By: ABP Desam | Updated at : 23 Aug 2023 08:04 PM (IST)
Edited By: jyothi
ఎన్నికల్లో ప్రజలు ఆగమాగం కావద్దు, ధీరత్వం ప్రదర్శించాలి: సీఎం కేసీఆర్ ( Image Source : KCR Facebook )
CM KCR: ఎన్నికలు వస్తే ప్రజలు ఆగమాగం కావొద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మెదక్ భారీ బహిరంగ సభలో అన్నారు. ఎలక్షన్లు వచ్చిన సమయంలో ప్రజలు తమ ధీరత్వాన్ని ప్రదర్శించాలని సూచించారు. నిజమేది, అబద్ధమేది, వాస్తవమేది, అవాస్తవమేదని అంచనా వేసుకొని.. ఓట్లు వేయాలని అన్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారనేది తెలుసుకోవాలన్నారు. నిజమైన ప్రజా సేవకులను గుర్తించి వారికి గెలిపించుకుంటే.. బ్రహ్మాండమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అలాగే రైతన్నలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఓవైపు బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెబుతుందని, మరోవైపు కాంగ్రెస్ 3 గంటల కరెంటు చాలు అంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే ఘనపురం ఆయకట్టు గతంలో ఎప్పుడూ నీళ్లు రాలేదని కేసీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఛాన్స్ ఇవ్వండని అడుగుతున్నారని తెలిపారు. కాగ్రెస్, టీడీపీ అధికారంలో ఉన్నా ఘనపురంకు నీళ్లు కావాలంటే మెదక్ లో ఆర్డీఓ ఆఫీసు వద్ద ధర్నా చేయాలని సూచించారు.
ఎన్నికలు వస్తే ఆగమాగం కావొద్దు. ఎలక్షన్లు వచ్చిన సమయంలో ప్రజలు తమ ధీరత్వాన్ని ప్రదర్శించాలి. నిజమేంది.. వాస్తవమేంది.. ఎవరు ఏం మాట్లాడుతున్నారు. నిజమైన ప్రజా సేవకులను గుర్తించినట్లు అయితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి : మెదక్ సభలో సీఎం శ్రీ కేసీఆర్. pic.twitter.com/7vuPJ3C5xk
— BRS Party (@BRSparty) August 23, 2023
ప్రతీ సంవత్సరం ధర్నా చేస్తే తప్పు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. ఘనపురం కాల్వలో తమ్మ చెట్లు మెలిచాయన్నారు. కానీ తాను సీఎం అయ్యాకా పద్మా దేవేందర్ రెడ్డి సర్వే చేసి, ఘనపురం ఎత్తు పెంచుకున్నామని స్పష్టం చేశారు. 30 నుంచి 40 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామని వెల్లడించారు. గత కాంగ్రెస్ నాయకులు సింగూరు ప్రాజెక్టుకు హైదరాబాద్ కు దత్తత ఇచ్చి ఇక్కడ మన పొలాలు ఎండబెట్టారని గుర్తు చేశారు. కానీ ఈరోజు సింగూరును మెదక్ కే డెడికేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని.. దీనివల్లే జోగిపేట ప్రాంతంలో నీళ్లు పారుతున్నాయన్నారు. ఘనపురం ఆయకట్టు కింద ఒక గుంట ఎండిపోకుండా పంటలు పండించుకుంటున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ రాకముందు అన్నదాతలు అంతా హైదరాబాద్ వచ్చి ఆటోలు నడుపుకునే స్థాయికి దిగజారిపోయారని అన్నారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కాళేశ్వరం నీళ్లు రప్పించుకొని రైతుల సమస్యలు పరిష్కరించుకున్నామని వివరించారు.
రైతన్నలారా తస్మాత్ జాగ్రత్త!
— BRS Party (@BRSparty) August 23, 2023
మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్నది - బీజేపీ
3 గంటల కరెంటు చాలు అంటున్నది - కాంగ్రెస్ pic.twitter.com/2XGHaRzrZn
రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తూ.. అన్నదాతల అభివృద్ధికి కృషి చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తూ.. అన్నదాతలకు అధిక దిగుబడి వచ్చేలా చేస్తున్నామని అన్నారు. మెదక్ లో పారే హల్దీ వాగు, మంజీరా వాగులపై దాదాపు 30 నుంచి 40 చెక్ డ్యాంలు కట్టుకొని ఆ నదులు 365 రోజులు సజీవంగా ఉండేలా చేసుకుంటున్నామన్నారు. కాళేశ్వరంలో భాగంగా మల్లన్న సాగర్ ద్వారా అక్కడి నుంచి అవసరం ఉన్నప్పుడల్లా వాగుల్లో నీళ్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. చెక్ డ్యాంలు మత్తళ్లు దుంకుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.
TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ - బతుకమ్మ, దసరాకు 5265 ప్రత్యేక బస్సులు
PM Modi in Mahabubnagar: తెలంగాణలో వారి చేతుల్లో కారు స్టీరింగ్! ఈరోజు రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు నిద్రపట్టదు: ప్రధాని మోదీ
KTR about Balka Suman: బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే బాల్క సుమన్ మంత్రి అవుతారా? మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు అర్థమేంటి!
PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
MLA Raja Singh: దమ్ముంటే ఆ పని చేయండి - సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్
Chandrababu Arrest: చంద్రబాబు ఓ క్రిమినల్, అందుకే అరెస్ట్ చేశారు - స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు
'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!
అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు
/body>