అన్వేషించండి

Adilabad: ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!

Telugu News: బావి మీద గణేష్ నిమజ్జన వేడుకలను ఎలా ప్రారంభించారు? ఆఖరి రోజు ఏమేం పూజలు చేశారు? ఈ నిమజ్జనం ఎన్ని రోజులపాటు కొనసాగుతుంది? అనే విషయాలపై ఏబీపీ దేశంతో నిర్వాహకులు వివరించారు.

Adilabad Ganesh Immersion: ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జనం వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమార్ జనతా గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన 52 అడుగుల నూతి మీది గణేష్.. నేడు 11వ రోజున ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేస్తున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ నూతి పంపు మోటర్ స్విచ్ ఆన్ చేసి ఈ నిమజ్జన వేడుకలను ప్రారంభించారు. నూతి మీద ఏర్పాటు చేసిన భారీ 52 అడుగుల గణేష్ విగ్రహం పైన కింద నూతి నుండి పైకి మోటర్ పైపు సహాయంతో నీళ్లు వదులుతూ నిమజ్జనం చేస్తున్నారు. నూతి మీది గణేష్ ఆదిలాబాద్ లో చాలా ఫేమస్ ఈ గణేష్ నిమజ్జన వేడుకలను తిలకించడానికి స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఎంతమంది భక్తులు తరలివచ్చి నిమజ్జనాన్ని తిలకిస్తూ సంబరపడిపోతున్నారు. పలువురు సెల్ ఫోన్లలో బంధిస్తూ సెల్ఫీలు దిగుతూ తమ వాట్సాప్ గ్రూపులలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 


Adilabad: ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!

నూతి మీది గణేష్ నిమజ్జన వేడుకలను ఎలా ప్రారంభించారు? చివరి రోజు ఇక్కడ ఏమేం పూజలు చేశారు? ఈ నిమజ్జనం ఎన్ని రోజులపాటు కొనసాగుతుంది? అనే విషయాలపై ఏబీపీ దేశంతో.. కుమార్ జనతా గణేష్ మండల్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు తోట పరమేశ్వర్ తో పాటు ఈ భారీ గణేష్ విగ్రహాన్ని తయారు చేసిన ఉరే గణేష్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు 11వ రోజు చివరి నిమజ్జన వేడుకలను అన్ని ప్రాంతాల్లోనూ శాంతియుతంగా నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమార్ జనతా గణేష్ మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 52 అడుగుల భారీ గణేష్ నిమజ్జన వేడుకలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నూతిమీది మోటారు స్విచ్ ఆన్ చేసి నిమజ్జన వేడుకలను ప్రారంభించారు. నూతిమీది గణపతి అనే దీనికి ప్రత్యేక పేరు ఉంది అదిలాబాద్ జిల్లాలోని ఈ నూతిమీది గణపతి చాలా ఫేమస్. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి సైతం భక్తులు వచ్చి ఈ నూతి నిధి గణపతిని తిలకిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. ప్రతియేటా ఒక్కో అడుగు పెంచుతూ ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఈ ఏడాది తో ఈ నూతి మీద గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేయడం 54 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. వర్షం కారణంగా 52 అడుగుల గణేష్ మాత్రమే ఇక్కడి నిర్వాహకులు తయారు చేశారు. భక్తులు గత ప్రతిష్టించిన రోజు నుండి నేడు చివరి నిమజ్జనం వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రంపూట ప్రత్యేక పూజల నడుమ హారతులు ఇస్తూ గణనాథుడికి పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. నేడు చివరి రోజు నిమజ్జనం సందర్భంగా నిర్వాహకులు గణనతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ చేతుల మీదుగా నిమజ్జనం ప్రారంభించారు. 


Adilabad: ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!

