అన్వేషించండి

HYDRA: పవర్‌ హౌస్‌ హైడ్రా ఎంట్రీతో అక్రమార్కులు పరార్ - రూ. 750 కోట్ల విలువైన భూమి స్వాధీనం

HYDRA: పవర్‌ హౌస్‌ హైడ్రా మరో అక్రమార్కుడిని పరుగులు పెట్టించింది. తప్పుడు పత్రాలతో 750 కోట్ల విలువైన భూమిని అప్పనంగా కాజేద్దనే పన్నాగానికి అడ్డంగా హైడ్రా బోర్డు పాతేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

HYDRA: హైదరాబాద్‌లో మరోసారి కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకుంది హైడ్రా. బంజారాహిల్స్‌లో షేక్‌పేటలో ఈ 750 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించింది. మొన్నటి వరకు అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టిన హైడ్రా ఇప్పుడు కబ్జాకు గురైన భూములపై ఫోకస్ చేసింది. ఓవైపు చెరువుల పునరుద్ధరణ, మరోవైపు కబ్జాభూముల స్వాధీనంతో ప్రజలన ప్రశంసలు అందుకుంటోంది. 

బంజారాహిల్స్‌లో కబ్జాకు గురైన స్థలంలో ఉన్న ఆక్రమణలను హైడ్రా ఇవాళ తొలగించింది. అక్రమార్కుల చెరలో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. దాదాపు రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది.  షేక్‌పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లోని స్థలాన్ని కొందరు వ్యక్తులు  ఆక్రమించి షెడ్‌లు వేసుకున్నారు. వాటిని తలగించింది హైడ్రా.

ఇప్పుడు స్వాధీనం చేసుకున్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో జలమండలికి 1.20 ఎకరాలను గతంలోనే ప్రభుత్వం కేటాయించింది. 1.20 ఎకరాలతోపాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెళ్లాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతోపాటు వేటకుక్కలను కాపలాగా పెట్టారు. 

కోర్టులో వివాదం ఉంటుండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డులు నిర్మించుకొని పహరా పెట్టారు. ప్రభుత్వ భూమిలోనే అడ్డా వేసుకొని మద్యం సేవించి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్టు హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. అనేక నివాస ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ నిర్మించాలని జలమండలి ప్రయత్నాలను కూడా పార్థసారథి అడ్డుకున్నారు. 

ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్న పార్థసారథి, కబ్జాకు గురైన భూమి గురించి హైడ్రాకు ఫిర్యాదు చేసిన జలమండలి, రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా కబ్జాదారులను పరుగులు పెట్టించింది. అక్కడ ఆక్రమణలు తొలగించి భూమిని అధికారులకు అప్పగించింది. ఫేక్ సర్వే నంబర్ (403/52)తో ప్రభుత్వ భూమి కొట్టేసే ప్రయత్నం చేసిన పార్థసారథిపై కేసులు పెట్టింది. పార్థసారధిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో 4 క్రిమినల్‌ను  రెవెన్యూ, జలమండలితో పెట్టించింది.  

వాస్తవానికి 403 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 బై నంబర్ వేసి పార్థసారథి ఆక్రమణలకు పాల్పడినట్టు నిర్ధారించింది హైడ్రా. ఆన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్‌తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేస్తున్నట్టు నిర్ధారించుకుంది. షేక్పేట రెవెన్యూ అధికారుల లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగించింది. పార్థసారథి వేసిన ఫెన్సింగ్‌తో పాటు లోపల ఉన్న షెడ్డులను తొక్కిపెట్టి పూడ్చేసింది. 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
Delhi Indira Gandhi International Airport: ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
Bandi Sanjay: హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Narasapur Vande Bharat: నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
Advertisement

వీడియోలు

Australia vs India 4th T20I Match Highlights | నాలుగో టీ20 లో గెలిచిన టీమిండియా | ABP Desam
వన్టే పోయే.. టీ20 అయినా..! ఈ బ్యాటింగ్‌తో డౌటే..
ఆసియా కప్ దొంగ బీసీసీఐకి భయపడి ఐసీసీ మీటింగ్‌కి డుమ్మా
సూపర్ స్టార్ హర్షిత్ రానా..  టీమ్‌లో లేకపోవటం ఏంటి గంభీర్ సార్..?
ప్రధాని మోదీకి మోదీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విమెన్స్ టీమ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
తెలంగాణలో బీసీలను మరింత దగ్గరయ్యేలా కాంగ్రెస్ మరో మాస్టర్ ప్లాన్!
Delhi Indira Gandhi International Airport: ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఏం జరిగింది? రన్‌వే పై వందల మంది ప్రయాణికుల వెయిటింగ్!
Bandi Sanjay: హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హిందువును ముస్లిం టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా - బోరబండలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Narasapur Vande Bharat: నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
నరసాపురం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్.. టైమింగ్స్ ఇవే..!
క్రూయిస్ కంట్రోల్‌తో Hero Xtreme 160R 2026 అవతార్‌ - లాంచ్‌కు ముందే డీలర్‌షిప్‌లలో ప్రత్యక్షం
2026 Hero Xtreme 160R షోరూమ్‌లలోకి ముందే వచ్చేసింది - కొత్త ఫీచర్లు, కొత్త అటిట్యూడ్‌
US Shutdown: ట్రంప్ కారణంగా రోడ్డున పడ్డ అమెరికా! చారిత్రక షట్‌డౌన్‌ కారణంగా 40 విమానాశ్రయాల్లో సర్వీస్‌లు రద్దు!
ట్రంప్ కారణంగా రోడ్డున పడ్డ అమెరికా! చారిత్రక షట్‌డౌన్‌ కారణంగా 40 విమానాశ్రయాల్లో సర్వీస్‌లు రద్దు!
Vijay Deverakonda : నేను నీకు బిగ్ ఫ్యాన్ - 90s చైల్డ్ ఆర్టిస్ట్‌కు విజయ్ దేవరకొండ బంపరాఫర్
నేను నీకు బిగ్ ఫ్యాన్ - 90s చైల్డ్ ఆర్టిస్ట్‌కు విజయ్ దేవరకొండ బంపరాఫర్
Whatsapp New Feature: సైబర్‌ నేరస్తుల బారీన పడకుండా ఉండేందుకు వాట్సాప్‌లో కొత్త సేఫ్టీ ఫీచర్‌
సైబర్‌ నేరస్తుల బారీన పడకుండా ఉండేందుకు వాట్సాప్‌లో కొత్త సేఫ్టీ ఫీచర్‌
Embed widget