Huzurabad And Badvel By Election: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..
ఈ నెల 30న తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలోని కడప జిల్లాలో బద్వేల్‌లో పోలింగ్ జరగనుండగా.. బుధవారం రాత్రి 7 గంటలకు ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. స్థానికేతరులు బయటకు వెళ్లాలని ఈసీ ఆదేశించింది.
Huzurabad And Badvel By Election: హజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం బుధవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. దాంతో మైకులు మూగబోయాయి. ప్రధాన పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగింది. హుజూరాబాద్‌లో మొత్తం 30 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా, రెండు ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు. ఒక దాంట్లో 16, మరో దాంట్లో 16 మంది అభ్యర్థులకు ఓటు వేయవచ్చు.
ఈ నెల 30న తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలోని కడప జిల్లాలో బద్వేల్‌లో పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 2న ఫలితాలు ప్రకటిస్తారు. బద్వేల్ ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రచారం ముగియడంతో స్థానికేతర నేతలు, ప్రజా ప్రతినిధులు నియోజకవర్గాల నుంచి బయటకు వెళ్లాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
Also Read: చివరి నిముషంలో కుట్రలు జరుగుతాయి.. ఓటర్లకు అన్నీ తెలుసు.. మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
ఏ రకమైన ప్రచారానికైనా అనుమతి లేదు...
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి ఎన్నికల ప్రచారానికైనా అనుమతి లేదు ఈసీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అనుసరించి చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. నిషేధఆజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం 72 గంటల ముందే అంటే బుధవారం రాత్రి 7 గంటలతో ప్రచారం ముగిసింది. ఇప్పటి నుంచి 72 గంటల పాటు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. ర్యాలీలు, గుంపులు గుంపులుగా కనిపించడం గాని ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం గానీ, సోషల్ మీడియాలో ప్రచారం చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read: హుజురాబాద్‌లో హోరెత్తిన ప్రచారం ! "ఫేక్" ప్రచారాలనే నమ్ముకున్న పార్టీలు !
ముగిసిన బద్వేలు ఉపఎన్నిక ప్రచారం..
కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ప్రచారం బుధవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. అక్టోబర్ 30న ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు పోలింగ్ జరగనుంది. ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహించనున్న అధికారులు. నవంబర్ 2న బద్వేలు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. బద్వేలు ఉపఎన్నికకు 281 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, బద్వేలు ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారిగా కేతన్ గార్గ్ ఉన్నారు. మొత్తం 15 మంది బద్వేలు ఉపఎన్నిక బరిలో నిలిచారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా డా.సుధ, బీజేపీ అభ్యర్థి సురేష్, కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ బరిలో ఉన్నారు.