పూర్వకాలంలో ఇక్కడ నూతి ఉండేది ఈ నూతి మీద 53 ఏళ్ల క్రితం గణేష్ ఉత్సవాలు ప్రారంభించగా అది నేటి వరకు కొనసాగుతా వస్తుంది. గత 20 ఏళ్లుగా తోట పరమేశ్వర్ అధ్యక్షునిగా వారి ఆధ్వర్యంలో భారీ వినాయకులను ఏర్పాటు చేయడం కొనసాగుతా వస్తోంది ఈ ఏడాది 52 అడుగుల భారీ వినాయకుడిని తయారు చేశారు. ఇక్కడ నూతి మీద గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించి నిమజ్జనం కూడా అక్కడే చేయడం దీని యొక్క ప్రత్యేకత. ఈ భారీ వినాయకుడిని తిలకించేందుకు సోదర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి వ్యక్తులకిస్తూ ఎంతో సంబరపడిపోతూ దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. నిమజ్జనం రోజు భాజా భజంత్రీల మధ్య మధ్య రంగులు చల్లుకుంటూ అందరూ నృత్యాలు చేస్తూ నిమజ్జనం ఘనంగా జరుపుకున్నారు. పోలీసులు ప్రత్యేక బంధ బస్సులు ఏర్పాటు చేసి ఇలాంటి అవాంఛనీయ ఘటనను చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. 

ఈ భారీ గణేష్ విగ్రహాన్ని తయారు చేయడానికి సుమారుగా 45 రోజుల సమయం పట్టిందని నేడు నిమజ్జనం చేస్తుంటే తమకు కొంత బాధగా ఉందని విగ్రహం తయారు చేసిన ఉరే గణేష్ ఏబీపీ దేశంతో తెలిపారు. ఈ 52 అడుగుల భారీ గణేష్ విగ్రహా నిమజ్జనానికి 24 గంటల సమయం పడుతుందని నూతి మీద ఏర్పాటుచేసిన ఈ గణేష్ విగ్రహం పైన మోటార్ పైపు సహాయంతో పైనుండి నీటిని వదలడం జరుగుతుందని, ఆ నీటితో ఇక్కడే విగ్రహం పూర్తిగా కరిగిపోతుందని సుమారుగా 24 గంటల సమయం పడుతుందని వారు తెలిపారు. నూతిమీది గణేష్ నిమజ్జనం చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఏబీపీ దేశంతో మాట్లాడుతూ.. 52 అడుగుల భారీ గణేష్ విగ్రహం ఆదిలాబాద్ లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, దీన్ని ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేయడం దీని యొక్క ప్రత్యేకత అని, తాము ఇక్కడి వాసులైన హైదరాబాద్ లో చదువులకు కోసం వెళ్లి ఈ నిమజ్జన వేడుకలను చూడడానికి చివరి రోజు రావడం జరిగిందని, భారీ గణేష్ ని చూసి చాలా సంతోషంగా ఉందని, ఈ భారీ గణేష్ నిమజ్జనం మోటర్ పైపు సహయంతో నిమజ్జనం చేయడం కళ్ళారా తొలిసారిగా చూస్తున్నామని, బై బై గణేశా అంటూ నిమజ్జనం వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

US Election Results 5 Reasons for Kamala Harris Defeatజగనన్నపై కారుకూతలు కూస్తార్రా? ఇక మొదలుపెడుతున్నా!Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Ghaati Glimpse: తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
తల కోసేసి చేత్తో పట్టుకుని - నెవర్ బిఫోర్ రోల్‌లో అనుష్క!
YS Jagan: ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
Pawan Kalyan: సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
Snow In Desert: మంచుకొండలుగా సౌదీ ఎడారులు - ఇలాంటివి కాలజ్ఞానంలోనూ చెప్పలేదుగా !
మంచుకొండలుగా సౌదీ ఎడారులు - ఇలాంటివి కాలజ్ఞానంలోనూ చెప్పలేదుగా !
YS Jagan On DGP: అందర్నీ గుర్తు పెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం - పోలీసు అధికారులకు జగన్ హెచ్చరికలు
అందర్నీ గుర్తు పెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం - పోలీసు అధికారులకు జగన్ హెచ్చరికలు
Embed widget