BRS : స్పీడ్ పోస్టు, ఈమెయిల్ ద్వారా అనర్హతా పిటిషన్లు - పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటాడుతున్న బీఆర్ఎస్
BRS Mlas : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హతా పిటిషన్లు వేశారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో మెయిల్, స్పీడ్ పోస్టు ద్వారా స్పీకర్‌కు పంపారు.
Disqualification petitions : పార్టీ మారిన ఎంఎల్ఏ లపై అనర్హత పై బీ ఆర్ ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్,శాసన సభ సెక్రటరీ కి ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వెంటనే వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. స్పీకర్ ను కలిసి నేరుగా ఇచ్చేందుకు మొదట ప్రయత్నించారు. ాకనీ ఫోన్ చేసిన స్పందించకపోవడంతో ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా పిర్యాదు చేశారు.
స్పీకర్ సమయం ఇవ్వడం లేదు !
పార్టీ మారిన ఎమ్మెల్యే లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ తో పాటు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం పై స్పీకర్ కు పిర్యాదు చేశామని.. అపాయింట్ మెంట్ అడిగిన ఇవ్వలేదని జగదీష్ రెడ్డి ఆరోపించారు. పార్టీ కండువా మార్చిన రోజే సభ్యత్వం కోల్పోయినట్లు లెక్క అన్నారు. ఓట్లేసిన ప్రజలని మోసం చేస్తున్నారు... జాతీయ కాంగ్రెస్ విధానాలకు ఇది విరుద్ధమని గుర్తు చేశారు. అందుకే స్పీకర్ కు, సెక్రెటరీ కి మెయిల్ ద్వారా పిర్యాదు చేశామని ప్రకటించారు.
పార్టీ ఫిరాయింపుల పాపం కాంగ్రెస్‌దే
పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ.. కానీ ఇవాళ్నేమో సిగ్గు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఇంటింటికి వెళ్లి కండువాలు కప్పుతున్నాడని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులు మంచిది కాదన్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామని. ఫిరాయింపు జరిగిన రోజే.. లోక్‌సభలో కానీ, రాజ్యసభలో కానీ, అసెంబ్లీలో కానీ ఆ అభ్యర్థి యొక్క సభ్యత్వం రద్దయ్యే విధంగా చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. పాంచ్ న్యాయ్ సూత్రాల్లో కూడా దాన్ని చేర్చారు. ప్రజలు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి ఓట్లు వేశారు. ఓట్లు వేసిన ప్రజలను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు.
అప్పట్లో చట్ట ప్రకారమే కాంగ్రెస్ ఎల్పీ బీఆర్ఎస్‌లో విలీనం
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు చట్టం ప్రకారం మేం విలీనం అవుతాం అని చెప్పారు. ఆ మేరకు సీఎల్పీని చట్టబద్దంగా విలీనం చేశారని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. చేరికల విషయంలో కేసీఆర్ ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడలేదన్నారు. మీ సభ్యులకే మీ పార్టీపై విశ్వాసం లేక 23 మంది ఎమ్మెల్యేల మెజార్టీతో విలీనం చేశారని కోర్టు చెప్పిందన్నారు. ఇవాళ్నేమో సిగ్గులేకుండా ఇంటింటికి వెళ్లి కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారని.. కేసీఆర్ ఎవరికీ కండువాలు కప్పలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా నాడు బీఆర్ఎస్‌లో చేరారు అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.. పార్టీ మరిన వారిపై అనర్హతా వేటు వేసే వరకూ పోరాడతామన్నారు.