అన్వేషించండి

Bandi Sanjay Letter to Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ బండి సంజయ్‌ బహిరంగ లేఖ, ఈసారి డిమాండ్ ఏంటంటే!

Sircilla Handloom Workers:ఎంపీ బండి సంజయ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో పర్యటిస్తున్నారని తెలిసిందే.

Bandi Sanjay Open Letter to Revanth Reddy: కరీంనగర్: బీజేపీ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో పర్యటిస్తున్నారని తెలిసిందే. అయితే సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ బండి సంజయ్ (BJP MP Bandi Sanjay) సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 

బండి సంజయ్ రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలివే..
‘సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ రంగంపై ఆధారపడ్డ 20 వేల మంది కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 33 వేల మరమగ్గాలుండగా, ఇందులో 28 వేల మగ్గాలపై పాలిస్టర్‌ వస్త్రాలు, 5 వేల మగ్గాలపై కాటన్‌ వస్త్రాలు తయారవుతున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడం, పాలిస్టర్‌ బట్టకు గిట్టుబాటు ధర, సరైన మార్కెట్‌ లేకపోవడంతో సిరిసిల్లలో సాంచాలను బంద్‌ పెట్టారు. దీనికి ప్రధాన కారణం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలే

గత ఏడేళ్లుగా ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధార పడి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మనుగడ సాగిస్తోంది. వస్తోత్పత్తిదారులు సొంతంగా వస్త్ర వ్యాపారం చేయడం లేదు. ప్రధానంగా బతుకమ్మ చీరలకు సంబంధించి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్మికులకు రూ.220 కోట్లను బకాయి పెట్టింది. ఈ బకాయిలు రాకపోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ బకాయిలను చెల్లిస్తామని అప్పటి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పలుమార్లు హామీ ఇచ్చినా చెల్లించలేదు. చివరకు ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి బకాయిలు చెల్లించలేదు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మీరు ఈ మొత్తం  బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతున్నా. అట్లాగే ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్ల కార్మికులు ఉపాధి పొందుతున్న క్రమంలో మీరు ప్రత్యేక చొరవ తీసుకొని భారీగా ప్రభుత్వ ఆర్డర్లను ఇచ్చి సిరిసిల్ల కార్మికులను ఆదుకోవాలని’ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ‘‘వర్కర్‌ టు ఓనర్‌’’ పథకం..
సిరిసిల్లలో నేత కార్మికులను ఓనర్లుగా మార్చేందుకు 2017 అక్టోబర్‌ 11న అప్పటి సీఎం కేసీఆర్ ‘‘వర్కర్‌ టు ఓనర్‌’’ పథకం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తొలి విడతలో ఈ కార్యక్రమానికి రూ.220 కోట్లను కేటాయిస్తున్నామని, 1104 మంది కార్మికులను మొదటి దశలో ఓనర్లుగా మారుస్తామని ప్రకటించారని బండి సంజయ్ తెలిపారు. కానీ ఇంతవరకు ఇవి అమలు కాలేదని.. మీరు కార్మికుల సంక్షేమం కోసం తక్షణమే ఆ నిధులు కేటాయించి నేత వర్కర్లను ఓనర్లుగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని రేవంత్ రెడ్డిని కోరారు.
సిరిసిల్లలో మరమగ్గాలను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరమగ్గాల ఆధునీకరణకు అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అట్లాగే సిరిసిల్లలో మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు పంపితే దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని బండి సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget