్టీని గెలిపించి, ఇప్పుడు ప్రజలు, ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు" అని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించి, "ఆరు గ్యారంటీలు, హామీల గురించి మాట్లాడట్లేదు. గతంలో ఉన్నవే ఇవ్వమని ప్రజలు అడుగుతున్నారని గుర్తు చేశారు.
బీసీలకు బీజేపీ అండగా ఉంటుందని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ భరోసా.
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) October 10, 2025
42% బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేశారని విమర్శ.
కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పి, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్.#Telangana #BCReservations pic.twitter.com/LdYJg5JpNZ
ఈటల రాజేందర్ అంటే నిఖార్సైన ఉద్యమ బిడ్డ. ఎక్కడ అన్యాయమున్నా కొట్లాడే బిడ్డ. ఇది నేను బోందలోకి పోయినప్పుడే పోతది" అని ఎమోషనల్ గా ప్రకటించారు. తెలంగాణ చరిత్రలో తన పోరాటానికి 5 పేజీలు కేటాయించాలని, ఎక్కడ ఎవరు సమ్మెలు చేసినా ధర్మ యుద్ధం చేసినవాడిని అని ప్రకటించారు. "మీకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇస్తున్నాము. ఎవరికీ భయపడే వాళ్ళం కాదు. ఎప్పటికైనా ప్రజలకు తోడుగా అండగా ఉండేవాళ్ళం మేము" అని అనుచరులకు భరోసా ఇచ్చారు. పదవుల కోసం పెదవులు మూసేవారు కాదని, తన క్యారెక్టర్, కమిట్‌మెంట్, ఫైటింగ్ నేచర్‌తో పక్కా ప్రజల పక్షాన్ని ఉంటానని స్పష్టం చేశారు. ఎక్కడ ఎవరు సమ్మెలు చేసినా, ధర్మ యుద్ధం చేసిన, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసేది మేము. మీకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇస్తున్నాము. ఎవరికి భయపడే వాళ్ళం కాదని ప్రకటించారు.





















