Hanamkonda: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. పేరెంట్స్ లో టెన్షన్.. టెన్షన్..
కరోనా పంజా విసురుతూనే ఉంది. హన్మకొండ జిల్లాలో కొవిడ్ కలకలం రేపింది. విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
హనుమకొండ జిల్లాలో విద్యార్థులకు కరోన సోకడం ఆందోళన కలిగిస్తోంది. కేసులు తగ్గుతున్నాయనుకున్నా.. సమయంలోనే మళ్లీ పెరుగుతున్నాయి. కరోన కేసులు మళ్ళీ నమోదు కావడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. భీమదేవరపల్లి మండలం వంగర పీవీ రంగారావు తెలంగాణా రాష్ట్ర గురుకుల విద్యాలయంలో ఐదుగురు విద్యార్థులు రెండు రోజులుగా కరోన వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. దీనిని గుర్తించిన హాస్టల్ వార్డెన్ ఐదుగురు విద్యార్థులకు కరోన పరీక్షలు చేయించారు. వారికి కొవిడ్ పాజిటివ్ గా నిర్దారణైది. వెంటనే విద్యార్థులను ప్రత్యేక గదులకు తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గురుకులం లోని అందరి విద్యార్థులకు వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిందని సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై గురుకుల పాఠశాలకు చేరుకుంటున్నారు.
ఇటీవలే కాటారం గురుకులంలోనూ..
భూపాలపల్లి జిల్లా కాటారం గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటీవ్ రావడంతో తోటి విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. నలుగురు విద్యార్థులకు ఇటీవలే కొవిడ్ పాజిటీవ్ రావడంతో మిగిలినవారికి పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ గురుకుల పాఠశాలలో 380 మంది విద్యార్థులు ఉన్నారు.
బాలికల పాఠశాలలోనూ కొవిడ కలకలం
ఇటీవలే.. నల్గొండ జిల్లాలోని ఎస్టీ బాలికల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఎస్టీ బాలికల పాఠశాలలో కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు 8 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణఅయ్యింది. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులను, ఉపాధ్యాయులకు ప్రత్యేక గదుల్లో చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా వీరితో సన్నిహితంగా ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేశారు. చాలా పాఠశాలలో ఇదే పరిస్థితి ఉందని, అయితే బయటకు రావడంలేదు.
Also Read: Pochampally: తెలంగాణ పల్లెకు అరుదైన గుర్తింపు... బెస్ట్ టూరిస్ట్ విలేజ్ అవార్డుకు ఎంపికైన పోచంపల్లి
Also Read: Warangal Airport: వచ్చే ఏడాది నుంచి వరంగల్‌కు విమానాలు... ఏఏఐను తుది నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం
Also Read: AP Highcourt : అమరావతి ప్రజలందరి రాజధాని.. విచారణలో హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు !
Also Read: AP Mlc Elections: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల... నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ
Also Read: వచ్చే ఏడాది నుంచి వరంగల్‌కు విమానాలు... ఏఏఐను తుది నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం